జాబిల్లిపై చంద్రయాన్-3 పయనం మొదలు పెట్టినట్టు ఇస్రో ప్రకటించింది. ఈ విషయానికి సంబంధించిన తాజా బులిటిన్ ను విడుదల చేసింది. చంద్రయాన్-3పై ఇస్రో శుక్రవారం మరో అప్‌డేట్ ప్రపంచానికి ఇచ్చింది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికొచ్చిన రోవర్ చంద్రుడి ఉపరితలంపై 8 మీటర్ల దూరం వరకూవిజయవంతంగా ప్రయాణించిందని పేర్కొంది. రోవర్ పేలోడ్‌లు LIBS, APXS ఆన్ చేయబడ్డాయని తెలియజేసింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్‌లు ఎటువంటి సమస్య లేకుండా పని చేస్తున్నాయని వెల్లడించింది. దీనితో దివి నుంచి భువికి వచ్చే తాజా సమాచారంతో అక్కడ ఏం జరుగుతుంది..? చంద్రయాన్ ఏమేమి పరిశోధనలు చేస్తుంది..? ఎలాంటి చిత్రాలు, వీడియోలు పంపిస్తుంది..అందులో ఎలాంటి సమాచారం వుంటుందనే విషయంపై ఇపుడు ప్రపంచమంతా ఆశక్తిగా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం ప్రపంచదేశాల చూపు భారత్ పైనే వుంది.