ఇండోనేషియాలో మరోసారి కంపించిన భూమి


Ens Balu
16
Tobelo
2023-01-24 02:22:42

ఇండోనేషియా ప్రజలు భూకంపాలతో వణికిపోతున్నారు. తాజా ఇక్కడ మరోసారి భూకంపం స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది.. టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో సోమవారం అర్థరాత్రి భూమి కంపించింది. దీనితో భయాందోళనకు గురైన ప్రజలు బయటకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు USGS వెల్లడించింది. సముద్ర మట్టానికి 12 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. కాగా, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.