సైబర్ నేరాలపై 10లక్షల మందికి అవగాహన..డిజిపి


Ens Balu
5
Velagapudi
2020-09-01 14:08:23

ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణకు దిశ చట్టంతో పాటు ప్రత్యేక పోలీసు స్టేషన్లు, కోర్టులు జిల్లాల్లో ఉన్నాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. సైబర్‌ నేరాలపై అవ గాహన కల్పించేందుకు ఆగస్టు నెల మొత్తం ఈ-రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని సీఐడీ ఎంతో చక్కగా నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని సాధారణ విద్యార్థినుల నుంచి మహిళా సెలబ్రిటీలు అక్కినేని సమంత తదితరులతో మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్‌ హెడ్‌ క్వా ర్టర్స్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడినట్టు చెప్పారు. ఈ సందర్భంగా  ఏపీ పోలీస్ చేపట్టిన కార్యక్రమాలను వారెంతో మెచ్చుకోవడంతోపాటు, వారు ఏర్ప రుచుకున్న అవగాహనను వివరించారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్‌ నేరాలపై కల్పించేందుకు సీఐడీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్న డీజీపి సీఐడీ అధికారులు రాధిక, సరిత నెల రోజులపాటు శ్రమించి 10 లక్షల మందికి అవగాహన కల్పించంలో సఫలీ క్రుతులైనందుకు వారిని అభినందిస్తున్నట్టు చెప్పారు.  ఆన్‌లైన్‌ తరగతుల వల్ల పిల్లలు స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడాల్సిన పరిస్థితి వచ్చిందని, వారికీ కూడా ఆ సమయంలో ఫోన్లు ఏవిధంగా వాడాలనే విషయమై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ-రక్షాబంధన్‌ ద్వారా 2.29 లక్షల మంది నుంచి అనుభవాలు, సూచనలు చేశారని డిజిపి గౌతం సవాంగ్ వివరించారు.