మల్టీ లాంగ్వేజ్ ఫీచర్ తో రాబోతున్న యూట్యూబ్


Ens Balu
59
United States
2023-02-26 09:54:03

ప్రపంచలోని అన్ని భాషలు అందరూ తెలుసుకునేలా..ఏ భాషలో ఉన్న ప్రాంతీయ భాషలో తెలుసుకునేలా యూట్యూబ్ సరికొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. అవుతు మీరు చదువుతున్నది అక్షర సత్యం. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ వస్తే ఏ భాషలోని విడియో అయినా మనకి నచ్చిన భాషలో ఆడియోను వినవచ్చు. తద్వారా యూట్యూబ్ లోని సమాచారం మరింత మందికి వినియోగపడటం ఖాయంగా కనిపిస్తున్నాది.  కాగా ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసేందుకు సెట్టింగ్స్ లో ఉన్న ఆడియో ట్రాక్ ఆప్షన్ ను క్లిక్ చేసి, నచ్చిన భాషను సెలక్ట్ చేసుకోవాల్సి వుంటుంది. ప్రస్తుతం యూట్యూబ్ ని వినియోగించుకొని చాలా మంది విద్యార్ధులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమకు కావాల్సిన సమాచారం తెలుసుకుంటున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడం ద్వారా ఇతర లాంగ్వేజిల్లో ఉన్న వీడియోలను చక్కగా అర్ధం చేసుకోవడానికి వీలుపడుతుంది.