బాయ్ వర్డ్ ప్యాడ్.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన


Ens Balu
54
United States
2023-09-04 09:25:56

మైక్రోసాఫ్ట్ తన వర్డ్ ప్యాడ్ కి బై బై చెప్పేసింది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ అధికారికంగా వెల్లడించింది. విండోస్ 95తో పరిచయమైన వర్డ్‌ప్యాడ్ 30 ఏళ్లలో ఎంతో మంది ప్రజల్లో ఆదరణ పొందింది. నెటిజన్లు, కంప్యూటర్లు వినియోగించేవారు డాక్యుమెంట్ రైటింగ్‌లో వర్డ్‌ప్యాడ్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. అయితే భవిష్యత్‌లో విడుదల చేసే విండోస్ వెర్షన్‌లో వర్డ్‌ప్యాడ్ ఉండదని మైక్రోసాఫ్ట్ తేల్చి చెప్పేసింది. అలా అని అప్‌డేట్ వెర్షన్ కూడా రాదని.. దీని స్థానంలో ‘మైక్రోసాఫ్ట్ వర్డ్’ను వర్డ్ ప్యాడ్ యూజర్లు ఉపయోగించుకోవాలని సంస్థ సూచించింది. చాలా వరకూ ప్రపంచవ్యాప్తంగా దినపత్రికలు, టివి ఛానళ్లు అత్యధికంగా వర్డ్ ప్యాడ్ నే వినియోగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇది కనుమరుగు అయితే మళ్లీ అందరూ నోట్ ప్యాడ్ వైపే తిరగాల్సి ఉంటుంది. ఇప్పటికే నోట్ ప్యాడ్ ను కూడా అధికంగానే వినియోగిస్తున్న యూజర్లు.. అయితే వర్డ్ ప్యాడ్ లో ఉన్నం సౌఖ్యం నోట్ ప్యాడ్ లో ఉండదు.