వ్యాక్సిన్ వచ్చేంత వైరస్ ప్రభావాలు పరిశీలించాలి..


Ens Balu
0
Geneva
2020-10-31 13:58:12

కరోనా వైరస్ కు టీకా వచ్చేంత వరకూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వ్యాధినిరోధక శక్తిని పెంచే విధంగా వైద్యసేవఅ అందించడం ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డా.టెడ్రోస్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాకి ఒక వీడియో సందేశాన్ని పంపారు. ఆయన మాటల ప్రకారం కరోనా వైరస్ ఒక్క వ్యాక్సిన్ ద్వారా నియంత్రించడానికి వీలుపడుతుందన్నారు. అంతవరకూ కరోనా లక్షణాలను, వాటి ద్వారా వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను కూడా గుర్తించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. అటు డబ్ల్యూహెచ్ ఓ కూడా కరోనా ప్రభావాలను లక్షణాలను గమనిస్తోందన్నారు. వైరస్ సోకిన తరువాత వచ్చే దీర్ఘకాలిక ప్రభావాలను గుర్తించి మందుల ద్వారా నియంత్రించగలిగితే వాక్సిన్ వచ్చిన తరువాత సురక్షితంగ ఉండొచ్చునని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం, దానియొక్క ప్రభావాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రపంచానికి తెలియజేస్తూ వస్తుందన్నారు..