అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చిన వాట్సప్


Ens Balu
13
United States
2023-10-07 08:44:47

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సప్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది. గ్రూపు వీడియో కాల్ చేసుకోవాలంటే ఒకప్పుడు ఒకరికి కాల్ చేసిన తరువాత మరొకరిని యాడ్ కాల్ కొట్టి మాట్లాడేవారు. కానీ ఇపుడు వాట్సప్ వీడియోకాల్ లింక్ ను డెవలప్ చేసింది. మనంఎవరితో అయితే మాట్లాడలనుకుం టున్నామో వారందరికీ వీడియో కాల్ లింక్ షేర్ చేయడమే, వెంటనే వాళ్లు కూడా గ్రూప్ వీడియో కాల్ కి కనెక్ట్ అవుతారు. ఒకప్పడు ఈ విధానం జూమ్ కాలింగ్ లో ఉండేది. అయితే వాట్సప్ ప్రత్యర్ధి యాప్ లు, వెబ్ సైట్ లలో ఉండే ఫీచర్లన్నింటినీ ఒకే చోటుకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ, ఒక్కో ఫీచర్ ను అందుబాటులోకీ తీసుకు వస్తున్నది. తద్వారా వినియోగదారులు వాట్సప్ ను తన ఫోన్ లో నుంచి డిలీట్ చేయకుండా ఉండచేలా కొత్త ఫీచర్లతో దారులును మూసేస్తున్నది. మొన్ననే ఫాలోవర్ ఫీచర్ తీసుకొచ్చి ఇతర సోషల్ మీడియ యాపల్ గట్టి పోటీ ఇచ్చిన వాట్సప్ ఇపుడు ఈ కొత్త ఫీచర్ తో వినియోగదారులకు మరింత చేరువ అయ్యింది. ముఖ్యంగా ఈ గ్రూప్ వీడియో కాలింగ్ లింక్ ఫీచర్ చిన్న గ్రూపులు, కంపెనీలు, సంస్థలకు, బయట ప్రాంతాల్లో ఉన్నవారి ఉద్యోగులతో ఒకేసారి మాట్లాడుకోవడానికి చక్కగా ఉపయోపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియో కాలింగ్ లింక్ ను ఎవరై సభ్యులు మన నెంబర్లను బ్లాక్ చేస్తే మాత్రం పంపడానికి వీలు పడదని మెటా నిర్వాహకులు వాట్సప్ లో ఇచ్చిన లింక్ డిస్క్రిప్షన్ లో తెలియజేశారు. రానున్న రోజుల్లో వాట్సప్ మరిన్ని ఫీచర్లు తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉందట.