ఇంతకీ సిత్రాంగ్ తుపాను పయనం ఎటు


Ens Balu
27
Hyderabad
2022-10-19 16:59:25

భారీ తుపాను..భారీ తుపాను..ఇలా సిత్రాంగ్ చుట్టూ ఎన్నో వదంతులు వినిపించాయి. ఆ భారీ తుపాను మాట ఎలా వున్నా సోషల్ మీడియా పుణ్యమాని జరిగిన ప్రచారం మాత్రం అంతా ఇంతా కాదు. ఎట్టకేలకు తుఫాను వదంతుల పై భారత వాతావ రణ శాఖ (ఐఎండీ) స్పష్టతని చ్చింది. తుఫాన్‌ ముప్పు వాస్తవమే నని తేల్చింది. ఈ నెల 22 తర్వాత బంగాళాఖాతంలో తుఫాన్‌ రాబోతుందని మంగళవారం నిర్ధారించింది. ఈ నెల 22 నుంచి 25 మధ్యన తుఫాన్‌ రానున్నట్టు వారం నుంచి అంతర్జాతీ యంగా పలు సంస్థలు  ప్రకటిస్తూ వస్తున్నాయి. అయితే వదంతులు నమ్మవద్దని ఐఎండీ అధికారులు కొట్టిపా రేస్తూ వచ్చినా తుపాను విషయాన్ని మాత్రం ద్రువీకరించారు. ఈ వారంలో అల్పపీడ నం ఏర్పడే అవకాశా లుండడంతో.. ఈ నెల 22 తర్వాత ప శ్చిమ మధ్య బంగా ళాఖాతంలో తుఫాన్‌ రాబోతుందని ఐఎండీ మంగళవా రం ప్రకటించింది. అయితే అల్పపీడ నం ఏర్పడిన తర్వా త మాత్రమే ఈ తు ఫాను ఎక్కడ తీరం దాటుతుంది..?, దాని తీవ్రత ఎలా ఉంటుంది..? వంటి అంశాలపై ప్రకటన చేస్తామని ఐఎండీ చీఫ్‌ మృత్యుంజయ మహాపాత్రో తెలిపా రు.

 కాగా దక్షిణ అం డమాన్‌ సముద్రంలో ని ఉపరితల ఆవర్త నం మంగళవారానికి ఉత్తర అండమాన్‌ సముద్రంలో కొనసా గుతోంది. దీని ప్రభా వంతో ఈనెల 20 నాటికి ఆగ్నేయ, దానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప డుతుందని తేలిపా రు. రెండు రోజుల పాటు పశ్చిమ వా యవ్యంగా పయనిం చే క్రమంలో బలపడి 22వ తేదీకల్లా మ ధ్య బంగాళాఖాతం లోకి ప్రవేశించి వా యుగుండంగా మా రుతుందని తెలిపా రు. మరింత బలప డి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌ గమనంపై ఈనెల 20 తర్వాత ప్రకటన చేస్తామని పేర్కొంది. కాగా.. మంగళవా రానికే పశ్చిమ మ ధ్య అండమాన్‌ స ముద్రంలో అల్పపీ డనం ఏర్పడిందని ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడిం చారు.

 ఇది పశ్చిమం గా పయనించి ఈనె ల 19 లేదా 20వ తే దీకల్లా తీవ్ర అల్పపీ డనంగా మారుతుం దని.. 22కల్లా తూ ర్పు మధ్య బంగాళా ఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా, తీవ్ర వాయుగుండం గా బలపడుతుందని పేర్కొన్నారు. అనం తరం దిశ మార్చుకు ని తుఫాన్‌గా మారి వాయవ్య బంగాళా ఖాతంలో ప్రవేశించి ఉత్తర ఒడిసా, పశ్చి మ బెంగాల్‌ మధ్య తీరం దాటుతుందని తెలిపారు. దీంతో ఈ నెల 23 నుంచి 25 వరకు ఉత్తర కోస్తా జిల్లాలపై కొంత ప్రభా వం ఉంటుందన్నా రు. కాగా తుఫాన్‌ తీరందాటే విషయం లో ఒక్కొక్క సారి ఒక్కో విధంగా ఉం టుందని  చెప్పారు. మోడల్‌ ఒకేలా అంచనా వేసింది. తుఫాన్‌ ఉత్తర కోస్తా లో తీరం దాటుతుం దని అమెరికా వాతా వరణ విభాగానికి చెందిన జీఎఫ్‌ఎస్‌ అంచనా వేయగా, ఐరోపాకు చెందిన 'ఈసీఎండబ్ల్యూఎఫ్‌', ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా మరికొన్ని దేశాలు నిర్వహిస్తు న్న 'ఎన్‌సీయూఎం' మాత్రం బంగ్లాదేశ్‌ వైపు వెళుతుందని పేర్కొన్నాయి. కాగా తీవ్ర తుపాను అలెర్ట్ తో అన్ని దేశాల ప్రభుత్వాలు జాగ్రత్తపడుతున్నాయి.