మహిళల ఆర్ధిక స్వావలంభనకే కాపునేస్తం..


Ens Balu
2
Vijayawada
2020-11-07 16:34:31

మహిళల ఆర్ధిక స్వావలంభన కోసమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం డా.వైఎస్సార్ కాపునేస్తాన్ని తీసుకొచ్చిందని కాపుకార్పోరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో కాపులకు ప్రతీ ఏటా రూ. 1000 కోట్లమేర ప్రయోజనం కల్పిస్తామని వాగ్ధానం ఇచ్చి హామీని నెరవేర్చలేదన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ప్రతీ ఏటా కాపులకు రూ. 2 వేలకోట్ల చొప్పున ఐదు సంవత్సరాల్లో రూ. 10 వేల కోట్ల రూపాయలను అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి 14 నెలల సమయంలోనే వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూ. 6 వేల కోట్ల పైబడి ప్రయోజనం కల్పించడం జరిగిందన్నారు. జగనన్న అమ్మఒడి ద్వారా రూ. 572 కోట్లు, జగనన్న వసతి దీవెన క్రింద రూ. 93 కోట్లు, జగనన్న విద్యాదీవెన క్రింద రూ. 367 కోట్లు, వై.యస్ఆర్ వాహనమిత్ర ద్వారా రూ. 57 కోట్లు, వైయస్ఆర్ పెన్షన్ కానుక క్రింద రూ. 1706 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా రూ. 14 కోట్లు, జగనన్న నేతన్న నేస్తం ద్వారా రూ. 1240 కోట్లు, వైయస్ఆర్ ఆసరా ద్వారా స్వయంసహాయక మహిళా గ్రూపులకు రూ. 697 కోట్లు ప్రయోజనం చేకూర్చామన్నారు. 2019-20, 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రైతుభరోసా ద్వారా 7,56,107 మంది రైతులకు, కౌలురైతులకు రూ. 1497 కోట్లు నేరుగా నగదు బదిలీపధకంలో ప్రయోజనం కల్పించామన్నారు. వీటికి అదనంగా వైయస్ఆర్ లానేస్తం, జగనన్నతోడు పధకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని జక్కంపూడి రాజా తెలిపారు. హౌస్ సైట్స్ పధకం ద్వారా రాష్ట్రంలోని 2,56,424 మంది లబ్దిదారులకు రూ. 516.71 కోట్ల మేర ప్రయోజనం కలగజేస్తున్నామన్నారు. వైయస్ఆర్ సంపూర్ణ పోషణపధకం ద్వారా 1,50,800 మంది లబ్దిదారులకు రూ. 93.16 కోట్ల మేర ప్రయోజనం అందజేస్తున్నట్లు జక్కంపూడి రాజా తెలిపారు. అర్హతే ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం పధకాలను అమలు చేస్తున్నదని, గత ప్రభుత్వం మాదిరిగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉండే నైజం తమదికాదని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి కాపులకు అన్ని విధాల అండగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. ఈసమావేశంలో తొలుత లబ్దిదారులకు రూ. 143 కోట్ల రూపాయల చెక్కును మంత్రి అందజేసారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్, కాపు కార్పోరేషన్ యండి శ్రీనివాస శ్రీ నరేష్, జనరల్ మేనేజరు (ఫైనాన్స్) పి.స్రవంతి, ఓయస్‌డి డి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.