మంత్రి కన్నబాబుకి ప్రత్యేక శ్రేణి వాహనం..కారణం అదే
Ens Balu
3
Amaravati
2020-09-04 18:54:55
ఆంధ్రప్రదేశ్ లోని మంత్రులకు ప్రమాదాలు పొంచివున్నాయా అవుననే అంటున్నాయి నిఘావర్గాలు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొందరు మంత్రులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదేసమయంలో వారిని కొందరు అనుమానితులు టార్గెట్ చేసినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. దీంతో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకి ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. 15 రోజుల క్రితం మంత్రికి అపాయం పొంచివుందని నిఘావర్గాలు ప్రభుత్వానికి తెలియజేయడంతో హోంశాఖ బుల్లెట్ ప్రూఫ్ వాహనంతోపాటు సెక్యూరిటీని కూడా పెంచారు. బాగా తెలిసిన అధికారులను తప్పా ఇతరులను ఎవరినీ మంత్రి వద్దకు నేరుగా పంపడం లేదు. దీంతో ఇంటెలిజెన్స్ సూచనల మేరకు కొన్ని రోజులుగా బులెట్ ప్రూఫ్ వాహనంలోనే పర్యటిస్తున్నారు మంత్రి. ఈ వ్యవహారం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. మన్య ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులకు మావోయిస్టుల నుంచి ప్రమాదాం వుంటుందనే అనుమానంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయిస్తారు. ఇపుడు మంత్రికన్నబాబుకి ప్రత్యేక శ్రేణి వాహనాలు కేటాయింపుపై రాష్ట్రంలో తీవ్రమైన చర్చకు దారితీసింది.