ఏపీ మండలి చైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్ ..


Ens Balu
2
Hyderabad
2020-09-01 12:11:00

ఆంధ్రప్రదేశ్ లోని శాసన మండలికి చైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన షరీఫ్ హైదరాబా దులో ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో సామా న్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోక గా...తాజాగా మండలి చైర్మన్‌ షరీఫ్‌కు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ కావడం ప్రజాప్రతినిధులను కలవర పెడుతోంది. ఇప్పటికే పలు వురు ప్రజా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత కోలుకొని ప్రజా సేవకు సిద్ధమయ్యారు. మరికొంత మంది జాగ్రత్తలు పాటిస్తూ తిరుగుతున్నారు. మరోవైపు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా ఏదో రూపంలో అందరినీ వెంటాడుతూనే వుంది. మాస్కు లు ధరించినా, శానిటైజర్లు రాసుకుంటున్నా, సామాజిక దూరం పాటించినా కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. కాగా  మండలి షరీఫ్‌ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు,  ఆకాంక్షించారు.