20–40వయసున్న వారి నుంచే అధికంగా కరోనా WHO
Ens Balu
3
Geneva
2020-08-18 21:00:27
కరోనా వ్యాప్తి కారకాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తాజాగా చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది... 20 నుంచి 40 ఏండ్ల వయసున్న వారి ద్వారానే కరోనా వ్యాప్తి అధికంగా జరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ వెస్ట్రన్ పెసిఫిక్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ తకేషి కసయి మంగళవారం నాడు తెలిపారు. ఇరవై నుంచి నలభై ఏళ్ల లోపు వారు తమకు తెలీకుండానే కరోనా బారినపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యంగానే ఉన్నామనుకుని వివిధ ప్రాంతాల్లో ప్రయాణించడం మూలాల కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆయన చెప్పారు. తమకు కరోనా సోకిందన్న విషయం వీరిలో అనేక మందికి తెలియక పోవడం విశేషమన్నారు. ఈ పరిస్థితి వృద్ధులకు, అనారోగ్యంగా ఉన్నవారికి ఇది పెద్ద ప్రమాదకరంగా మారుతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థ అందుబాటులో లేని ప్రాంతాలు, జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.