ఆయుష్ డిస్పెన్సరీల్లో పారామెడికల్ సిబ్బందిని భర్తీచేయాలి
Ens Balu
2
Visakhapatnam
2020-09-04 08:37:12
రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్(ఆయుర్వేదం,యునాని, సిద్ద, హోమియోపతి,నేచురోపతి) డిస్పెన్సరీలను బలోపేతం చేయాలని బీజేపి సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్రమోడి మానస పుత్రిక అయిన ఆయుష్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఒక్క విశాఖజిల్లాలలోనే చాలా డిస్పెన్సిరీల్లో వైద్యుల కొరతతోపాటు, పారామెడికల్ సిబ్బంది కొరత కూడా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇపుడు అన్ని రకాల రోగాలకు ఆయుష్ వైద్య విధానాలను ప్రముఖంగా ఆచిరిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వీటిని పక్కన పెట్టిందన్నారు. దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేదం, హోమియోపతి, నేచురోపతి వైద్య విధానాల్లో మంచి మందులు ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వీటి నిర్వహణకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద వెచ్చిస్తున్న నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. గతంలో పీహెచ్సీలకు అనుబంధంగా ఆయుష్ డిస్పెన్సరీలు ఉండేవని వాటిలో ఇపుడు చాలావాటిని తొలగించారన్నారు. అంతేకాకుండా చాలా డిస్పెన్సిరీల్లో మందులు కూడా లభ్యం కావడం లేదున్నారు. ప్రభుత్వం ఆయుష్ డిస్పెన్సరీల్లో ఖాళీగా వున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించి ప్రధాని మోదీ ఆశయ సాధనకు క్రుషిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తాము కూగా ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుని ద్రుష్టికి తీసుకు వెళతామమన్నారు కొప్పల రామ్ కుమార్.