గ్రామ సచివాలయ అభ్యర్ధులకు మరో గోల్డన్ ఛాన్స్...
Ens Balu
2
Velagapudi
2020-11-10 10:39:03
గ్రామసచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు రాసిన అభ్యర్ధులకు గోల్డెన్ ఛాన్స్ పలుకరించనుంది. రాష్ట్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డిఎస్సీ ఉద్యోగాల్లోకి కొందరు గ్రామసచివాలయ ఉద్యోగాలకు రిజైన్ చేసివెళ్లిపోయారు. వాటితో సచివాలయ గ్రేడ్4 కార్యదర్శిలకు కూడా ప్రస్తుతం గ్రామసచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు పాత ఉద్యోగాలను వదిలి కొత్తగా వచ్చిన ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు(గ్రామసచివాలయ జీతం కంటే దానికి జీతం ఎక్కువ, క్యాడర్ కూడా ఎక్కువ) దీనితో మొన్న పరీక్షలు రాసిన గ్రామసచివాలయ అభ్యర్ధులతో మిగిలిన ఖాళీలన్నీ ప్రభుత్వం భర్తీచేయాలని ఆదేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రోస్టర్ పాయింట్లు మారుస్తూ జాబితాలు తయారు చేస్తున్నారు. ఇలా చేయడం వలన మార్కులు కాస్త తక్కువ వచ్చిన వారికి కూడా రోస్టర్ లో ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ వుంది. ఒక్క రెండు ఉద్యోగాలతోనే కాకుండా గ్రామసచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు మిగతా శాఖల్లోనూ, కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగాలకు కూడా పరీక్షలు రాసి ఉండటంతో అవి కూడొ ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడటంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది సచివాలయ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రిజైన్ చేశారు. అలా గ్రామసచివాలయాల్లో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఆ ఖాళీలన్నీ ఒకేసారి భర్తీచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ క్రమంలో ఒకటి అరా మార్కులు తక్కువ వచ్చిన వారికి కూడా ఖాళీ అయిన ఉద్యోగాల్లో కొన్ని ఉద్యోగాలు తగిలే అవకాశం వుంది. దీంతో నిరుద్యోగులకు గ్రామసచివాలయ ఉద్యోగాల వస్తాయనే ఆశ కూడా పెరుతుంది. అంతేకాకుండా కొంతమంది గ్రూప్-1 ఉద్యోగాల్లో ప్రిలిమ్స్ అయిపోయి, మెయిన్స్ కోసం వెయిట్ చేస్తున్నవారు కూడా రాష్ట్రవ్యాప్తం చాలా మందే ప్రస్తుతం కార్యదర్శిలుగా పనిచేస్తున్నారు. వారు కూడా గ్రూప్1 మెయిన్స్ తీసినా, అందులో క్వాలిఫై అయినా మరికొంత మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వుంది. అయితే ఆ గోల్డెన్ ఛాన్స్ ఎప్పుడు ఎవరిని వరిస్తుందనేనది మరో పదిరోజుల్లో తేలనుంది.