ఆ ఆలయంలో గోపాలడుని మొక్కితే పెళ్లైపోతుంది...
Ens Balu
2
Kailasapatnam
2020-09-04 13:02:53
ఆ ఆలయాన్నికీ..శ..1850లో నిర్మించారు. ఇక్కడున్న రాజగోపాస్వామి(వేణుగోపాల స్వామి)కి మొక్కితే పెళ్లికాని వారికి పెళ్లి, స్వామివారికి సేవలు చేసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. అంతే కాదండోయ్ ఆర్ధిక బాధలు, కుటుంబ కలహాలు కూడా మటుమాయం అయిపోతాయ్.. ఏంటి కంప్యూటర్ కాలంలోనూ ఈ కధలు అనుకుంటున్నారా..ఈ ఆలయం మహత్యం అలాంటిది మరి..అది నిజమో కాదో తెలసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...ఈ ఆలయ చరిత్ర తెలుసుకుంటే... విశాఖపట్నం జిల్లా, కోటవురట్ల మండలం, కైలాపట్నం గ్రామంలో ఉందీ శ్రీశ్రీశ్రీ రాజగోపా స్వామి దేవస్థానం. ఈ ఆలయంలోనే ఆండాళమ్మ అమ్మవారు కూడా కొలువుదీరి వున్నారు. ఈ ప్రముఖ దేవస్థానం చరిత్రలోకి వెళితే...విజయనగర మహరాజుల ఆహ్వానం మేరకు శ్రీమాన్ ప్రతివాద భయంకర మంత్ర రత్న, శ్రీనివాసాచార్య అయ్యవార్లు ఈ ఆలయంలోని స్వామివారిని పూరీ నుంచి తీసుకు వచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. అప్పట్లో ఈ రాజగోపాలస్వామి ఆలయం ఎంతో పేరు, ప్రతిష్టలు, 500 ఎకరాల మాన్యం కలిగిన దేవస్థానం. అయితే కాలక్రమంలో మాన్యం ప్రభుత్వం రైతుల వసం చేయగా కేవలం ఆలయం మాత్రమే మిగిలింది. ఈ ఆలయంలో జాతి పిత మహాత్మాగాంధీ 1929లో కూర్చొని 1008 మార్లు శ్రీరామ నమ జపం చేసినట్టు చరిత్ర చెబుతోంది.
అంతేకాదు. ఈ ఆలయంలోనే విప్లవ వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు, మహర్షి ఎక్కిరాల రామస్వామి కూడా జపం చేసిన చరిత్రగలది శ్రీశ్రీశ్రీ రాజగోపాలస్వామి దేవస్థానం. ఈఆలయానికి వివిధ బాధలతో వచ్చి వారి మనసులోకి కోర్కెలను స్వామివారితో విన్నవించుకుంటారు. ఇక్కడి స్వామివారు భక్తులు మొక్కులు తరువాత తీరిన కోర్కెల ఆధారంగా మొక్కలు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. క్రీ.శ.1869లో ఈ ఆలయంలో పీతాంబరం అప్పమ్మగారి తల్లి నున్న సుబ్బ కళ్యాణ మండపం కట్టించారు. క్రీ.శ.1899-1900 ఏట నండూరి సీతారామాచార్యులు ఆండాళ్లమ్మ తల్లికి ఇక్కడే దేవాలయం కట్టి ప్రతిష్టించారు. ఈ ఆలయం మొత్తం రాతితో నిర్మించినదే. అప్పట్లో తవ్విన ఊటబావినుంచే తీసిన నీటిని అనునిత్యం స్వామికి తీర్ధంగా సమర్పిస్తారు. కీ.శ. 1964లో ఆలయం తిరిగి పునరుద్దరించారు. ఇంతటి చరిత్ర గలిగిన స్వామివారి దేవస్థానం నేటికి అభివ్రుద్ధికి నోచుకోకపోయినా, చరిత్రమాత్రం ఖండతరాలు దాటింది. దీర్ఘకాలికంగా పెళ్లికాని, ఉద్యోగం రానివారు ఇక్కడి స్వామివారిని మొక్కుకుంటే ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు ఇక్కడ చాలా అధికంగా ఉన్నాయి. దీంతో చాలా మంది ఇక్కడి రాజగోల స్వామివారికి పెళ్లికోసం, ఉద్యోగం కోసం మొక్కలు మొక్కుకుంటారు.
అవి తీరగానే అనుకున్న కానుకలు హుండీలో వేస్తారు. స్వామివారి ఆలయాని తమవంతు సహాయంగా అభివ్రుద్ధి చేయాలని, భక్తుల సహకారంతో స్వామివారికి తిరిగి పూర్వ వైభవం తీసుకు రావాలని ఈఎన్ఎస్ లైవ్ యాప్ సంకల్పించింది. ఈ ఆలయంలో ఏ భక్తుడి కోరికైనా తీరితే ఆలయం అభివ్రుద్ధికి తమ వంతు సహాయం చేయాలని, ఆ నిధులతో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ భక్తులను కోరుతోంది. అంతేకాదు స్వామి వారి ఆలయంలో విద్యుత్ వ్యవస్థను త్వరలోనే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తరపున పునరుద్దరించనున్నట్టు ఈఎన్ఎస్ మీడియా హౌస్ అధినేత పి.బాలభాను(బాలు) ప్రకటించారు. స్వామివారికి చేసిన సహాయం మనందరికీ తిరిగి పదింతలు స్వామి కరుణ, కటాక్షాల రూపంలో వస్తుందని భావించే వారంతా మీవంతు సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలునిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎంతో పూర్వ చరిత్ర ఉన్న ఈ రాజగోపాలస్వామివారిని దర్శించి పునీతులు కండి. మీ మొక్కులు తీరితే స్వామివారి కోసం చిన్న సహాయంతో, మీ పేరుతో ఒక అభివ్రుద్ధి కార్యక్రమం చేపట్టండి. లోకా సమస్తా సుఖినోభవంతు...!