కరోనా వైరస్ టీకా విడుదల విషయంలో రష్యా టాప్..పుతిన్


Ens Balu
1
Russia
2020-08-11 20:40:44

ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న వేళ కొనసాగుతున్న టీకా రేసును ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచానికి తొలి ఆశాకిరణం కనిపించింది రష్యా. కరోనా వైరస్‌పై తొలి వ్యాక్సిన్‌ను రష్యా విడుదల చేసింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడుతూ, తన కుమార్తె టీకా వేయించుకున్నట్టు వెల్లడించారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన తొలిదేశంగా రష్యా ప్రపంచంలో నమోదు అయినట్టు అయ్యింది. టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌ నియంత్రణలోకి వస్తుందని తెలిపిన పుతిన్‌...తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయయులకు ఈ టీకా ఇస్తామన్నారు.  ‘కరోనా వైరస్‌పై టీకా అభివృద్ధి చేసిన  తొలిదేశంగా రష్యా నిలిచింది’ అని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది.  ఈ టీకా సంబంధించిన సమాచారాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలని ఆయన దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురాస్కోను ఆదేశించడం విశేషం..దీనితో ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ టీకా విషయంలో రష్యా ముందు వరసులో నిలుచున్నట్టు అయ్యింది.