భారత దేశంలో సాంకేతికత విప్లవం తెచ్చిన చిక్కు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మధ్య పరిపాలనకు ప్రధాన అడ్డంకిగా మారుతోంది. అదేంటీ సాంకేతికతతో పరిపాలన పరుగులు పెట్టాలి కానీ, ఎలా అడ్డుపడుతుందనే అనుమానం కలగవచ్చు.. కానీ ఇది అక్షర సత్యం.. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ సమస్య మీరి ఎక్కువగా ఉంది. ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు తమ ప్రెస్టీజిని, హై ప్రొఫైల్ ను ప్రదర్శించడానికి, వినియోగించే యాపిల్ ఫోన్ల వలనే ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం విడుదల చేస్తున్న ఆండ్రాయిడ్ యాప్ లు ఎలా పనిచేస్తున్నాయో కనీసం తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇది నిజం.. అధికారులు యాపిల్ ఫోన్లు వడటం వలన వివిధ ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వం కేవలం ఆండ్రాయిడ్ యాప్లను మాత్రమే వినియోగిస్తుంది. వాటిని యాపిల్ ఫోన్లలో వినియోగించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనితో ప్రభుత్వం కేవలం ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ ని మాత్రమే వినియోగిస్తుంది. అయితే అవి ఎలా పనిచేస్తున్నాయో.. అందులోని సాంకేతిక కారణాలు, లోపాలు, సర్వర్ ఇబ్బందులేంటో కలెక్టర్ల నుంచి జిల్లా అధికారుల వరకూ ఎవరికీ తెలియడం లేదు. దానికి కారణం ఒక్కటే ఏ ప్రభుత్వ యాప్ ని కూడా జిల్లా అధికారులు తమ తమ ఫోన్లలో ఇనిస్టాల్ చేసి వినియోగించి పరీక్షచేయరు. ఉదాహరణకు క్షేత్రస్థాయిలో దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాలంటే అధికారి అక్కడ పర్యటిస్తేనే సమస్య తెలుస్తుంది.. తద్వారా సమస్యను పరిష్కరించడానికి ఆస్కారం వుంటుంది. అలాగే అధికారులు కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు అధికారిక కార్యక్రమాల కోసమైనా వినియోగిస్తే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంక్షేమ పథకాల విషయంలో పడే ఇబ్బందులు తెలుస్తాయి.
ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రభుత్వ శాఖలు, తాజాగా గ్రామ, వార్డు సచివాలయ శాఖలో సిబ్బంది పడే కష్టాలు కూడా అధికారులకు తెలియడం లేదు. ఇచ్చిన లక్ష్యాలను అధిగ మించడంలేదని ఒంటికాలిపై లేస్తున్నారు తప్పితే ప్రభుత్వం విడుదల చేసిన ఆండ్రాయిడ్ యాప్స్ పనిచేస్తున్నాయా లేదంటే అందులో ఏదైనా సాంకేతిక సమస్య, సర్వర్ లోడ్ సమస్య తలెత్తుతున్నాయా అనే విషయాలు తెలుసుకోవడం లేదు. అలాగని సిబ్బంది చెప్పినా ఒక్కొక్కిరి పనిచేసి మీకెందుకు పనిచేయడం లేదని తిరగేసి సిబ్బంది మీదే తప్పును నెట్టేస్తున్నారు అధికారులు. రాష్ట్ర సచివాలయంలోని వివిధ శాఖ ముఖ్యకార్యదర్శిల దగ్గర నుంచి జిల్లాలోని కలెక్టర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు సైతం అత్యధికంగా యాపిల్ ఫోన్లనే వాడుతున్నారు. ఒక పది శాతం మంది జిల్లా అధికారులు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడినా వారికి టెక్నాలజీ తెలయదు. వినియోగించడం అసలే తెలియదు. దీనితో వారు కాస్త జిల్లా కలెక్టర్లు, జెసిలు సమీక్షా సమావేశంలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. దానితో సమీక్షలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలా అఖిలభారత స్థాయి అధికారుల దగ్గర తిన్న చీవాట్లను తిరిగి వారు కూడా కింది స్థాయి సిబ్బందికి తిరిగి ఇచ్చేస్తున్నారు. అంతేతప్పా సాంకేతిక సమస్య ఎక్కడ వచ్చిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఒక్కోసారి సిబ్బంది మొత్తం మూకుమ్మడికా ఆయా ప్రభుత్వ యాప్ లు సక్రమంగా పనిచేయడం లేదని స్క్రీన్ షాట్ లు పెడితే తప్పా సమస్య ఏంటనేది కలెక్టర్లు గుర్తించకపోవడం దారుణ పరిణామంగా కనిపిస్తుంది. వాస్తవానికి గ్రామ సచివాలయ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వరకూ అందరూ రాష్ట్రప్రభుత్వంలోని వివిధ పధకాలకు సంబంధించిన యాప్స్ వినియోగంపై అవగాహన ఉండాలి. అలా ఉండాలటే వారంతా ఆండ్రాయిడ్ ఫోన్లనే వినియోగించాలి. కానీ వారి ఫ్రొఫైల్ ను బట్టి చాలా మంది అధికారులు యాపిల్ ఐ ఫోన్లు వినియోగించడంతో ప్రభుత్వ సంక్షేమ పధకాలకు సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్స్ ఎలా వినియోగిస్తున్నదీ ఒక్క అధికారి కూడా తెలుసుకోలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదేమో.
ఈ విషయం అధికారులకు చిన్నదిగా కనిపించినా, రాష్ట్రంలో మాత్రం ఇదొక పరిష్కారం లేని సమస్యగా పరిణమిస్తూ రోజు రోజుకీ పెరిగిపోతుంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే దానికి మార్గం ఒక్కటే..రాష్ట్రస్థాయి అధికారి నుంచి గ్రామస్థాయి సిబ్బంది వరకూ అందరూ ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగిస్తే తప్పా క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యను త్వరితగతిన పరిష్కరించే వీలుండదు. జిల్లా కలెక్టర్లు, జెసీలు, ఇతర జిల్లా అధికారులకు ఈ విషయం చిన్నదిగా కనిపించినా, ప్రధాన సమస్య ఇక్కడే వస్తున్నది. రాష్ట్రప్రభుత్వ శాఖలు రూపొందించిన యాప్స్ లోని సాంకేతిక కారణాలు జిల్లా అధికారులు తెలుసుకోవడానికి వీలులేకుండా పోతుంది. దానిపై ప్రభుత్వానికి ఫిర్యాదు, సిబ్బంది పడే ఇబ్బందులను తెలియజేయడానికి అవకాశం కూడా ఉండటం లేదు. అలాగనీ కలెక్టర్లు, జెసిలు, రాష్ట్రశాఖ కమిషనర్లు, ముఖ్యకార్యదర్శిలకు ఈ విషయం తెలియదా అంటే అందరికీ తెలిసే చేస్తున్నారని ప్రతీ ఒక్కరూ నమ్మితీరేలా అంతా యాపిల్ ఐఫోన్లనే వినియోగిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల పూర్తిస్థాయిలో ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగిస్తే తప్పా..ఈ సమస్యలకు పరిష్కారం కనిపంచే సూచనలు మాత్రం కనిపించడం లేదు. సాంకేతికను వినియోగిస్తూ ప్రజలకు పనికొచ్చే ప్రభుత్వ యాప్స్ లోని సమస్యలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి ఇబ్బందులు తెలుసుకోవడానికి ఇకనైనా ప్రభుత్వం ద్రుష్టిసారిస్తుందో లేదో వేచి చూడాలి మరి..!