పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లకు లైన్ క్లియర్..
Ens Balu
2
ఏపీ స్టేట్ సెక్రటేరియట్
2020-09-04 19:33:20
ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీరాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలెప్ మెంట్ ఆఫీసర్స్ పోస్టులు మంజూరు చేయడం పట్ట ఎంపీడీఓలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెం డు దశాబ్దాలుగా ఎంపీడీఓలకు, ఈఓపీఆర్డీలలకు ప్రమోషన్ల విషయంలో ఎలాంటి ముందడగు లేక చాలా మంది అధికారులు ప్రమోషన్లు పొందకుండానే ఉద్యోగ విరమణలు చేశారు. ఇన్నేళ్ల తరువాత వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీ రాజ్ శాఖలో ప్రమోషన్ల తలుపు తెరవడంతో ఆఫీస్ సబార్డినెట్లు, పంచాయతీ కార్యదర్శిలు, మినిస్టరీయేల్ స్టాఫ్, ఏ.ఓలు, ఈఓ.పి.ఆర్&ఆర్.డి వరకూ 12 కాడర్లలో ప్రమోషన్స్ కదలికలు వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నవారికి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మార్గం సుగమం చేయడంతో పంచాయతీరాజ్ ఉద్యోగులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేధికగా సహచర ఉద్యోగులతో పంచుకుంటున్నారు. అంతేకాదు వీరందరికీ ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా కింది విభాగాల్లో కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశముంది. దీంతో కొత్త ఉద్యోగాలు, ఉన్నవారికి ప్రమోషన్లు రెండూ ఒకే సారి జరగడానికి చాలా ఏళ్ల తరువాత లైన్ క్లియర్ కావడంతో పీఆర్ ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి...