ఐఏఎస్ లు ఏడు రోజులు ప్రజల్లోనే..
Ens Balu
3
Velagapudi
2020-11-10 08:50:53
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ శాఖలను ప్రక్షాలన చేయడంతోపాటు, ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించే దిశగా వినూత్నంగా అడుగులు వేస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను శతశాతం ప్రజలకు ఉపయోగపడేలా చేయడంతోపాటు, మిగిలిన శాఖల్లోని అధికారుల్లో కూడా చలనం తెప్పించడానికి నడుంబిగించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రిప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సైతం రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా జిల్లాల్లోని కలెక్టర్లు, జెసిలను కూడా ఏడు రోజుల పాటు ప్రజల్లోనే ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఏప్రభుత్వ శాఖను తనిఖీ చేసినా అక్కడ ప్రజలకు అందించే సేవల విషయంలో తేడాలొస్తే తక్షణమే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకూ వారంతో మూడు రోజులు మాత్రమే పర్యటించే జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర ఐఏఎస్ అధికారులు కూడా ఇపుడు వారంలోని 6 రోజులు పర్యటనలో ఉండటంతోపాటు, మిగిలిన ఒక్క రోజు స్పందన లాంటి కార్యక్రమాలు నిర్వహించే దిశగా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు జారీచేయడంతో జిల్లా కలెక్టర్లు, జెసిల తమ పర్యటన వారం రోజుల షెడ్యూలు ఖారారు చేసుకుంటున్నారు. తద్వారా ఆడుతూ, పాడుతూ పనిచేసే సిబ్బందికి, అధికారులకు అసలు ప్రభుత్వ విధులు ఎలా చేయాలనే అంశంపై క్లారిటీ వచ్చేటట్టు కనిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం కూడా లేకపోలేదు...విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ప్రవీణ్ ప్రకాష్ కి గ్రామసచివాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ శాఖల నిర్వహణ అంతా గందర గోళంగా ఉండటంతో లాభం లేదనుకున్న ప్రవీణ్ ప్రకాష్ జిల్లా కలెక్టర్లను సమాయాత్తం చేశారు. మీరు ప్రజల్లో ఉంటేనే ఇతర ప్రభుత్వ శాఖ అధికారులు పనులు చేస్తారు, ప్రజలకు సేవలు అందుతాయి లేదంటే అంతా తేడాగానే వుంటుందంటూ సూచించడం రాష్ట్రంలోనే హాట్ టాపి గా మారింది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ఇదే విషయాన్ని వీడియో కాన్ఫరెన్సు ద్వారా కూడా రాష్ట్రంలోని అందరు జిల్లా కలెక్టర్లకి దిశా నిర్ధేశం చేయనున్నారు. ఇన్నేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు సేవలు చేరువ చేయడంలో మంచి ఫలితాలను ఇస్తాయన్న నమ్మకం కలిగే విధంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యవహరించడం హాట్ టాపిక్ గా మారింది..