ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళాపోలీసులు పంద్రాగస్టు వేడకలకు పోలీస్ డ్రెస్ తోనే మహిళా పోలీసుల హాజరు కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 15వేల 4 సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళాపోలీసులకి యూనిఫారం అలవెన్సులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఏపీ డిజీపీ గౌతం సవాంగ్ ను ఆదేశించారు. అంతేకాకుండా వారంతా ఖాకీ యూనిఫారంలోనే పంద్రాగస్టు వేడుకలకు హాజరు కావాలని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దానికి అనుగుణంగా డిజిపి గౌతం సవాంగ్ రాష్ట్రంలోని 13జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. వాటితోపాటు మహిళా పోలీసులకు నిర్వహించాల్సిన దేహదారుడ్య, నడక పోటీలను కూడా దశలవారీగా అన్ని బ్యాచ్ ల వారికి ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో డీజిపీ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారాన్ని ఇటు జిల్లాల పోలీసులు కూడా అన్ని స్టేషన్ల పరిధిలోని మహిళా పోలీసులకు వర్తమానం పంపారు. సాధారణంగా యూనిఫారం అంటే ఖాకీ చొక్కా, పేంటు, మూడు సింహాల గుర్తు, చేతిపై ఏపీ పోలీస్ లోగో స్టిక్కర్, బూట్లు, విజిల్ విత్ త్రెడ్, ఒక లాఠీ పోలీసుశాఖల ఇస్తారు. ప్రభుత్వం కూడా జీవో నెంబరు 59 ద్వారా హోంశాఖకి చెందిన మహిళా పోలీసులుగా గుర్తించడంతో వీరికి కూడా అదేస్థాయిలో యూనిఫారం ఇవ్వాల్సి ఉంది. కాకపోతే హోం డిపార్ట్ మెంట్ లోని లేని కొందరు పోలీసులకి మహిళా పోలీస్ ఉద్యోగాలు ప్రభుత్వం నియమించడం, వారికి అధికారాలు ఇవ్వడం ఇష్టం లేదు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకుండా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసే సమయమంలో గ్రామ సంరక్షణ కోసం మహిళా పోలీస్ ని నియమించి తద్వారా గ్రామానికి దన్నుగా నియమించాలనుకొని వారిని నియమించింది. వారికి ఐసిడిఎస్,తో ఆరోగ్యశాఖల సిబ్బందికి తోడుగా పనిచేయాలని అత్యధిక భాగం గ్రామ పరిరక్షణకే ఇవ్వాలని కూడా ఆదేశించింది. సాధారణ దుస్తుల్లో అయితే ప్రజల్లో వారికి గుర్తింపు రాదని భావించిన ప్రభుత్వం జీఓ నెంబరు 59 ద్వారా వారిని కూడా సాధారణ పోలీసులుగా మార్పుచేస్తూ.. ఇపుడు వారికి ఖాకీ డ్రెస్సుని కేటాయించింది. ఏదైతే ఖాకీ డ్రెస్సులు వేసుకొని గ్రామాల్లో తిరిగితే గ్రామాల్లో తమకి విలువ పడిపోతుందని..తామంటే భయంపోతుందని ఆందోళపడిన చాలా మంది పోలీసు సిబ్బందికి ప్రభుత్వ నిర్ణయం నిజంగానే వారి ప్రచారానికి అడ్డుకట్టవేయగలిగింది. దీనితో ఆగస్టు 15తరువాత రాష్ట్రవ్యాప్తంగా 15వేల 4 గ్రామ వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులు ఖాకీ డ్రెస్సులతోనే విధులకు హాజరు కానున్నారు. దీనిని బట్టి రాష్ట్రప్రభుత్వం గ్రామ రక్షణకు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చిందో ప్రజలకు తెలియజేసినట్టు అయ్యింది.
ప్రభుత్వ జీఓలపై పోలీసులకు అవగాహన ఎంత..?
ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినదగ్గర నుంచి మహిళా పోలీసుల నియమాకాల కోసం జీఓఎంఎస్ నెంబరు 126, 129, 59, ఇపుడు తాజాగా 60ని విడుదల చేస్తూ.. ఒక్కో జీఓలో ఒక్కో రకమైన ఆదేశాలు ఇస్తూ వచ్చింది. వాస్తవానికి ఈ ప్రభుత్వ జీఓలను జిల్లా ఎస్పీలు, అడ్మిన్ ఎస్పీలు వారి పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎస్ఐలకు అవగాహన కల్పించాల్సి వుంది. ప్రభుత్వం జీఓల్లో పొందు పరిచినట్టుగా అమలు చేయాల్సివుంది. జిల్లా ఎస్పీలు ఆపని చేస్తున్నప్పటికీ స్టేషన్ స్థాయిలో మాత్రం సిబ్బంది అంతగా ప్రభుత్వ జీఓలను పట్టించుకోనట్టుగానే ప్రచారం జరుగుతుంది. ఒక్కో స్టేషన్ పరిధిలో ఒక్కోలా మహిళా పోలీసుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు పోలీసుశాఖకు కాస్త తలనొప్పిగా పరిణమిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. కొందరు కానిస్టేబుళ్లు మీరు మాలా నిజమైన పోలీసులు కారంటే.. మరికొందరు హెడ్ కానిస్టేబుళ్లు మీకు ప్రభుత్వం మాలాగ ఖాకీ డ్రెస్సు ఇవ్వదనీ, మీరు మా కింద సమాచారం ఇవ్వడానికి మాత్రమే పనిచేయాలని మాట్లాడుతున్నారు..ఇవన్నీ పక్కనపెడితే ఏఎస్ఐ స్థాయిలో వున్నవారు, ఎస్ఐ స్థాయిలో ఉన్నవారు పోలీసు డిపార్ట్ ఉద్యోగులమంటే మేమేనని... కేవలం మిమ్మల్ని ప్రభుత్వం స్టేషన్ కి సమాచారం ఇవ్వగానికే గ్రామంలో నియమించిందని నేరుగా చెబుతున్నారు. మరికొన్ని చోట్ల నేరుగా అసలు మీరు పోలీసుశాఖకు చెందిన వారు కాదని, మాతో సమానంగా పోలీస్ అని ఎలా పిలిపించుకుంటున్నారని వాదనలకు దిగుతున్నారు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులను ప్రభుత్వం హోంశాఖ ద్వారా, జిల్లా ఎస్పీలతో నియామకాలు చేపట్టింది. ఆ తరువాత ప్రత్యేక జీఓలను సైతం విడుదల చేస్తున్నప్పటికీ ఎందుకనో పోలీసుశాఖలోని ఒక వర్గం మహిళా పోలీసు వ్యవస్థను పోలీసుశాఖలో కలుపుకోవడానికి, వారితో సమానంగా గుర్తించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనితో ప్రభుత్వ ఉత్తర్వులపై అసలు వీరికి అవగాహన ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నిచోట్ల జిల్లా ఎస్పీలు హెచ్చరించినప్పటికీ కింది స్థాయి సిబ్బందిలో మార్పు మాత్రం కనపడనట్టుగానే ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికైనా జిల్లా పోలీసుశాఖ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగాల్లో పోలీసు శాఖ ద్వారానే నియమించిన మహిళా పోలీసు ఉద్యోగాలపై కఠినమైన ఆదేశాలు జారీచేయాల్సివుందనే డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తుంది.