enslive ఎఫెక్ట్.. నోబయోమెట్రిక్.. నో సాలరీ..!
Ens Balu
25
Tadepalle
2021-07-21 16:27:49
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా వెలువడుతున్న ప్రత్యేక వాస్తవిక కధనాల(న్యూస్ కార్డ్స్)పై సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సత్వరమే స్పందిస్తుంచడమే కాకుండా. తక్షణమే ఉత్తర్వులు కూడా జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది..! బుధవారం ఉదయం ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ లో.. ‘బయో మెట్రిక్కా.. ఆఒక్కటీ అడక్కు’ అనే శీర్షికపై వచ్చిన కధనం ప్రభుత్వంలో చలనం తీసుకు వచ్చింది. సాయంత్రానికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల 5 సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు లక్షా 18వేలకు పైగా వున్న ఉద్యోగులకు బయో మెట్రిక్ ఆధారంగానే జీతాలు చెల్లిస్తామని, ఖచ్చితంగా విధులకు హాజరయ్యేటపుడు, విధులు ముగించేటపుడు ఖచ్చితంగా బయోమెట్రిక్ వేస్తేనే జీతాలు వస్తాయని హెచ్చరించింది. బయోమెట్రిక్ లో ఎన్ని రోజులకు హాజరు పడితే అన్ని రోజులకు మాత్రమే జీతాలు ఇస్తామని కూడా ప్రకటించింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటైన దగ్గర నుంచి అన్ని విషయాలను ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ద్వారా వాస్తవాలను ఇటు ఉద్యోగులకు, అటు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అభివ్రద్ధి, సేవలు, ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలు ఇలా అన్ని కోణాల్లో ప్రత్యేక కధనాలు అందించండలో ముందుంటూ వస్తుంది. ఈ క్రమంలో బుధవారం ప్రచురితమైన వార్తకు సాయంత్రానికే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడం ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ మరీ ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సాధారణ మీడియా సంస్థల వార్తల మాదిరిగా లైట్ తీసుకునే ఉద్యోగులు ప్రభుత్వం ఈఎన్ఎస్ లైవ్ యాప్ కధనాలపై వెంట వెంటనే చర్యలకు ఉపక్రమించడం రాష్ట్రంలోనే ప్రభుత్వశాఖల్లో చర్చనీయాంశమవుతుంది. రాష్ట్రంలో ఏ మీడియా సంస్థకూడా ఒక ప్రత్యేక ప్రభుత్వశాఖపై ద్రుష్టి కేంద్రీకరించిన దాఖలాలు లేవు. సచివాలయ వ్యవస్థ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మానసపుత్రిక కావడం, దేశంలోనే ఒక వినూత్న ప్రభుత్వశాఖ కావడంతో ఈఎన్ఎస్ మీడియా ఈ ప్రభుత్వ శాఖకు చెందిన లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రజలు, సచివాలయ ఉద్యోగుల ముందు ఉంచుతున్నది. దీనితో గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన తాజా సమాచారం ఎక్కడ వస్తుందనే ప్రశ్నకు ప్రతీ ఒక్కరికీ ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ అనే సమాధానం వస్తోంది. రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలోని 13 జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల్లో నిత్యం ప్రజలకు అందించే సేవలు, అందించబోయే సేవలపై సమస్త సమాచారం కూడా ఇదే వేగంతో అందిస్తామని కూడా ప్రకటిస్తున్నాం. అలాగని సచివాలయ ఉద్యోగులకు ఏ విషయంలో అన్యాయం జరిగినా, ప్రభుత్వమే విడుదల చేసిన జీఓలను అమలు చేయని విషయంలో వారి తరపున కూడా ప్రభుత్వం ముందుకి వాస్తవాలను తీసుకెళ్లడంలో ప్రాధాన్యత ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖ మాత్రమే కాకుండా ప్రజలకు అనునిత్యం ప్రభుత్వ సేవలు అందించే అన్ని ప్రభుత్వశాఖల సమాచారాన్ని కూడా ఇకపై తాజా తాజాగా అందిస్తామని కూడా ప్రకటిస్తున్నాం. ఆగస్టు 15 తరువాత ఈఎన్ఎస్ న్యూస్ నెట్వర్క్ ను 13 జిల్లాల్లోని అన్ని మండాలకు విస్తరించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. దానికి అనుగుణంగానే తాజా సాంకేతికతను కూడా ఈఎన్ఎస్ మీడియా హౌస్ అందిపుచ్చుకుంటోంది. ప్రభుత్వంలో రాష్ట్ర, జిల్లా అధికారులు అత్యధికంగా ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ కధనాలను అనునిత్యం పరిశీలిస్తున్న కారణంగానే ప్రభుత్వం నుంచి వచ్చే చర్యలు కూడా అంతే వేగంగా వుంటున్నాయనే విషయం ఈరోజు మరోసారి తేటతెల్లమైంది. ఇదే వాస్తవికతను, వార్తల్లో నాణ్యతను, ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలు, పాఠకులు, ప్రభుత్వం ముందుంచడంలో శక్తివంచన లేకుండా తాజా సమాచారాన్ని తక్షణమే అందిస్తామని తెలియజేస్తున్నాం..