ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు బాయ్ బాయ్..!
Ens Balu
3
Washington
2020-08-19 19:30:00
ఇంటర్నెట్ వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ ఒక చేదువార్తను తెలియజేసింది. ఇంతకాలం వినియోగించిన ఇంటర్నెట్ ఎక్సోప్లోలర్ ను వచ్చే ఏడాది నుంచి నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. దానికి కారణం సుమారు 365 యాప్స్ సేవలు దీనికి భవిష్యత్తులో సపోర్టు చేయకపోవడమేనని వివరించింది. వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దశలవారీగా దీని సేవలను నిలిపివేస్తామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ది ప్రత్యేక స్థానం. ప్రజలకు అంతర్జాలాన్ని దగ్గర చేసిన ఘనత దీనికే దక్కుతుంది. ఇప్పుడు కంపెనీ తీసుకున్న నిర్ణయంతో అది కాలగర్భంలో కలిసిపోనుంది. 2021 ఆగస్టు 17 నుంచి ఆఫీస్ 365, వన్ డ్రైవ్, ఔట్‌లుక్ వంటివి ఎక్స్‌ప్లోరర్11ను సపోర్టు చేయవని.. ఈ ఏడాది నవంబర్ 30 తర్వాత నుంచి తమ టీమ్ కూడా అందుబాటులో ఉండదని పేర్కొంది. ఇక ఎడ్జ్ లెగస్సీ డెస్క్ టాప్ యాప్‌కు కూడా వచ్చే మార్చి 9 నుంచి స్వస్తి పలుకుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.