జాబిల్లిపై నిద్రకు ఉపక్రమించిన విక్రమ్ ల్యాండర్


Ens Balu
14
Bengaluru
2023-09-04 09:33:44

జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ నిదురకు ఉపక్రమించింది. ఈ నిద్ర సెప్టెంబరు 22 వరకూ ఉంటుంది. ఈ మేరకు ఇస్రో చంద్రయాన్ -3 పై కీలక ప్రకటన చేసింది. స్పేస్ పరిభాషలో విక్రమ్ ల్యాండర్ స్లీప్ మోడ్లోకి వెళ్లిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' వివరించింది. ల్యాండర్ నిద్రావస్థలోకి వెళ్లకముందు అందులోని పేలోడ్లు ChaSTE, RAMBHA,ILSA నూతన ప్రదేశంలో నిర్వహించిన ప్రయోగాల డేటా ఇస్రో కేంద్రానికి చేరిందని పేర్కొంది. ప్రస్తుతం పేలోడ్లు స్విచ్ ఆఫ్ అయ్యాయని తెలిపింది. అయితే ల్యాండర్ రిసీవర్లు మాత్రం ఆన్ లోనేఉన్నట్లు తెలిపింది. రోవర్, ల్యాండర్ SEP-22 తర్వాత తిరిగి పని చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. అయితే అందులోని బ్యాటరీలు ఫుల్ గా ఛార్జింగ్ లోనే ఉన్నాయన్న ఇస్రో.  పేలోడ్లు పంపిన సమాచారం విశ్లేషణ జరుగుతుందని ప్రకటించింది. ల్యాండర్ పంపిన సమాచారంలో ఉన్న విషయాలు పరిశోధన తరువాత త్వరలోనే బాహ్య ప్రపంచానికి తెలియనున్నాయి.