రైతులకు శుభవార్త...ఇక రైతులకు ఉచిత విద్యుత్..


Ens Balu
3
Ongole
2020-09-02 17:17:05

రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్, అటవీ,శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఒంగోలు ఎన్. ఎస్.పి.అతిథిగృహంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి, ఉచిత విద్యుత్ అందించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో రైతుల వ్యవసాయ అవసరాల కోసం వినియోగించుకున్న కరెంట్ కు ప్రభుత్వమే విద్యుత్ చార్జీల చెల్లిస్తుందని వివరించారు.  రైతులకు  ప్రభుత్వం విద్యుత్ చార్జీలను నగదు బదిలీ పథకం క్రింద రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రైతులు ఖాతా లోని నగదును విద్యుత్ డిస్క్ఎం కంపెనీలకు చెల్లిస్తామని చెప్పారు.. ప్రతిపక్షాలు అనవసరమయిన రాద్దాంతం చేస్తూ రైతులను పక్క దోవ పట్టిస్తున్నాయన్నారు.  రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్న మంత్రి ప్రభుత్వం అన్ని వేళల రైతులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిస్కమ్స్ కు  రూ.1700కోట్ల కేటాయించామన్నారు. రాష్ట్రంలో పగటిపూట నిరంతరo9గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన అన్నారు.  రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరలస్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు.జిల్లాలో టుబాకో రైతులను ఆదుకోవడానికి 70కోట్ల రూపాయల ను విడుదల చేశామని మంత్రి తెలిపారు.