ట్విట్టర్ తో భారీ ఆదాయం ఆర్జించే దిశగా అడుగులు


Ens Balu
26
United States
2023-04-27 06:55:53

ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్‌మస్క్‌ నష్టాలను పూడ్చుకోవడంతోపాటు, భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో పడ్డాడు. దా నికోసం ట్విట్టర్ లో చాలా మార్పులు చేస్తూ వస్తున్నాడు. తాజాగా యూజర్లు తమ కంటెంట్‌ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు మానిటైజే షన్‌ ఆప్షన్‌ తీసుకొచ్చి ఆధ్యంతం ట్విట్టర్ కు ప్రేక్షకులను కట్టిపడేసేవిధంగా తయారు చేశాడు. ఎక్కువ నిడివి గల వీడియోల వరకు దేనికైనా సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ పెట్టుకొని డబ్బులు ఆర్జించుకోవచ్చని ప్రకటించడాడు. దీంతో మస్క్‌ ట్విటర్‌కు 24,700 మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా ఒ క్కోక్కరి నుంచి నెలకు రూ.277 అంటే ఏడాదికి రూ.8.2 కోట్లు రానున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తున్నతరుణంలో ట్విట్టర్ ను వేదికగా చేసుకొని చాలా రాజకీయపార్టీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన మస్క్ దాని ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలనే ఆలోచనతో వినూత్నంగా ముందుకి కదులుతుండటం చర్చనీయాంశం అవుతోంది.