వృద్ధాప్య పెన్షన్లు రూ.2,500లకు పెంచాలి..సిపిఐ


Ens Balu
1
Amaravati
2020-09-01 11:54:27

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగానైనా వృద్ధాప్య పెన్షన్లు పెంచి రూ.2,500లుగా అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు.  గత ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలోకి వస్తే పెన్షన్లు రూ.3 వేలు చేస్తామని హామీ ఇచ్చారని అయితే  అధికారంలోకి రాగానే వృద్ధాప్య పెన్షన్‌ను ప్రతీ ఏటా రూ.250 మాత్రమే పెంచుతామనే కండిషన్ పెట్టి, మొదటి సంవత్సరం రూ.2,250 చేశారని విమర్శిం చారు. జులై నుండి పెంచి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఈ ఏడాది వృద్ధాప్య పెన్షన్లు పెంచలేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటతప్పమని ప్రచా రం చేసుకునే ముఖ్యమంత్రి పించను విషయంలో ఎందుకు మాట తప్పారని వ్రశ్నించారు. 90శాతం హామీలు అమలు చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎందు కు పెన్షన్ విషయంలో అమలు చేయలేకపోయారో ప్రజలకు చెప్పాల్సిన భాద్యత వుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తో ఎందరో పేదలకు ఆసరా దొరుకు తుందని తక్షణమే పించనను రే, 2500కి పెంచాలన్నారు.