2021 వరకూ కరోనాకి వేక్సిన్ కష్టమే:స్వామినాధన్


Ens Balu
2
India Gate
2020-07-06 22:49:26

కరోనాకు 2021 కంటే ముందుగా వ్యాక్సిన్‌ సిద్ధమయ్యే అవకాశంలేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్‌ -19ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ ఆగస్టు 15వ తేదీ లోపు అందుబాటులోకి రావాలని భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆదేశాలివ్వడంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విధంగా స్పందించింది. మరోవైపు, వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ పూర్తికావడానికి కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. కొవాగ్జిన్‌, జైకోవ్‌-డీతో పాటు కరోనా చికిత్సకు ప్రయోగాలు జరుపుకుంటున్న ఏ వ్యాక్సిన్‌ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశంలేదని తెలిపింది. ‘కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం ఆరు భారతీయ ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.