వాట్సప్ యూజర్లకు మెటా కీలక అప్ డేట్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ 15 మందితో వీడియో కాల్ చేసుకునే సదుపాయాన్ని ఏకంగా దానిని 30 మందికి పెంచింది. అయితే ఈ ఆప్షన్ అన్ని ఫోన్లకు అందుబాటులోకి రాలేదు. లేటెస్ట్ వెర్షన్ ఫోన్లకు వెంటనే అయిపోతున్నా. పాత వెర్షన్ ఫోన్లకు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. జూమ్ వీడియోకాలింగ్ యాప్ కి ధీటుగా తీసుకొస్తున్న ఈ వాట్సప్ కాలింగ్ సిస్టమ్ ను మరింత క్వాలిటీగా, ఇంకా ఎక్కువమందిని త్వరలో పెంచే యోచనలో కూడా ఉందట మెటా. ఇప్పటి వరకూ 15 మంది దాటి సిబ్బంది ఉన్న కార్యాలయాలు, చిన్న సంస్థలు జూమ్ వీడియో కాల్ కి వెళ్లేవి. ఇపుడు ఆపరిస్థితి నుంచి వాట్సప్ గ్రూప్ వీడియో కాలింగ్ 30 మందికి పెంచిన కొత్త అప్డేట్ దారి మళ్లించింది. ఈఏడాది చివరికి ఈ సంఖ్యను 100కు ఆపై ఒకేసారి 500కి పెంచే యోచనలో బిజీగా ఉందట మెటా. మరోవైపు ఒకేసారి వాట్సప్ ఛానల్ ఆప్షన్ తీసుకొచ్చి ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ మాదిరిగా ఫాలోయింగ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. ఇందులో పెద్ద పెద్ద వారంతా తమ ఛానల్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా రంగం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో దానితోపాటు పోడీ పడుతూ వాట్సప్ కూడా కీలక అప్డేట్లను తీసుకు వస్తున్నది. అయితే ఇప్పటికీ వీడియోకాలింగ్ క్వాలిటీలో మాత్రం వాట్సప్ వెనుకడుగులోనే ఉందని చెప్పకతప్పదు.