*నిత్యం మజ్జిగ తాగితే మొలల రోగం తగ్గుతుంది
*మజ్జిగతో బంక విరేచనాలకు అడ్డుకట్టవేయొచ్చు
*శరీరంలో జఠాగ్నిని వ్రుద్ధి చేయడానికి ఉపయోగం
*కఫవాతాలను హరించును హరించడంలో దిట్ట
*కఫాన్ని తగ్గించడంలో మజ్జిగ కీలకపాత్ర పోషిస్తుంది
*వేడిచేసిన వారికి పలుచటి మజ్జిగ దివ్య ఔషదం
*మజ్జిగలో జీలకర్ర, కొత్తమీర తీసుకుంటే బరువు తగ్గుతారు
*శుక్రకణాలు తక్కువగా ఉన్నవారు మజ్జిగ తీసుకోవాలి
*సరైన మజ్జిగ అంటే ఒవంతు పెరుగు మూడొంతుల నీరు
*మలాన్ని బయటకు పంపుటకి మజ్జిగ సరైనది
*ఉదర సమస్యలు తగ్గించడంతో మజ్జిగ దివ్యఔషదం
*మజ్జిగ తరచుగా తీసుకుంటే చాలా రోగాలు దరిచేరవు
*48 రోజులు తింటే శరీరానికి సహజ సిద్ద సౌందర్యం
* బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు సి, ఎ ఉంటాయి
*జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్ దీనిలో సమృద్ధిగా ఉంటుంది
*విటమిన్ 'బి6', 'సి', ఫొలేట్, 'రైబోఫ్లెవిన్', పొటాషియం, మెగ్నీషియం
*పొన్నగంటి కూర కళ్లకు మంచి చూపునిస్తుంది
*పొన్నగంటిని బంగారపు కూర ఆకుగా వర్ణిస్తారు.
*మూలశంఖ రోగులకు ఎంతో చక్కని ఆకుకూర
*శరీరంలోని అధిక వేడిని క్షణాల్లో తగ్గిస్తుంది
*మైగ్రేన్, తలనొప్పిని తగ్గించడంలో దిట్ట
*శరీరంలోని రుగ్మతలను తగ్గించడంలో కీలక పాత్ర
*ఖనిజాలు, పోషక విలువలు కావాలంటే నిత్యం తినాలి
*గోంగూర వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు
*విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా అందుతాయి
*తరచుగా తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది
*ఇందులో విటమిన్ సి, ఎ, బి6 మెండుగా ఉంటాయి
*ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలం
* ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ అత్యధికంగా ఉంటాయి
*గోంగూర క్యాన్సర్ ను నియంత్రించడంతో దిట్ట
*రక్తాన్ని పెంచడంతోపాటు, సరఫరా బాగా చేస్తుంది
*గోంగూర తరచుగా తింటే రేచీకటి దరిచేరదు
* గుండె, కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు
*ఎముకును పటిష్టంగా ఉంచి డొల్లబారనీయవు
కొండనాలిక(throat infection)తో బాధపడేవారు రెండు మూడు రోజుల్లోనే దాని నుంచి ఉపసమయం పొందడానికి హోమియో మందు బెల్లడోనా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బెల్లడోనా200 పొటన్షియల్ ను సుగర్ కేన్ పిల్స్ లోగానీ, గ్లాసు మంచినీటిలో రెండు చుక్కలు వేసి గానీ, మూడు పూటలా తాగుతూ ఉంటే మూడు రోజుల్లోనే కొండనాలుక నుంచి ఉపసమనం కలుగుతుంది. ఈ మందు ఒక్క కొండనాలుకకే కాకుండా బోదకాలు రాకుండా, వెర్టిగో(మెడ ఎముకలు ఆరిగినపుడుఒళ్లు జోగుతున్నప్పుడు, వాంతులు, తలతిరగటం వంటి రోగాలకు) కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే అదే పనిగా ఈ మందు వేసుకోకూడదు. అత్యల్పంగా ఐదురోజులు...అత్యధికంగా 10 రోజులు మాత్రమే ఈ మందు వేసుకోవాలి. వైద్యుల పర్యవేక్షణలో పొటన్షియల్ డోసు తెలుసుకొని కొండనాలుక తీవ్రతను బట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం వుంటుంది.. అతితక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొండనాలుకను, తద్వారా వచ్చే అత్యధిక పొడి దగ్గును ఈ బెల్లడోనా హోమియో మందుతోనూ తగ్గించుకోవచ్చు. ప్రభుత్వ ఆయూష్ డిస్పెన్సరీల్లో ఈ మందును ఉచితంగా కూడా పొందవచ్చు. ముఖ్యగమనిక..వైద్యుల పర్యవేక్షణ లేకుండా మందులు వాడటం ప్రమాదకరం..
ఆకుకూరల్లో రారాజు తోటకూర. ఈతోటకూర వలన సహజసిద్ద లాభాలు తెలిస్తే ప్రతీరోజూ తినడానికి అందరూ ఆశక్తి చూపుతారు. రూ.వేలు ఖర్చు చేసి మందులు వేసుకునే కంటే ప్రతీరోజూ 100గ్రాములు తోటకూర తీసుకుంటే వచ్చేలాభాలాంటో మీరు తెలుసుకుంటే.. మాంసకృత్తులు 18గ్రామలు, జీరో కేలరీలు, జీరోఫ్యాట్, ఇక విటమిన్ ల విషయానికొస్తే కంటి చూపుకోసం పనిచేసే ఏ విటమిన్ తోపాటు కే,బి6, రిబోప్లావిన్, ఫోలిక్ యాసిడ్, మినరల్స్ -కాల్సియం, ఐరన్, మగ్నీసియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా వుంటాయి. ముఖ్యంగా రక్తహీనత బారిన పడిన వారు నిత్యం తోటకూర తింటే రక్తంలోని హిమోగ్లోబిన్ అమాంతం పెరుగుతుంది. ఆకలి పుట్టించడంతోపాటు, జీర్ణశక్తిని కూడా బాగా పెంపొందిస్తుంది. తోటకూర మంచి విరేచనకారి కూడా పిల్లలకు తోటకూరను రోజూ పప్పులో వేసి పెట్టడం ద్వారా మంచి పోషక విలువలు అందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు..
ఐదు యాపిల్స్ కి ఒక్క మంచి దోర జామకాయ సమానమంటారు...జామకాయలో ఎన్ని ఔషదగుణాలున్నాయో అదేరీతిలో జామఆకులో కూడా అన్నే ఔషద గుణాలున్నాయని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఎన్నో ఆరోగ్యసుగణాలున్న జామ ఆకుల కషాయం నిత్యం తీసుకుంటే క్యాన్సర్ నుంచి కూడా బయటపడవచ్చునట. జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జామ ఆకుల్లో అధిక మొత్తంలో ట్యానిక్స్, ఆక్సలేట్స్ ఉంటాయి. అందువల్ల నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలినా లేదా లేత ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలి పట్టినా ఈ సమస్యలు తగ్గుతాయి. 2. మూడు లేదా నాలుగు జామ ఆకుల్ని నీటిలో వేసి మరిగించి చల్లారాక ఆ నీటిని తాగడం వల్ల జలుబు సంబందిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా జామ ఆకుల కషాయం తీసుకోవడం వల్ల నడుము నొప్పి కూడా తగ్గుతుంది. 3. మనం తరచుగా జామ ఆకు కషాయాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. 4. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు జామఆకు కషాయాన్ని తాగడం వల్ల మంచి నిద్రపట్టేలా చేస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ తీరుని మెరుగుపరుస్తుంది. మలబద్దక సమస్యను తగ్గిస్తుంది. 5. జామ ఆకుల కషాయం తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించి, శరీరంలో రక్తం అన్ని అవయవాలకు సరఫరా అయ్యేలా చూస్తుంది. అందువల్ల గుండె సంబందిత సమస్యలు రాకుండా ఉంటాయి.
కాకరకాయా అబ్బో చేదు..తినడం నావల్ల కాదు బాబూ అనేవారందరికీ దీనియొక్క అసలైన ప్రయోజనాలు తెలుసుకుంటే...కాకరకాయతప్పా మరేమీ తినని భీష్మించుకుని కూర్చుంటారు...నమ్మకం లేదా..అయితే ఈ హెల్త్ న్యూస్ కార్డ్ చదవండి.. కాకరకాయను హిందీలో కాకరకయను "కరేలా" అంటారు. ఈ కూరగాయను కాకరకాయ, బిట్టర్ మెలోన్, ఇంగ్లీషులో బిట్టర్ స్క్వాష్ అని పిలుస్తారు. దాని పేరులోనే చేదు ఉందని దాన్ని చూసినప్పుడు నామనసుకు అనిపించే మొదటి విషయం. అది పెరిగే ప్రాంతాన్ని బట్టి ముదురు లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది చేదుగా ఉన్నప్పటికీ, అనేక ప్రయోజనాలు కలిగిన ఆక్సీకరణలు, ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉంటుంది. బిట్టర్ మిలాన్ ని జ్యూస్ లాంటి పానీయంలో, పచ్చళ్ళలో లేదా కొన్ని వంటలు వంటి వివిధ మార్గాలలో ఉపయోగిస్తారు. బిట్టర్ మిలాన్ లో పోషకాహార విలువలు తెలుసుకుంటే.. బిట్టర్ మిలాన్ లో A,B,C వంటి విటమిన్లు, బీటా-కేరొటీన్ వంటి ఫ్లవోనాయిడ్స్, ?-కెరోటిన్, లుటీన్, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీసు, మెగ్నీషియం వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా శాస్వత రుగ్మతలైన ఆస్తమా, జలుబు, దగ్గు మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నివారణకు అద్భుతమైన చికిత్స కాకరకాయ పనిచేస్తుంది. పైగా లివర్ టానిక్ గా కూడా దీనికి మంచి పేరుంది..రోజూ ఒక గ్లాసు బిట్టర్ మెలోన్ జ్యూస్ తాగితే లివర్ సమస్యలు నయమవుతాయి. ఇలా వారంరోజులు చేసినట్లైతే ఫలితం చక్కగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో పలు రకాల వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి మనం చాలా మాత్రలు మింగుతుంటాం కాన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి నీటిలో బిట్టర్ మెలోన్ ఆకులు లేదా పండ్లను ఉడికి౦చండి, దీనిని రోజూ తీసుకుంటే అంటురోగాలు రానీకుండా చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తి పెంపొందడానికి ఎంతో సహాయపడుతుంది. ఈరోజుల్లో యుక్త వయస్సు అమ్మాయిలను వేధించే సమస్య మొటిమలు..బిట్టర్ మెలోన్ మొటిమలు, మచ్చలు, చర్మ అంటువ్యాధులను తొలగించుకోవడానికి మిక్కిలిగా ఉపయోగపడుతుంది. నిమ్మరసంతో కూడిన బిట్టర్ మెలోన్ ని ప్రతిరోజూ పరగడుపున 6 నెలలు తీసుకుంటే, సరైన ఫలితాలు పొందుతారనడంలో ఎలాంటి సందేమూ లేదు.. ప్రస్తుత రోజుల్లో 40 సంవత్సరాలు దాటిన ప్రతీ వ్యక్తినీ ఇబ్బంది పెట్టేది మధుమేహం మన వాడుక భాషలో సుగర్ అంటాం కదా...దానిని అదుపులో పెట్టడానికి బిట్టర్ మెలోన్ రసం 2 వ రకం మధుమేహవ్యాధిని అధిగమించడానికి అత్యంత సాధారణ నివారణ మార్గంగా చెప్పవచ్చు. బిట్టర్ మెలోన్ బ్లడ్ షుగర్ తగ్గించడానికి సహాయపడే ఇన్సులిన్ వంటి కొన్ని రసాయనాలను కలిగి ఉంటుంది. దీంతో దీనిని తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. కార్యాలయాల్లో కుర్చీలకే అతుక్కుపోయేవారికి ప్రధానంగా వచ్చే సమస్య మలబద్ధకం...దీనితో ఉదయం బాత్ రూమ్ లో కచేరీ చేస్తుంటారు చాలా మంది అలాంటి ఇబ్బందులు తగ్గించుకోవడానికి బిట్టర్ మెలోన్ లో పీచు లక్షణాలు అధికంగా కలిగిఉండడం వల్ల తేలికగా అరుగుతుంది. ఈ ఆహారం అరుగుదలకు, మలబద్ధకం, అజీర్తి సమస్యల నివారణలో సహాయపడి శరీరం నుండి చెత్తను తొలగించడమే కాకుండా మూత్రపిండాలు, మూత్రాశయంను శుభ్రపరిచి రాళ్లను కరిగిస్తుంది..గుండె జబ్బులను నియంత్రిస్తుంది. బిట్టర్ మెలోన్ అనేక మార్గాలలో గుండెకు చాలా మంచిది. ఇది ధమని గోడలను ఆటంకపరిచే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది, దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బ్లడ్ షుగర్ స్థాయి తక్కువగా ఉండడం వల్ల కూడా గుండెను ఆరోగ్య౦గా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. అన్నింటికంటే ముఖ్యమైనది రోగం కాన్సర్ అలాంటి మొండి రోగాన్ని కూడా బిట్టర్ మెలోన్ కాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించి, బరువు తగ్గడంలో ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. బిట్టర్ మెలోన్ మీ వ్యవస్థ తాజాగా ఉండడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగిఉంది. ఇది మీ జీవక్రియను, అరుగుదల విధానాన్ని అభివృద్ది చేసి తద్వారా త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం పరిధిలోగల ఈ అర్బన్ పి.హెచ్.సి లో 42 వైద్య అధికారి పోస్టులకు (ఎం.బి.బి.ఎస్ అర్హత గలిగి ఏ.పి. ఎం.సి.ఐ.రిజిస్ట్రేషన్ చేసుకొన్న అభ్యర్థులు), 84 స్టాఫ్ నర్స్ పోస్టులుకు (జి.ఎన్. ఎం/బి.ఎస్.సి.(నర్సు) అర్హత గలిగి ఏ.పి. నర్సిగ్ రిజిస్ట్రేషన్ చేసుకొన్న ) అభ్యర్థులు నియామకం కొరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ 17.8.2020 న ఆంధ్రా మెడికల్ కాలేజ్, విశాఖపట్నం ప్రాంగణములో ఉదయం 10.00 గంటల నుండి ఎంపిక కొరకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఒక సెట్ జెరాక్సు కాపీలు, పాస్ పోర్టు సైజు ఫోటోలతో హాజరు కావాలసినదిగా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.తిరుపతిరావు కోరారు.
ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో కరోనా మందుకు సంబంధించి ఓ శుభవార్త చెప్పింది. ఇప్పటికే కరోనా చికిత్సలో భాగంగా అందిస్తున్న రెమ్డిసివిర్‌కు జెనిరిక్ మందుగా కోవిఫర్ పేరుతో వయల్స్‌ను(ఇంజెక్షన్స్) అందుబాటులోకి తెచ్చిన ఈ సంస్థ మరో ముందడుగు వేసింది. కరోనాకు మందుగా ‘ఫావివిర్’ పేరుతో ట్యాబ్సెట్లను భారత్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ‘ఫావిపిరవిర్’ అనే యాంటీ వైరల్ డ్రగ్ ట్యాబ్లెట్లకు జెనిరిక్ మందుగా ‘ఫావివిర్’ను వినియోగంలోకి తేనున్నట్లు హెటిరో బుధవారం ప్రకటించింది. ‘ఫావివిర్’ పేరుతో అందుబాటులో రానున్న ఈ కరోనా మెడిసిన్ ఒక్కో ట్యాబ్లెట్ ధర 59 రూపాయలుగా నిర్ణయించింది. ‘ఫావిపిరవిర్’ ఉత్పత్తికి, మార్కెటింగ్ చేసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం కూడా పొందినట్లు హెటిరో స్పష్టం చేసింది.
విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణశ్రీనివాస్ ప్రజల ను కోరారు. సోమవారం ఆయన చినవాల్తేరులో మీడియాతో మాట్లాడుతూ, కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అయినప్పటికీ కొ న్ని ప్రైమరీ కాంటాక్ట్ ల కారణంగా పాజిటివ్ కేసులు అధికం అవుతున్నాయన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ ద్వారా ప్రతీరోజూ అన్ని వార్డుల్లో సోడియం హై పో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించడంతోపాటు, బ్లీచింగ్ చైన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అత్యవసర సమయాల్లో తప్పా ఎవరూ బయటకు రావొద్ద ని ఆయన పిలుపునిచ్చారు. అందరూ బయటకు రావడం ద్వారా పాజిటివ్ వున్న వ్యక్తుల ద్వారా మరింత మందికి వైరస్ సోకే ప్రమాదముందని అన్నారు. ప్రభుత్వ సూచనలను పాటిస్తూ వైరస్ నియంత్రణలో బాగస్వామ్యం కావాలన్నారు.