విశాఖలో మనిషి తలను నిప్పులపై కాల్చుకొని తింటూ...
Ens Balu
11
Relliveedhi
2020-08-16 13:06:46
విశాఖ రెల్లివీధిలో మనిషి తల కలకలం రేపింది.. పాడుబడ్డ ఇంట్లో మనిషి తలను కాల్చుకుని తింటున్న ఓవ్యక్తిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అతడిని గమనిస్తున్నారని తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిపై ఒంటరిగా ఉంటూ రావేలపూడి రాజు(20) అనే వ్యక్తి సైకోగా మారాడని స్థానికులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే నిందితుడిపై సస్పెక్ట్ షీట్ ఉందని పోలీసులు చెప్పారు. సైకో తీసుకొచ్చిన తల ఎవరిది? ఎక్కడైనా హత్య చేసి తలను తీసుకొచ్చాడా? లేక ఏదైనా స్మశానంలో శవం తల దొరికితే తీసుకొచ్చి తినేందుకు ప్రయత్నించాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..అసలే కరోనా సమయంలో ఏ వ్యక్తి తలను తీసుకొచ్చాడోనని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. చిన్నపిల్లలను ఎవరినీ బయటకు రానీయకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడటం కనిపించింది...