విశాఖ మీకు గుర్తిండిపోతుందని భావిస్తున్నాను


Ens Balu
11
Visakhapatnam
2023-03-28 16:03:03

విశాఖ వేదికగా జరుగుతున్న జీ–20 సదస్సుకి తొలి రోజు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అతిథులతో కలిసి ఆయ న విందులో పాల్గొన్నారు. అనంతరం వారితో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు. విశాఖలో మీరు గడిపిన సమయం మీకు మధురానుభూతిని మిగులుస్తుందని భావిస్తున్నానని అన్నారు.  ఆంధ్రప్ర దేశ్ లో ప్రతి ఒక్క నిరుపేదకూ ఇంటి సౌకర్యం కల్పించాలన్నది మా ఉద్దేశమని అన్నారు. అంతేకాకండా మేము అధికారంలోకి వచ్చాక.. 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని, 22 లక్షల ఇళ్లు కడుతున్నామని తెలియజేశారు. ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించ డానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోందని వివరించారు. దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయిన్‌బుల్‌ పద్ధతులను సూచించాల ని కోరారు. ఈ అంశంపై మీరు చక్కటి చర్చలు చేయాలన్నారు.