వ్యాక్సిన్ తీసుకోకపోతే తీవ్ర ప్రమాదం..


Ens Balu
5
Washington
2021-07-04 13:51:03

కరోనా తన స్వరూపాలను మార్చుకుంటున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా నిపులు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాదు అలాంటివారందరినీ కరోనా కొత్త వేరియంట్ ఫ్యాక్టరీ నిర్వాహకులుగా అభివర్ణిస్తున్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం మన ముందున్న ఏకైక మార్గం వ్యాక్సిన్ తీసుకోవడం. కానీ చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. ఏదో ఒక కారణం చెప్పి వ్యాక్సిన్ తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. ఇలా చేయడాన్ని అమెరికాలోని వ్యాండెర్‌బిల్ట్ యూనివర్సిటీలోని అంటువ్యాధుల నిపుణులు తప్పుబడుతున్నారు. ఈ వర్సిటీకి చెందిన డాక్టర్ విలియం షాఫ్నర్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోని వారు వైరస్ కొత్త వేరియంట్ల ఉత్పత్తికి ఫ్యాక్టరీల్లాంటి వాళ్లని చెప్పారు. ‘‘ఎంతమంది వ్యాక్సిన్ తీసుకోని ప్రజలు ఉంటే.. వ్యాక్సిన్ పెరగడానికి అన్ని ఎక్కువ అవకాశాలు ఏర్పడతాయి. ఇది పెరిగేకొద్దీ మ్యూటేషన్లు జరుగుతాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న వేరియంట్ల కన్నా భయంకరమైన వేరియంట్‌ తయారై ప్రపంచం మీద విరుచుకు పడే ప్రమాదం ఉంది’’ అని విలియం షాఫ్నర్ పేర్కొన్నారు.