ఇన్‌స్టాగ్రామ్‌లో మరో నాలుగు అద్భుత ఫీచర్లు..


Ens Balu
7
United States
2023-10-26 05:43:45

ఇన్‌స్టాగ్రామ్‌కు యూత్‌ ని మరింత కట్టిపడేసే విధంగా సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇనిస్ట్రా గ్రామ్  ఫాలోవర్లు అత్యధికంగా పెరుగుతుండటంతో వారికి ఆలోచనలకు, ఆశలకు అనుగుణంగానే యాప్ ను డెవలప్ చేస్తున్నారు నిర్వహాకులు యూత్ లో ఉన్న క్రేజ్‌ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ వస్తోంది.  ఇన్‌స్టాగ్రామ్‌ లాంచ్‌ అయిన 13 ఏళ్లు గడుస్తోన్న సందర్భంగా 4 కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తుంది. ఇవి ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్నాయి. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్న కొత్త ఫీచర్స్‌లో డేట్స్‌ రిమైండర్‌ ఒకటి. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో స్నేహితుల పుట్టిన తేదీ రీమైండర్‌ అందుబాటులో ఉంది. ఇలాంటి ఫీచర్‌నే ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకురానున్నారు. ఈ ఫీచర్‌ ఫాలోయర్లకు, స్నేహితులకు మీ పుట్టిన తేదీని గుర్తు చేస్తుంది. స్టిక్కర్లు, కాన్ఫెటీలతో విషెస్‌ చెప్పేలా డిజైన్‌ చేశారు.  ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం కొందరికి మాత్రమే మీ స్టోరీలు కనిపించేలా ‘క్లోజ్‌ ఫ్రెండ్స్‌’ అనే ఫీచర్‌ అందుబాటులో ఉంది అయితే ఈ ఫీచర్‌కు అప్‌డేట్‌ తీసుకురానున్నారు. స్టోరీలకు మరిన్ని క్యాటగిరీలు యాడ్ చేయనున్నారు. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ, కోలిగ్స్‌ ఇలా క్యాటగీరి వారీగా స్టోరీలను షేర్ చేసుకోవచ్చన్నమాట. తద్వారా మొత్తం ఫాలోవర్లు కూడా చూసేందుకు వీలుగా వుంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాయిస్‌ మెసేజ్‌ ఫీచర్‌కు అదనంగా కొత్త అప్‌డేట్‌ తీసుకురానున్నారు. నోట్స్‌ సెక్షన్‌ నుంచే ఆడియో మెసేజ్‌లు పోస్ట్ చేయొచ్చు. ఇవి డైరెక్ట్ మేసేజ్‌ లిస్ట్‌లో అన్నింటికంటే పైన కనిపిస్తాయి. కేవలం ఆడియో నోట్స్‌ మాత్రమే కాకుండా, చిన్న చిన్న వీడియోలను రికార్డ్‌ చేసి కూడా నోట్‌గా పోస్ట్ చేయొచ్చు. ఈ పోస్ట్ కేవలం 24 గంటల 
వరకు ఉంటుంది.  నోట్స్‌లో లొకేషన్‌ను ట్యాగ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తాము ఎక్కడున్నామో తెలపుపొచ్చు. ట్యాగ్‌ చేసిన లొకేషన్‌ నోట్స్‌లో టెక్ట్స్‌ మీద కనిపిస్తుంది. ఈ ఫీచర్లన్నీ నూతన సంవత్సరానికి అందుబాటులోకి వచ్చే వకాశాలున్నాయని టెక్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సరికొత్త ఇనిస్టాగ్రామ్ ఫీచర్స్ యూజర్లకు మరింత చేరువకానున్నాయి.