ఏపీలో ముఖ్యమైన శాఖలతోనే కొత్తజిల్లాలు..
Ens Balu
2
వెలగపూడి
2020-11-10 15:22:06
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాల్లో అన్ని శాఖలకు జిల్లా అధికారులను కొత్తగా నియమిస్తారా అంటే అదే కాదు ఉన్న శాఖల అధికారులను కుదింపు చేసి కొత్త జిల్లాలకి అధికారులను, సిబ్బందిని ఏర్పాటు చేస్తారని ఉన్నతాధికారుల నుంచి సమాధానం వినిపిస్తుంది.. నిజమే.. దానికి కూడా కారణం లేకపోలేదు ప్రభుత్వం 2021లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినా, జిల్లా కలెక్టర్, జెసిలను మాత్రమే ఏర్పాటు చేసి, ప్రస్తుతం ఐటీడీఏల్లో పీఓ, సబ్ కలెక్టర్ అన్ని ప్రభుత్వ శాఖలను ఎలా లీడ్ చేస్తున్నారో ఆ స్థాయిలోనే ముఖ్యమైన 15 శాఖలకు మాత్రమే అధికారులను ఏర్పాటు చేసి కొత్తజిల్లాల్లో పాలన ప్రారంభిస్తారని చెబుతున్నారు. అలాకాకుండా ప్రస్తుతం ఉన్న జిల్లాల మాధిరిగా అన్నిశాఖలకు జిల్లా అధికారులను ఏర్పాటు చేయాలంటే సుమారు 90 ప్రభుత్వ శాఖలకు జిల్లా అధికారులను నియమించాల్సి వుంటుంది. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో ప్రధాన జిల్లాలను ముఖ్యంగా ఐదు లేదా ఆరు జోన్లు ఏర్పాటు చేసి, అక్కడ మాత్రమే అన్ని శాఖలకు అధికారులను ఏర్పాటు చేసి, వాటిని రీజియన్లుగా మార్చి మిగిలిన జిల్లాల్లోని అధికారులను అన్నిజిల్లాలకు కొత్తశాఖల అధికారులుగా నియమించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. అలాకాకపోతే ప్రస్తుతం డివిజన్ కార్యాలయాల్లో అన్ని శాఖలు ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతం జరిగే పరిస్థితి లేదు. దానికోసమే ప్రభుత్వం ఇటీవలే అన్నిజివిన్లలో డివిజనల్ అభివ్రుద్ధి అధికారులను ఏర్పాటు చేసింది. అదే స్థాయిలో జిల్లా అధికారులను ఏర్పాటు చేసి కొత్త జిల్లాల్లో పరిపాలన సాగించాలన్నది ప్రభుత్వ ఆలోచన లేదంటే కొత్తగా ఏపీలో సుమారు 28 జిల్లాలు ఏర్పాటు చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి అన్నిశాఖలకు జిల్లా అధికారులు, కార్యాలయాల్లో మినిస్టీరియల్ సిబ్బందిని నియమించాలంటే కనీసం 25వేల నుంచి 38 వేల మందిని కొత్తగా నియమించాల్సి వుంటుంది. అందులో గ్రూప్ 1, గ్రూపు2, గ్రూప్3, గ్రూప్ 4 అత్యధికంగా ఉద్యోగాలను తీస్తే తప్పా కొత్త జిల్లాలకు అధికారులు, సిబ్బంది సరిపోరు. అలాకాకుండా ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటిడిఏల్లో మాదిరిగా ఇద్దరు ఐఏఎస్ అధికారులను నియమించి, డివిజన్ లో ఉన్న అధికారులు, సిబ్బందికి ప్రమోషన్లు ఇస్తే వారిని ఆయాశాఖలకు అధికారులుగా వినియోగించుకునే సౌకర్యం వుంటుంది. అపుడు అత్యధికంగా ఉద్యోగాలు తీసే పరిస్థితి కూడా వుండదు. కేంద్రం ఇచ్చిన ఐఏఎస్ అధికారులతో కొన్నేళ్లు పాలన నడిపించి తరువాత మెల్లగా అన్నిశాఖలకు స్టేట్ కేడర్, రీజియన్ కేడర్, డిస్ట్రిక్ట్ కేడర్, డివిజన్ కేడర్ అధికారులను నియమించుకునే అవకాశం వుంటుంది. ప్రస్తుతం కొత్తగా జిల్లాలు ఏర్పాటైతే చాలా మంది కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని భావిస్తున్నా, తొలుత ప్రభుత్వ కార్యాలయాలకు అనుగుణంగా జిల్లాలను ఏర్పాటు చేసి ఉన్న అధికారులతో తొలుత జిల్లాలను ప్రారంభించాలని చూస్తుంది ప్రభుత్వం. దానికి కారణం ముందుగానే అన్ని గ్రామసచివాలయాలకు 11శాఖల్లో సిబ్బందిని ఏర్పాటు చేయడమే దానికి ముఖ్య కారణంగా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వ పూర్తిస్థాయి ఆలోచన ఏవిధంగా ఉండబోతుందనేది కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే తప్పా ఒక క్లారిటీ రాదు...