ఆదాయ మార్గల వేటలో సోషల్ మీడియా దిగ్గజం


Ens Balu
23
California
2023-01-04 04:30:05

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘ట్విట్టర్’ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్కెటింగ్ మార్గాన్ని ఎంచుకుంది. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో అనుమతించబడిన రాజకీయ ప్రకటనల రకాలను మరింతగా విస్తరింపజేస్తామని ట్విట్టర్  తెలిపింది. యూఎస్ లో ‘కాజ్ బేస్డ్ యాడ్స్’ కోసం తమ ప్రకటనల విధానాన్ని కూడా సడలించనున్నట్లు పేర్కొంది. తమ ప్రకటనల విధానాన్ని టీవీ, ఇతర మీడియా అవుట్ లెట్ ల ద్వారా ప్రచారం చేసి ట్విట్టర్ ప్రమోషన్ పెంచనుందట. 2019లో ట్విట్టర్ రాజకీయ ప్రకటనలను నిషేధించింది 2023లో అవే రాజకీయ ప్రకటనలు ప్రోత్సహించడం చర్చనీయాంశం అవుతుంది.