కోవిడ్ నిర్దారణ పరీక్షలు, క్వారంటైన్ కేంద్రాలు పై వైద్య సిబ్బంది,డాక్టర్లు, క్వారంటైన్ కేంద్రాల ఇన్ చార్జులతో జాయింటు కలెక్టరు యం. వేణుగోపాలరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ క్వారంటైన్ కేంద్రాలుగా పెయిడ్ మరియు ఉచిత కేంద్రాలు ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. పెయిడ్ క్వారంటైన్ కేంద్రాలుగా 5 మరియు 4 స్టార్, 3 స్టార్, బడ్జేట్ హోటల్స్ లను మూడు కేటగిరీలుగా అనుమతులు యివ్వడమైనదన్నారు. అనుమతి పొందిన హోటల్స్ మాత్రమే పెయిడ్ క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించాలని, కొత్తగా అనుమతులు కావలసిన హోటల్స్ తమను సంప్రదిస్తే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. క్వారంటైన్ కేంద్రాలలోని వారిని బయటకు పంపకూడదని తెలిపారు. క్వారంటైన్ కేంద్రాలలోని వారిని 7 వరోజున డిశ్శార్జి చేయాలని తెలిపారు. ఏరోజు టెస్టులు ఆరోజే వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అదికారులకు సూచించారు. అవసరమైనన్ని టెస్టింగు కిట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లోకి వివిధ పనుల కింద వచ్చేవారంతా తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని జిల్లా కలెక్టర్ నివాస్ హెచ్చరించారు. శనివారం ఈ మేరకు అన్ని శాఖ అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. మాస్కులేకుండా వస్తే ఎలాంటి వారికైనా ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఎంట్రీని ని