అవినీతి పోలీసులను వెంటాడుతున్న ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్
Ens Balu
3
ప్రకాశం జిల్లా
2020-09-05 12:50:41
ఒంటి మీద ఖాఖీషర్టు, బుజం పై రెండు స్టార్లు, లేదా ఒకటున్నా పర్లేదు వీటితో ప్రజలను ఎంతో మర్యాదగా రా రా, పోరా..ఏంటి రా..బలిసిందా.. అని ఎంతో మర్యాద గా మాట్లాడే ప్రశాకం జిల్లా పోలీసులకు ఇపుడు నానిపోతుంది...ఏంటి పోలీసులు భయపెడతారు గానీ భయపడం ఏంటి అనుకుంటున్నారా...అలా అనుకంటే పోలీ సు వ్యవహారాల్లో అడుగు పెట్టినట్టే...ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది పోలీసులను 10 రోజుల్లో సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఇపుడు జిల్లాలో అవినీతి పోలీసులకు సింహ స్వప్నంగా మారారు. ఎస్పీ పేరు చెబితే సినిమాల్లో ఎమ్మెస్ నారాయణ ఉన్నట్టుండి వెనక్కి గిరుక్కున తిరిగినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు ఎవరిమీద సస్పెండ్ అవుతారోనని. అందేకాదు సస్పెండ్ అయిన పోలీసులపై జరిపే విచారణలో వాస్తవాలు తేలితే పోలీసుల మీదే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఒక్కసారిగా ప్రకాశం జిల్లాలోని పోలీసులంతా మంచివారిగా మారిపోతున్నారు. పోలీస్ స్టేషన్ కి ఎవరు వెళ్లినా చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు. సెటిల్ మెంట్ అనే మాట బయటకు రాకుండా కామ్ గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడూ పోలీస్ సినిమాలు చూసిన జిల్లా పోలీసులకు రియల్ గా ఎస్సీ యాక్షన్ చూసిన తరువాత నోటి మాట రావడం లేదు. ఈ విషయంపై జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు ఇలా వ్యవహరించి అవినీతి ఖాఖీలను ఇంటికి పంపితే బాగుండు అనే వాదన బలగా వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 25 మంది పోలీసులను సస్పెండ్ చేస్తేనే ఎస్పీ నయిం అస్మి పేరు ఊరూనోట మారు మ్రోగిపోయింది. ఇపుడు ప్రకాశం జిల్లా ఎస్పీ దానికి డబుల్ సంఖ్యలో అవినీతి పోలీసులపై తీసుకున్న చర్చ హాట్ టాపిక్ మారింది. అంతేకాదు ఆ మందిపై ఎంతమందిపై క్రిమినల్ కేసులు రుజువవుతాయోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.