విశాఖలో నీచ ‘కోక’రాజకీయాలకు తెరలేపారు.. మంత్రి పై బురద చల్లారు..
Ens Balu
10
Visakhapatnam
2021-08-20 12:34:19
మొన్న విశాఖ రాజధాని ప్రాంతానికి అనువైనది కాదని సునామీలొస్తాయన్నారు .. నిన్న భూమి ఉపరితల మండిపోతుందిని విశాఖకు అత్యంతపెద్ద ప్రమాదం పొంచి వుందని భయపెట్టాలని చూశారు.. ఆ పాచికలేవీ విశాఖ ప్రజల ముందు, అందునా వైఎస్సార్సీపీ పార్టీ ముందు అసలే పారలేదు.. ఇక లాభం లేదనుకొని ఈరోజు నీచాతి నీచంగా ‘కోక ఫోనులో పెట్టిన కేక అంటూ’ నీచ రాజకీయాలకు తెరలేపారు.. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వంపై కవాలనే బురద చల్లే ప్రయత్నంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదో రకంగా ముందు ప్రభుత్వంలోని మంత్రులను టార్గెట్ చేస్తే తప్పా విశాఖ ప్రజలు నమ్మరనే భావనకు వచ్చిన ఓ వర్గం రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును టార్గెట్ చేసినట్టు ఖచ్చితంగా ఈ విషయంలో కనిపిస్తుంది. సామవేద దండోపాయాలు ఉపయోగించైనా ప్రభుత్వంలోని మంత్రులు వ్యక్తిత్వం మంచిది కాదని చూపే ప్రయత్నానికి ఎవరో ఒక అభం శుభం తెలియని మహిళను పావుగా వాడుకున్నారు. దానినే పదే పదే ప్రజలు నమ్మేవిధంగా ప్రచారాలు చేసి మంత్రి నేరుగా మీడియా ముందుకొచ్చి తన వ్యక్తిత్వం కోసం చెప్పుకునేలా చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అధికారిక సమీక్షలు, ఊపిరి సలపని సమావేశాలు, కార్యకర్తలు, పర్యటనలు ఇలా సరిగ్గా తినడానికి గానీ, ఓ గంట మనసారా కునుకు తీయడానికి కూడా ఖాళీలేకూడా లేని మంత్రులు ఏకంగా అరగంట పాటు ‘ఫోనులో పొందు కోరినట్టు’గా ఆడియో టేపులను స్రుష్టించి మరీ జనాల మీదకు వదిలారంటే పరిస్థితి, టార్గెట్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో అసలు విషయం తెలియనివారంతా దానిని వైరల్ చేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లేనిపోని మచ్చను వేయాలని చాలా గట్టిగానే ప్రచారం చేశారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్వీబీసీ చైర్మన్ ప్రుధ్విరాజ్ విషయంలో కొందరు ఇలాంటి కోక రాజకీయాలు చేసే ఆయన నామినేటెడ్ పోస్టు పోవడానికి కారణమయ్యారు. సరిగ్గా ఇపుడు ఆ సూత్రాన్ని విశాఖజిల్లాతో పాటు రాష్ట్ర ప్రజల్లో ఎంతో మంచి పేరు తెచ్చుకుంటున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై ప్రయోగించి ఈయన మంత్రి పోస్టుకి ఎసరు పెట్టడానికి ఈ విధంగా ప్రయోగం చేశారనే ప్రచారం గుప్పుమంటుంది. నందిని పదే పదే చూపించి పంది అనేలా ప్రచారం చేయడంలో ఆయనపై కక్షగట్గిన ప్రత్యర్ధి వర్గం చాలా శ్రమించినట్టే కనిపిస్తుంది. ఈ ఆడియో టేపుల లీకేజీలో కావాలనే పెద్ద నేత తెరవెనుక ఉండి కదంతా నడిపించారని కూడా చెబుతున్నారు. స్వతహాగా ఆర్ధికంగా బలంగా వున్న వ్యక్తిని ఇలా వలపు వల బాణంతో ఇరికిస్తే పార్టీలో తెచ్చుకున్న పేరుపోవడంతోపాటు, పార్టీపై కూడా బురదచల్లడానికి ఆస్కారం వుంటుందని ఈ విధంగా పక్కగా ప్లాన్ చేశారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఇంతకీ చిన్న శబ్ధం కూడా రాకుండా అత్యంత క్లియర్ ఆడియోలో బయటపెట్టిన ఆ తెరవెన నేత ఎవరై ఉంటారని కూడా విశాఖలో జోరుగా పరిశోధన జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయమై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు మీడియా ముందుకి వచ్చి తన కోసం చెప్పుకున్నారు. ఈ సమయంలో అసలా నకిలీ కోక కట్టుకొని కవ్వించినట్టు మాట్లాడినది వాస్తవమా.. అవాస్తవమా.. అనే చర్చ విశాఖతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. ఈ తరుణంలో ఆ ఆడియో టేపు సదరు మీడియా సంస్థకి విడుదల చేసిన మహిళ పార్టీలో ఎవరై ఉంటారని, లేదంటే పార్టీ పేరు చెప్పినట్టు మాట్లాడించి, మిమిక్రీ చేసినా, టెక్నాలజీని వినియోగించి స్రుష్టించినా.. స్వయంగా దానినే పదే పదే చూపి బురదచల్లడానికి ఆస్కారం వుంటుందని ఈ విధంగా స్కెచ్ వేశారా అనే కోణంలో అటు పోలీసులు కూడా విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి.. అదేదో ‘వంగలేక మంగళవారం అన్నట్టు’ నేరుగా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక.. మంత్రిని అవంతిని ఎదుర్కోలేక.. అధికార పార్టీ మంత్రులపై ఇలాంటి కోక రాజకీయాలు చేసి నకిలీ ఆడియోలు బయటపెడితే ప్రజలు నమ్మేస్తారు అన్నట్టుగా తీవ్ర స్థాయిలో ప్రయత్నించినా.. మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యక్తిత్వం, మంచితనం తెలిసిన వారంతా ఇదంతా రాజకీయం కోసమే అన్నట్టు కొట్టి పడేస్తున్నారు.. వాస్తవం కూడా అదే అన్నట్టుగా..!