వాట్సాప్‌‌లో కొత్త ఫీచర్ ఇదే..!


Ens Balu
0
California
2020-11-06 13:32:31

వాట్సాప్ యూజర్లకు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ, యాప్ అనిస్టాల్ చేయకుండా కట్టిపడేసేలా చేస్తుంది సంస్థ.. ఈక్రమంలోనే కొత్త అప్‌‌డేట్ తీసుకు వస్తున్నామంటూ వాట్సప్ యూజర్లకు సంస్థ లీకిచ్చింది. ఈ యాప్‌‌లో ‘డిసప్పియరింగ్ మెసేజెస్’ ఫీచర్‌‌ను తీసుకొస్తున్నట్లు  ప్రకటించింది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుంటే వ్యక్తిగత చాట్‌‌తోపాటు గ్రూప్ చాట్స్‌‌లో ఏడు రోజుల తర్వాత మెసేజులు వాటంతటవే డిలీట్ అయిపోతాయి.  ఆండ్రాయిడ్, ఐఓఎస్, లైనక్స్ బేస్డ్ కైఓఎస్ డివైజెస్‌‌తోపాటు వాట్సాప్ వెబ్, డెస్క్‌‌టాఫ్ ప్లాట్‌‌ఫామ్స్‌‌లో ఈ నెలాఖరుకల్లా కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. టెలిగ్రామ్‌‌తో పోల్చుకుంటే వాట్సాప్‌‌లో డిసప్పియరింగ్ ఫీచర్ కాస్త వైవిధ్యంగా ఉండనుంది. టెలిగ్రామ్‌‌లో మెసేజులు ఎప్పుడు డిలీట్ అవ్వాలనే ఆప్షన్‌‌లో గంటలు, రోజుల పరిమితి ఉంటుంది. కానీ వాట్సాప్‌‌లో 7 రోజుల డిసప్పియర్ పీరియడ్ మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ‘మేం ఏడు రోజుల పీరియడ్‌‌తో దీన్ని మొదలుపెడుతున్నాం. ఎందుకంటే తమ సంభాషణలు శాశ్వతం కాదని యూజర్లకు తెలియాలి. దీంతో వాళ్లు తాము ఏం చాటింగ్ చేయాలనే దానిపై స్పష్టతతో ఉంటారు అని చెబుతోంది వాట్సప్. మీరు వెతికే స్టోర్ అడ్రస్, షాపింగ్ లిస్ట్‌ మీకు అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆటోమెటిక్‌‌గా డిలీట్ అయిపోతుంది’ అని వాట్సాప్ ఓ ప్రకటనలో పేర్కొంది. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌‌ను అన్ని చాట్ విండోలకు ఒకేసారి ఎనేబుల్ చేయలేం. ఏ చాట్ విండోకు ఫీచర్‌ కావాలనుకుంటే ఆ చాట్‌‌లో ఎనేబుల్ చేసుకోవచ్చు అని కూడా వివరించింది..