ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net చెప్పివన్నీ ప్రభుత్వంలో అక్షర సత్యాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ తప్పిదం.. ఉద్యోగులకు ప్రాణసంకటం.. శీర్షికన ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్ లో ప్రచురించిన న్యూస్ కార్డ్ పై స్పందించిన గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్యకార్యదర్శి అజైయ్ జైన్ డిపార్ట్ మెంట్ టెస్టులు పాసైన వారి ఉద్యోగాలనే రెగ్యులర్ చేస్తామని అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. సిబీఏసీ పరీక్షతోపాటు, డిపార్ట్ టెస్టులు పాస్ కావాలని చెప్పిన ప్రభుత్వం సీబీఏసీ పరీక్ష విషయంలో వెనక్కి తగ్గింది కానీ.. గతంలో చెప్పినట్టిగా సచివాలయంలోని 19శాఖల సిబ్బందీ ఖచ్చితంగా డిపార్టమెంట్ టెస్టులు పాస్ కావాలని, దానికి షెడ్యులు ఖరారు చేయమని ఈమేరకు 8శాఖలకు సర్క్యులర్ నెంబరు 71/D/2021ను మాత్రం జారీచేసింది. దీని ప్రకారం ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-3, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్,పశు సంవర్ధకశాఖ సహాయకులు, ఫిషరీస్ అసిస్టెంట్, గ్రేడ్-2వీఆర్వో, సెరీకల్చర్ అసిస్టెంట్, ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలు సంబంధిత డిపార్ట్ మెంట్ పరీక్ష పాసైతే తప్పా వీరి ప్రొబేషన్ పూర్తయి సర్వీసులు రెగ్యులర్ కావు. మొత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లోని 19శాఖల సిబ్బందిలో ఇప్పటికే 11 శాఖల సిబ్బంది ఆయా శాఖాధిపతుల సూచనలతో డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసయ్యారు. మిగిలిన వారికి వారికి ఆయా శాఖల అధిపతుల నుంచి ఎలాంటి సూచనలు లేకపోవడంతో నేటికీ డిపార్టమెంటల్ పరీక్షలు రాయలేకపోయారు. ప్రభుత్వం గతంలో కొన్నిశాఖల సిబ్బందికి జీఓలు, గెజిట్లలోనే డిపార్టమెంట్ పరీక్ష విషయం సూచించడంతో చాలా మంది ఉద్యోగులు రెండేళ్ల కాలంలోనే పరీక్ష పాసయ్యారు. మరికొంత మంది ఉద్యోగులకు ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో వారంతా డిపార్ట్ మెంట్ టెస్టులు రాయకుండా అలాగే మిగిలిపోయారు. ఇపుడు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా మళ్లీ కొత్తగా జారీచేసిన సర్క్యులర్ ప్రకారం.. 10-08-2021న ఆయాశాలఖ అధిపతులు సచివాలయ సిబ్బందికి పెట్టాల్సిన డిపార్ట్ మెంటల్ పరీక్షలు గుర్తిస్తారు. 15-08-2021 నాటికి ఆయా శాఖల సిబ్బంది విధులు, సర్వీసు రూల్సుతో పాటు డిపార్ట్ మెంట్ టెస్టులకు సంబంధించిన విషయాలను జీఓలో నవీకరిస్తారు. 20-08-2021న డిపార్ట్ మెంట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ను ఏపీపీఎస్సీ ద్వారా ప్రకటిస్తారు. 15-09-2021న మళ్లీ ఏపీపీఎస్సీ ద్వారా డిపార్ట్ మెంట్ పరీక్షలను మిగిలివున్న 8ప్రభుత్వశాఖ సిబ్బందికి నిర్వహిస్తారు. 22-09-2021న డిపార్ట్ మెంట్ టెస్టుల దానియొక్క రూల్స్ ను సిబ్బందికి తెలియజేస్తారు. చివరిగా 02-10-2021న ఎవరైతే ప్రభుత్వం నిర్ధేశించిన డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసై , ఎవరైతే అర్హత సాధిస్తారో.. ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తిచేసుకుంటారో వారి సర్వీసులను మాత్రమే ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుంది.
ఇంత క్లారిటీగా ప్రొబేషన్ పూర్తవడానికి రెండు నెలల ముందు డిపార్ట్ మెంట్ పరీక్షల షెడ్యూలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇదే విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు విధుల్లోకి చేరినపుడే చెప్పకుండా పెద్ద తప్పుచేసి, ప్రస్తుతం కొండంత భారం మా నెత్తిన పెట్టిందని ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు ప్రత్యేక సర్క్యులర్ లో ఆదేశించినట్టుగాన విధుల్లోకి చేరిన మొదట్లోనే చెప్పివుంటే ప్రొబేషన్ పూర్తయ్యేనాటికి మాశాఖలకు సంబంధించిన అన్నిరకాల డిపార్ట్ మెంట్ పరీక్షలను పూర్తిచేసుకునేవారమని.. తాజాగా ప్రొబేషన్ పూర్తవడానికి రెండు నెలల ముందు డిపార్ట్ మెంట్ పరీక్ష పెడితే మా పరిస్థితి ఏంటని గగ్గోలు పెడుతున్నారు సచివాలయ ఉద్యోగులు. ఈ 2 కాలంలో కరోనా వైరస్ వచ్చినపుడు, ప్రభుత్వ పథకాల అమలకు మాతో శని, ఆదివారాలనే తేడా లేకుండా సెలవులు కూడా ఇవ్వకుండా పనులు చేయించుకున్న ప్రభుత్వం.. ఆఖరి సమయంలో తమను ఇబ్బంది పెట్టడానికి ఇపుడు డిపార్ట్ మెంట్ పరీక్షల విషయం లేవనెత్తిందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ,వార్డు సచివాలయాల్లోని 19శాఖల్లోని 8శాఖల ఉద్యోగులు(ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-3, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్,పశు సంవర్ధకశాఖ సహాయకులు, ఫిషరీస్ అసిస్టెంట్, గ్రేడ్-2వీఆర్వో, సెరీకల్చర్ అసిస్టెంట్, ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలుల) ఉద్యోగులకు సర్వీసు రూల్స్ ప్రకారం ఎలాంటి డిపార్ట్ మెంట్ పరీక్షలూ లేవని ఈ 71/D/2021 సర్క్యులర్ లోనే ప్రకటించిన ప్రభుత్వం. మళ్లీ నిబంధనలు నవీకరించి సర్వీసు ప్రొబేషన్ ముదు డిపార్ట్ మెంట్ టెస్టులు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ చేసేదేదో మొదట్లోనే చేస్తే ఈ ఇబ్బందులు తప్పివే కాదు కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.