తల్లిపాలతో కరోనా మటుమాయం..
Ens Balu
16
Brazil
2022-06-24 13:39:17
తల్లిపాలలో వున్న రోగ నిరోధక శక్తితో కరోనా మటుమాయం అవుతోంది. ఈ విషయాన్ని క్యాంపినాస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా రుజువు చేసి చూపారు. కరోనా సోకిన మహిళకు బ్రెజిల్ లోని శాస్త్రవేత్తల బ్రుందం ప్రతీ మూడు గంటలకు ఒక సారి 30 మిల్లీలీటర్ల తల్లిపాలను ఇచ్చారు. ఇలా వారం రోజుల పాటు పరీక్షించగా తల్లిపాలలోని రోగ నిరోధక శక్తితో కరోనా సోకిన మహిళకు వైరస్ మటుమాయం అయ్యింది. సోవోపోలో లోని క్యాంపినాస్ విశ్వవిద్యాలయం(UNICAMP) శాస్త్రవేత్తల బ్రుందం ఈ విషయాన్ని తెలియజేసింది. వాస్తవానికి తల్లిపాలలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు అత్యధికంగా ఉంటాయి. దానినే ప్రామాణికంగా తీసుకొని వాటినే కరోనా వైరస్ సోకిన మహిళపై పరీక్షంచగా విజయం సాధించారు. ఇపుడు ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.