సమగ్ర భూసర్వే పరిష్కారాలకు ప్రత్యేక ట్రిబ్యునల్..సీఎం


Ens Balu
2
SACHIVALAYAM
2020-08-31 17:20:52

ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూ సర్వే పరిష్కారాల కోసం ప్రత్యేక ట్రిబ్యున్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర రెవిన్యూ అధికారులు, ముఖ్య కార్యదర్శిలతో భూ సర్వే పైలెట్ ప్రాజెక్టు పై సమీక్ష నిర్వహించిన సీఎం  జనవరి 1, 2021 నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టి 2023, ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమగ్ర భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేసి.. అక్కడికక్కడే వివాదాల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సర్వేయర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయిలో సర్వేయర్లను నియమించిన నందున సిబ్బందికి ఎలాంటి డోకా ఉండబోదన్నారు. అయితే వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు, ప్రతీ గ్రామంలోని భూసర్వేని పక్కాగా నిర్వహించాలన్నారు. ఈ సర్వే అనంతరం ఎలాంటి భూ రికార్డులైనా గ్రామసచివాలయంలో అందుబాటులో ఉండే విధంగా సర్వే వివరాలను ప్రత్యేకంగా ఆన్ లైన్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.