1 ENS Live Breaking News

కోవిడ్ టీకా వేయించుకున్న జెసి..

ప్రభుత్వ అధికారులు సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ టీకా వేయించుకోవాలని జెసి డా.కిషోర్ కుమార్ సూచించారు. ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, ప్రభుత్వ అధికారులకు అందించి ఈ వేక్సిన్ పై అపోహలు వీడాలన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో కోవిడ్ టీకాను జెసి వేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రెవెన్యూ, మునిసిపల్, పంచాయితీ రాజ్ శాఖల అధికారులు, సిబ్బందికి  కోవిడ్ నిరోధక టీకా కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేయించుకున్నానని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణ కుమారి ఆధ్వర్యంలో వైద్య బృందం  టీకా వేశారు. ఈ టీకా ఎంతో సురక్షిత మైనదని, అపోహలు వీడి ప్రతి ఒక్కరూ తమకు అవకాశం వచ్చినప్పుడు తప్పని సరిగా వేయించుకొని కోవిడ్ నుండి రక్షణ పొందాలని సూచించారు.

Vizianagaram

2021-02-26 21:25:42

రాష్ట్ర పోటీలో డా..శ్రావ్యకు ద్వితీయస్థానం..

రాష్ట్ర స్థాయిలో ఎనస్థషియాలజీ కాన్ఫరెన్సులో డాక్టర్ వి.శ్రావ్య గాయత్రీ సెకెండ్ ఫ్రైజ్ గెలుచుకోవడం ఆంధ్రామెడికల్ కాలేజికే ఆదర్శమని ప్రిన్సిపాల్  డా.పివిసుధాకర్ కొనియాడారు. శుక్రవారం ఏఎంసీలో జరిగిన కార్యక్రమంలో బహుమతి గెలుచుకున్న రెండవ సంవత్సరం పీజి విద్యార్ధిని శ్రావ్యను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, పీజి స్థాయిలోనే విద్యార్ధిని ఇంత మంచి ప్రతిభను కనబరచడం తన విద్యకు ఎంతో ఉపకరిస్తుందన్నారు. అంతేకాకుండా తన విద్య అనంతరం కూడా మంచి వైద్యసేవలు అందించడానికి ఈ తరహ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎనస్థయాలజీ విభాగం అధిపతి డా.బి.మురళీ క్రిష్ణ, డా.డిబివి, ఆచార్యులు మధుసూదన్, సహాయ ఆచార్యులు డా.వి.రమేష్ కూడా పాల్గొన్నారు.

King George Hospital

2021-02-26 15:22:46

సెకెండ్ వేవ్ కరోనాకి కేజిహెచ్ గేట్ వే..

విశాఖలో సెకెండ్ వేవ్ కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయి.. రెండవసారి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో లక్షణాలు బలంగా కనిపిస్తున్నాయనే ప్రచారం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరికి కరోనా ఉందో, ఎవరు వైద్యం పొందుతున్నారో తెలియకపోవడం మరింత ఆందోళనక కలిగిస్తుంది. ముఖ్యంగా  ఉత్తరాంధ్రా జిల్లాలకు ఆరోగ్య ప్రధాయినిగా వున్న కేజిహెచ్(కింగ్ జార్జి ఆసుపత్రి) దీనికి గేట్ వే మారిపోయిందనే వాదన గట్టిగా ప్రజల్లో నాటుకుపోయింది.. దానికి ప్రత్యేక కారణం కూడా ఉంది..విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ రూరల్ జిల్లాల నుంచే కాకుండా ఒడిసా, చత్తీస్ ఘడ్ ప్రాంతాల నుంచి కూడా ఏ చిన్న రోగమొచ్చినా అందరూ కేజిహెచ్ నే సంప్రదిస్తున్నారు రోగులు. ప్రభుత్వ ఆసుపత్రి కావడం కోవిడ్ కేర్ సెంటర్ కావడంతో కెజిహెచ్ కి రోగుల తాడికి అధికంగా వుంటుంది. ఈ క్రమంలోనే ఏ రోగికైనా కరోనా పాజిటివ్ అని తేలితే వీరికి వైద్యం చేసే వైద్యసిబ్బందికి కూడా మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వందల సంఖ్యలో పారామెడికల్ సిబ్బంది, వైద్యులు, మినిస్టీరియల్ స్టాఫ్ వున్న ఈ కెజిహెచ్ లో ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు కూడా ఒక ప్రతిబంధకంగా పరిణమిస్తోంది. కెజిహెచ్ లో పనిచేసే వారికి కూడా ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో కూడా అర్ధం కాని పరిస్థితి. దీనితో బయోమెట్రిక్ వేసే విషయంలో ప్రతీఒక్కరూ భయపడుతున్నారు. కరోనా కేసులు తగ్గేవరకైనా ఈ బయోమెట్రిక్ విషయంలో అధికారులు వెసులుబాటు కల్పించకపోవడంతో ఇటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది మొత్తం భయం భయంగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. రోగులకు వైద్యసేవలు అందించేవారు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణం అయ్యేటపుడు ఔట్ బయోమెట్రిక్ వేయాల్సి వుంటుది. ఆ సమయంలో ఏఒక్క పారామెడికల్ సిబ్బందికిగానీ, ఉద్యోగికిగానీ, వైద్యుడికి గాని కరోనా పాజిటివ్ వస్తే..అది కాస్త కేజిహెచ్ మొత్తం చుట్టేసే ప్రమాదం లేకపోలేదు. అందులోనూ ఇక్కడకు వచ్చే వందలాది మంది రోగులకు వైద్యచేసే విషయంలో కూడా పారామెడికల్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎలాంటి సేవలు అందించాలన్నా ఇటు కార్యాలయ సిబ్బందిని మరింత భయంతో విధులు నిర్వహించాల్సి వస్తుంది. సెకెండ్ వేవ్ కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కెజిహెచ్ తోపాటు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో భయోమెట్రిక్ హాజరు మినాయింపు ఇవ్వడం ద్వారా కరోనా పాజిటివ్ కేసులు ఒకరి నుంచి మరొకరి రాకుండా ఉంటాయనే వాదన బలంగా వినిపిస్తుంది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతోనే కెజిహెచ్ లోని సిబ్బంది, పారామెకల్ స్టాఫ్, వైద్యులు, కార్యాలయ సిబ్బందికి బయో మెట్రిక్ తప్పనిసరి చేశామని చెబుతున్నారు కెజిహెచ్ ఉన్నతాధికారులు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు వస్తే తప్పా మరోసారి కెజిహెచ్ కి బయో మెట్రిక్ నుంచి మినహాయింపు ఇచ్చే పరిస్థితి లేదని, ఇప్పటికే తమ ద్రుష్టికి ఈ విషయం వచ్చిందని సూపరింటెండెంట్ కార్యాలయం పేర్కొంటుంది. జిల్లా కలెక్టర్ ద్రుష్టిలో ఈ విషయాన్ని పెట్టి అపుడు నిర్ణయం తీసుకునేలా కెజిహెచ్ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకున్నట్టు జరిగితే ఆసుపత్రిలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, కార్యాలయ సిబ్బందికి ఈ వైరస్ సోకే విషయంలో కాస్త ఉపసమనం లభిస్తుంది. లేదంటే కెజిహెచ్ గేట్ వేగా మరోసారి కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతాయనే భయం ఇక్కడి అధికారులను, సిబ్బందిని, వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని పరుగులు పెట్టిస్తుంది. శానిటైజర్లు, మాస్కులు ఇలా స్వీయ నియంత్రణ పాటించినప్పటికీ విశాఖలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఇటు వైద్య ఆరోగ్యశాఖను, ఇతర ప్రభుత్వశాఖల అధికారులను కలవరపాటుకి గురిచేస్తుంది..ఇదే సమయంలో కరోనా వేక్సిన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, వైద్యులకు వేస్తున్నప్పటికీ కేసులు మళ్లీ పెరుగుతుండటం అన్ని వర్గాల ప్రజలకు ఆందోళనకు చెందేలా చేస్తోంది..

Visakhapatnam

2021-02-26 11:15:10

వాక్సినేషన్ లో శ్రీకాకుళం ముందంజ..

కోవిడ్ వాక్సినేషన్ లో శ్రీకాకుళం జిల్లా ముందంజలో ఉందని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు గురు వారం తెలిపారు. హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వాక్సినేషన్ లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్ధానంలో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో 19,727 మంది హెల్త్ వర్కర్లు పేర్లు నమోదు చేసుకోగా ఇప్పటి వరకు 15,694 మంది మొదటి విడత వాక్సిన్ వేసుకున్నారని, 10,061 మంది రెండవ విడత వాక్సిన్ వేయించుకున్నారని చెప్పారు.  రెండవ విడతలో 9,198 మంది కోవీషీల్డు వాక్సిన్ వేయించుకున్నారని చెప్పారు. నమోదు చేసుకున్న వారికి మొత్తం 79.44 శాతం వాక్సినేషన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 64.71 శాతం వాక్సినేషన్ జరుగగా నెల్లూరు జిల్లా 70.80 శాతంతో రెండవ స్ధానంలోను, విజయనగరం జిల్లా 69.19 శాతంతో మూడవ స్ధానంలోనూ నిలిచాయని తెలిపారు. ఫ్రంట్ లైన్ శాఖలైన రెవిన్యూ, పంచాయతీ, మునిసిపాలిటి, పోలీసు శాఖలకు జరుగుతున్న వాక్సినేషన్ కార్యక్రమంలో సైతం జిల్లా ముందంజలో ఉందన్నారు. జిల్లాలో 25,808 మంది రెవిన్యూ, పంచాయతీరాజ్ ఉద్యోగులు నమోదు చేసుకోగా ఇప్పటి వరకు 15,262 మందికి వాక్సిన్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.  మునిసిపల్ సిబ్బంది 4,040 మంది నమోదు చేసుకోగా 2,715 మందికి వాక్సినేషన్ పూర్తి అయిందని అన్నారు. పోలీసు సిబ్బంది 2,246 మంది నమోదు చేసుకోగా బుధ వారం నుండి వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయిందని 1,421 మంది వాక్సిన్ వేయించుకున్నారని తెలిపారు. రెవిన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బందిలో 59.13 శాతం మందికి, మునిసిపాలిటీ సిబ్బందిలో 67.20 శాతం, పోలీసు సిబ్బందిలో 63.26 శాతం మందికి వాక్సినేషన్ పూర్తి అయిందని తెలిపారు.

Srikakulam

2021-02-25 21:20:45

డీవార్మింగ్ డేని విజయవంతం చేయాలి..

బాల స్వాస్త్య కార్యక్రమం క్రింద  మార్చి 3 న డీ వార్మింగ్ డే కార్యక్రమంలో  విజయవంతంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  బుధవారం జిల్లా కలెక్టర్  ఛాంబరులో జిల్లా కలెక్టర్ జె.నివాస్, డి-వార్మింగ్ డే కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా మార్చి 3న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోను మరియు జూనియర్ కళాశాలలలోని విద్యార్ధులకు డీ-వార్మింగ్ మాత్రలు (ఆల్బెండ్జోల్ -400 మి.గ్రా.) నమిలి తినిపించడం జరుగుతుందని తెలిపారు.  పాఠశాలలో ఉదయం 8.00 గం.ల నుండి సాయంత్రం 5.00 గం.ల వరకు నిర్వహించాలని చెప్పారు.    ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులు, అంగన్వాడీ కేంద్రాలలోని పిలల్లతో కలిపి మొత్తం 5 లక్షల, 98 వేల 65 మందికి డీ వార్మింగ్ మాత్రలు ఇవ్వవలసి వుంటుందని. ఇందులో ఏ ఒక్కరూ తప్పిపోరాదని అన్నారు. కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ, ఐ.సి.డి.ఎస్, విద్యాశాఖలు  సంయుక్తంగా నిర్వహించాలని చెప్పారు. బాల స్వాస్థ్య కార్యక్రమ సమన్వయ అధికారి మాట్లాడుతూ, ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి పర్యవేక్షణలో పాఠశాలలకు మార్చి  1వ తేదీ నాటికి పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు.  ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలను మింగించడం జరుగుతుందని, గ్రామాలలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వఛ్ఛంద సేవా సంఘాలు కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.  ఈ మాత్రలు వేసుకోవడం వలన ఎటువంటి దుష్పరిణామాలు వుండవని తెలిపారు.                  ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి  డా.కె.సి.నాయక్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.జగన్నాధం, రామిరెడ్డి, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ సమన్వయ అధికారి డా.కె.అప్పారావు, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రిన్సిపాల్ డా.ఎ.కృష్ణవేణి, సర్వ శిక్ష అభయాన్ ప్రాజెక్టు అధికారి పైడి వెంకటరమణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, ఐ.సి.డి.ఎస్. పి.డి. జయదేవి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కమల, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వెంకట రత్నం డిప్యూటీ డి.ఇ.ఓ.విజయకుమారి,  రోటరీ క్లబ్ సభ్యులు మంత్రి వెంకటస్వామి, లయన్స్ క్లబ్ సభ్యులు డా.కె.కృష్ణ మోహన్, దేవ భూషణ రావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-02-24 19:46:54

కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వీడండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, ప్రజలకు అందిస్తున్న కరోనా వైరస్ పై అపోహలు వీడాలని పశ్చిమ గోదావరి జిల్లా సెట్విస్ సీఈఓ ఎన్.తేజ్ భరత్ సూచించారు. బుధవారం రామచంద్ర ఇంజనేరింగ్ కళాశాలలో  యువతి యువకులకు కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాక్సినేషన్ పై అవగాహన కార్యక్రమమును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ వేసుకోవం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కరోనా నియంత్రణకు యువత ముందుకి రావాలన్నారు. జిల్లా ఇమ్యూనిజేషన్ ఆఫీసర్ డా.నాగేశ్వర రావు మాట్లాడుతూ, కోవిడ్-19 వ్యాక్సినేషన్ అవశ్యకతను, వ్యాక్సినేషన్ తీసుకునే విధానాలను వివరించారు. వ్యాక్సినేషన్ పై విద్యార్దిని విద్యార్దులు అడిగిన సందేహాలను నివ్రుత్తి చేశారు. హెల్త్ ఎడ్యుకేటర్, కృష్ణ మోహన్ మాట్లాడుతూ, కోవిడ్-19 కరోనా వైరస్ పై  రాకుండా తీసుకొనవలసిన జాగ్రత్తలపై విద్యార్ధిని విధ్యార్డులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డి.ఐ.ఓ., కృష్ణ మోహన్, హెల్త్ ఎదికేటర్, డా. భారతి, వట్లూరు పి.హెచ్.సి డా.డోలా సంజాయి, ప్రిన్సిపాల్, రామచంద్ర ఇంజనేరింగ్ కళాశాల, కె.యస్.ప్రభాకర రావు, మేనేజర్, సెట్ వెల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Eluru

2021-02-24 19:44:34

ఆరోగ్యశ్రీ ద్వారా నాణ్యమైన వైద్యం అందాలి..

 ఆసుపత్రులకు వచ్చే ప్రతీ ఒక్క ఆరోగ్య శ్రీ పేషెంట్ కు ఉచిత, నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సంయుక్త కలెక్టర్ డా.మహేష్ కుమార్ ఆదేశించారు.  మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా క్రమశిక్షణా కమిటీ సమావేశం అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల ప్రతినిధులతో నిర్వహించారు.    ఆసుపత్రి వారీగా ఆరోగ్యశ్రీ రోగులకు అందిస్తున్న సేవల గురించి సమీక్షించారు.  ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం రోగులకు  వైద్య సేవలను అందించాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.  ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బంది, నిధులను సమకూర్చుకొని ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.  ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయ అధికారి డా.యు. అప్పలరాజు, ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి డా. జి.నాగభూషణరావు,  జిల్లా స్కిల్ డవలెప్మెంటు అధికారి డా. సాయి శ్రీనివాసరావు, అన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రైవేట్ ఆసుపత్రుల ఎం.డి. పాల్గొన్నారు.

Vizianagaram

2021-02-23 17:11:10

25నాటికి కోవిడ్ వేక్సినేషన్ పూర్తిచేయాలి..

వైద్యాధికారులు సిబ్బందిలో వ్యాక్సిన్ కు సంబందించి పూర్తి అవగాహన కల్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ ఆదేశించారు.సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మునిసిపల్ కమిషనర్లు, తహాసిల్ధార్లు, ఎం.పి.డి.ఓ లు, ఈ.ఓ.పి.ఆర్.డి లు, వైధ్యాదికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఫ్రంట్ లైన్ లో పని చేసిన వారందరికి రిజిష్టర్ అయిన ప్రకారం వ్యాక్సినేషన్ అయిన ప్రక్రియ ఈ నెల 25 వ తేది లోపల పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ లో పని చేసిన 37 వేల మందిలో 55 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ చేయడం జరిగిందని అయితే సమయం తక్కువగా ఉందని వ్యాక్సిన్ చేయించుకోవాలని కోవిన్ యాప్ నందు రిజిష్టర్ చేసుకున్న వారందరికి వ్యాక్సిన్ చేయాలని ఆయన అన్నారు. గతంలో కరోనా వైరస్ వ్యాది నివారణకు మండల స్థాయిలో ఈ.ఓ పి.ఆర్.డి లు ఏ విధంగా పని చేశారో అదే విధంగా వ్యాక్సినేషన్ విషయంలో టీంలను ఏర్పాటు చేసుకొని రిజిష్టర్ చేసుకున్న వారికి 48 గంటల ముందే ఫోన్ ద్వారా కానీ లేదా టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా సమాచారం ఇచ్చి వారు వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలన్నారు. ఎం.పి.డి.ఓ లు, ఎం.ఆర్.ఓ లు ఈ ప్రక్రియ కోసం సమయాన్ని కేటాయించాలని సూచించారు. ఫ్రంట్ లైన్ వర్కర్ లుగా పనిచేసిన వారు క్షేమంగా ఉండాలని ప్రభుత్వం భావించి వారికి ప్రాదాన్యత ఇవ్వబడిందని వారందరూ దీనిని ఉపయోగించుకోవాలని, దీనిని పర్యవేక్షిస్తున్న అధికారులందరూ అత్యంత బాధ్యతగా తీసుకొని మూడు రోజులలోపు రిజిష్టర్ అయిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఈ సంధర్భంగా వ్యాక్సినేషన్ లో వెనుకబడిన సంస్థలు, ఆసుపత్రుల సిబ్బందిని కలెక్టర్ ప్రశ్నించారు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న మినహా అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అలారాని పక్షంలో వారిలో అవగాహన కల్పించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కొంత మంది వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి సిద్దంగా ఉన్న సెషన్స్ లో వారి పేరు రిజిష్టర్ కాకపోతే డివిజన్ లేదా జిల్లా వైధ్య అధికారుల దృష్టికి తీసుకొని రావాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా నిర్దేశించిన అధికారులందరూ ఉన్న 72 గంటల సమయాన్ని బాధ్యతా యుతంగా వెచ్చించి ఫలితాలను సాదించాలన్నారు.           జిల్లాలో ఇటీవల కరోనా కేసులు నమోధవున్నాయని కాంటాక్ట్ ట్రెసింగ్ లో గతంలో పాటించిన పద్దతుల లాగే వాలంటీర్ల నుంచి ఈ.ఓ.పి.ఆర్.డి ల వరకు ఖచ్చితమైన కాంటాక్ట్ లను గుర్తించి పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు సరైన చికిత్స అందించడంతో పాటు వారి కాంటాక్ట్ లను హోమ్ ఐసోలేషన్ లేదా క్వారంటైన్ లో ఉంచితే కేసులు పెరగవని కలెక్టర్ అన్నారు. గతంలో వందల సంఖ్యలు వచ్చిన సమయంలోనూ సైనికుల వలె పని చేశారని ప్రస్తుతం కొద్ది రోజుల పాటు కష్ట పడితే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించ గలమని జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారందరికి సూచించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ల ట్రెసింగ్ విషయంలో సరైన జాగ్రత్తలు వహించాలని, పాజిటివ్ కేసు వచ్చిన వారికి తీవ్రతను బట్టి ఆసుపత్రిలో చికిత్స లేదా హోమ్ ఐసోలేషన్ లో ఉంచి వారి ఆరోగ్యం పట్ల తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. దీనికి సంబందించి టెస్టుల సంఖ్యను పెంచాలని గతంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ లు పాజిటివ్ కేసు వచ్చిన వెంటనే స్పందించాలని వారి కాంటాక్ట్ లను గుర్తించి వారికి పరీక్షలు చేయించాలన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల లోనే చైన్ ను బ్రేక్ చేయాలని లేకుంటే మరింత పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. కాంటాక్ట్ లు ట్రెసింగ్ తూ తూ మంత్రంగా కాకుండా ఖచ్చి తత్వం పాటించాలని అవసరమైతే పోలీసుల సహాయం కూడా తీసుకోవాలని అన్నారు. మండల స్థాయిలో ఎం పి.డి లు, ఎం ఆర్ ఓ లు వైధ్యాదికారులతో సంప్రదించి ఎక్కడి నుంచి పాజిటివ్ కేసులు కానీ వారి కాంటాక్ట్ లు కానీ వస్తున్నాయో తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని కేసులు పెరగకుండా నివారించాలన్నారు.             ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) వి.వీరబ్రహ్మo, డి ఎం అండ్ హెచ్ ఓ డా.పెంచలయ్య, సి.ఈ.ఓ ప్రభాకర్ రెడ్డి, డి.పి.ఓ దశరధ రామి రెడ్డి, డి.సి.హెచ్.ఎస్ డా.సరళమ్మ, ఎన్.హెచ్.ఎం శ్రీనివాస్, డిప్యూటి డి ఎం అండ్ హెచ్ ఓ డా.రమా దేవి, చిత్తూరు కోవిడ్ అధికారి డా.మహేష్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Chittoor

2021-02-22 19:25:33

ఇప్పటివరకూ 21.15 కోట్ల కోవిడ్ పరీక్షలు చేశారు..

భారత దేశంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 21,15,51,746 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత 24 గంటలలో 6,20,216 పరీక్షలు జరిగాయన్న ఆరోగ్యశాఖ.. దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్థారణ పరీక్షల కోసం లాబ్ ల సంఖ్య పెరుగుతూ వస్తోందని పేర్కొంది. ప్రస్తుతమున్న 2393 లాబ్ లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 1220 ఉండగా ప్రైవేట్ రంగంలో 1173 ఉన్నాయి. దీంతో రోజువారీ పరీక్షల సామర్థ్యం బాగా పెరిగింది. భారత్ లో ప్రస్తుతం పాజిటివ్ శాతం 5.20% గా నమోదైంది. మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంతా ప్రభుత్వ సూచనల మేరకు కోవిడ్ వేక్సిన్ తీసుకోవాలని కూడా కేంద్రం కోరుతుంది. 

New Delhi

2021-02-22 17:13:05

కోవిడ్ వ్యాక్షిన్ పై అపోహలు వద్దు..

 కోవిడ్ టీకా వేసుకోవడం వల్ల మనల్ని మనం రక్షించు కోవడం ద్వారా ఇతరులను కూడా రక్షించిన వారమవుతామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్.వి.రమణకుమారి తెలిపారు. కోవిడ్ వ్యాక్షిన్ పై ఎలాంటి అపోహలు వద్దని ప్రభుత్వం అనుమతించిన మేరకే వ్యాక్షిన్ వేయడం జరుగుతుందన్నారు.  సోమవారం ఆమె కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాక్షినేషన్ కోసం ప్రభుత్వం ఎక్కువ ప్రమాదం కలిగిన గ్రూపులను గుర్తించిందని ఇందులో మొదటిగా ఆరోగ్య సిబ్బంది,  తదిపరి 50 సంవత్సరాలు పైబడి వ్యక్తులు, ఇతర ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఇవ్వడం జరుగుతుందన్నారు.  అనంతరం అవసరమున్న ప్రతీ ఒక్కరికి టీకా ఇవ్వడం జరుగుతుందన్నారు.  మొదటి గ్రూపులో వారికి ఇప్పటికే జిల్లాలో మొదటి డోసు క్రింద ఆరోగ్య, రెవెన్యూ, పంచాయితీరాజ్ తదితర శాఖల వారికి 70 శాతం వరకు టీకా వేయడం జరిగిందని తెలిపారు.    తొలి డోసు వేసిన 28 రోజులకు రెండవ డోసు వేయడం జరుగుతోందన్నారు. రెండు డోసులు వేయించుకున్నప్పుడు మాత్రమే టీకా పూర్తిగా వేయించుకున్నట్లు పరిగణించడం జరుగుతుందన్నారు. రెండవ డోసు పూర్తి అయిన రెండు వారాల తరువాత వ్యాధి నుంచి రక్షించగల స్థాయిలో శరీరంలో యాంటీబాడీలు అభివృద్ది చెందుతాయన్నారు.  కోవిడ్ సోకి కోలుకున్న వారు కూడా రెండు డోసుల టీకా వేయించుకోవడం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు.  టీకా వేయించుకోదలిచిన వారు ఏదైనా గుర్తింపు కార్డుతో తమ పేరును ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న తరువాత వారి మెబైల్ నెంబరుకు టీకా వేసే తేది, సమయం తెలియజేస్తారని తెలిపారు.  కోవిడ్ టీకా సురక్షితమైనదని ఏలాంటి దుష్ప్రభావాలు వుండవని స్వల్ప జ్వరం కొద్ది మందికి వారవచ్చని తెలిపారు.  ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందన్నారు. పత్రికా సమావేశంలో జిల్లా వ్యాధి నిరోధక అధికారి డా.ఎం.నారాయణ, డెమో తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-02-22 16:29:02

Dr. YSR కంటివెలుగు డేటాను ఆన్లైన్ చేయాలి..

డా.వైఎస్సార్ కంటివెలుగు పథకానికి సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఆన్ చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.  గత నవంబరు నెల నుండి జిల్లాలో 60 ఏళ్లు, ఆపై వయసు అవ్వా, తాతలకు  డా.వై.ఎస్.ఆర్.కంటి వెలుగు  పధకం క్రింద కంటి పరీక్షలు నిర్వహిస్తున్న ఆప్తాలమిక్ ఆఫీసర్లకు ఆన్ లైన్ ద్వారా వివరాలు నమోదు చేసేందుకు టాబ్ లెట్ పిసి లను  జిల్లా కలెక్టర్ సోమవారం ఉదయం తన ఛాంబరులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  జిల్లాకు మంజూరైన 41 టాబ్లెట్ పిసీల సహాయంతో మరింత మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆప్తాలమిక్ ఆఫీసర్లను ఈ సందర్భంగా కోరారు.   ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(అభివృద్ది) కీర్తి చేకూరి, డిఎంహెచ్ఓ డా.గౌరీశ్వరరావు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డా.మల్లికార్జున రాజు పాల్గొన్నారు. 

Kakinada

2021-02-22 14:26:12

ఆంధ్రప్రదేశ్ లోకి మరో కొత్త వైరస్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తామర అనే దరుద పుట్టే అంటువ్యాది కాదు కాదు కొత్తరకం వైరస్ పట్టి పీడిస్తోంది..ఒకరికి కాదు ఇద్దరికి కాదు..రోజుకి ఈ వ్యాధి గ్రామంలో ఐదుగురు నుంచి పది మందికి సోకుతుంది. ఇవేవో మేము చెబుతున్న మాటలు కాదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పీహెచ్సీల్లో నమోదవుతున్న రోగాల వివరాలు. అదేంటి తామర అనే దురద రోగం వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే మందులతో నయం అవుతుంది కదా..మరి ఎందుకు తగ్గడం లేదనే అనుమానం మీకు రావాలి..అలాంటి అనుమానం రాకపోతేనే ఇబ్బంది. నిజంగానే ఆంధ్రప్రదేశ రాష్ట్రాన్ని తామర అనే అంటువ్యాధి ప్రజల మాటగా కొత్తరకం వైరస్ ప్రజలను పట్టుకొని వేపుకు తింటుంది. చిన్న దురగా ఏర్పడి శరీరం మొత్తం పాకి నానా ఇబ్బందులకు గురిచేస్తుంది.  ఒక్క ఈ రోగానికి నెలకు ఒక్కో కుటుంబం సుమారు పదివేల రూపాయలు యాంటి బైటిక్ మాత్రలు, ఆయింట్ మెంట్లకు ఖర్చు చేస్తుందంటే పరిస్థితి ఇప్పటికే ఎంత దారుణంగా ఉందో గమనించాల్సి వుంది. ఈ వార్త చదువుతున్నంత సేపూ ఇదేదో కావాలని రాస్తున్నట్టు అనిపించినా.. ఈ వార్త చదివిన తరువాత బయట తెలిసిన వారిని అడిగితే ఈ తామర వైరస్ ప్రభావం చాపకింద నీరులా ఎలా వ్యాపిస్తుందో తెలుస్తుంది. ఈ స్కిన్ డిసీజ్ కి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే మందులు పనిచేయకపోవడంతో అందరూ ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదిస్తున్నారు. అక్కడ కేవలం నెలకు ఆ వైద్యులు రాసే మందులకు సుమారు ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదొక వైరస్ లా అందరికీ చేరిపోతుంది. ఎగ్జిమా జాతికి చెందిన ఈ వ్యాధికి హోమియోపతి, ఆయుర్వేదం, యునానీ, అలోపతి లో ఏ మందులూ పనిచేయడం లేదు. ఒకసారి ఎవరికైనా తామర వస్తే అది ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరాల తరబడి వారిని వెంటాడుతూనే వుంటుంది. దానిని తగ్గించుకోవడానికి లక్షాధికారుల దగ్గర నుంచి సాధారణ కూలీల వరకూ వేలు, లక్షల రూపాయల్లో మందులకే డబ్బు ఖర్చు చేస్తున్నారనే విషయం ఇపుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ వరకూ వెళ్లింది. వైద్యులకి, స్కిన్ స్పెషలిస్టు వైద్యులకు ఈ తామర అనేది సాధారణంగా చెమటతో వచ్చే వ్యాధని, దీనికి పది నుంచి 15 రోజులు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని తెలుసు. కానీ ఇపుడు వారినిక కూడా ఏదో అనుమానం పట్టిపీడిస్తుంది. చర్మ సంబంధిత ప్రత్యేక వైద్యులకు తామర రోగుల నుంచి వచ్చే ఆదాయం గత నాలుగేళ్లలో విపరీతంగా పెరిగిపోయింది. తామర వ్యాధి వచ్చిన రోగి ఏడాదిలో సుమారు పదిసార్లు స్కిన్ స్పెషలిస్టు దగ్గరకి వెళుతుండటంతో వారికి కూడా అనుమానం వస్తోంది. వచ్చిన తాముర వ్యాధి ఇన్ని మందులు, యాంటి బైటిక్ మాత్రలు, ఇంజక్షన్లు, ఆయింట్ మెంట్లు పూసినా ఎందుకు తగ్గలేదనే విషయమై పెద్ద చర్చే జరుగుతోంది. కరోనా వైరస్ కంటే నాలుగేళ్లు ముందు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించిన ఈ తామర వైరస్ నూటికి 30 మందిని పీడిస్తుందంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. పరువు పోతుందని చాలా మంది బయటకు చెప్పుకోలేక అన్ని రకాల వైద్య విధానాలను అనుసరిస్తున్నా పరిస్థితి మెరుగు పడటం లేదు. ఈ రోగానికి వైద్యం చేసే స్కిన్ స్పెషలిస్టు వైద్యులకు కూడా తామర పట్టిన రోగుల ద్వారా కూడా తామర వచ్చినేటికి బాధపడుతున్నారంటే పరిస్థితి ఎలా వుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ తామరకి ఏ మందులూ పనిచేయడం లేదు. పాఠశాలల్లో చదువుకునే పిల్లల నుంచి గర్భిణీ స్త్రీల వరకూ ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం చాలా తేలికగా తీసుకున్నప్పటికీ పెను ఉపద్రవం అయితన తరువాత గానీ తెలియదు ఈ తామర వైరస్ ఎవరో కావాలనే ఆంధ్రప్రదేశ్ పై ప్రయోగిస్తున్నారని, లేదంటే భారతీయ వైద్యవిధానంలో వున్న మందులకు సాధారణ తామర వ్యాధి తగ్గకపోవడం ఏమిటీ అనే ప్రశ్న ఇపుడు ప్రతీ ఒక్కరినీ తొలిచేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే మేలుకుంటే దీనిని నియంత్రించడానికి, దానికి సరపడే మందులు ప్రజలకు ప్రాధమిక వైద్య కేంద్రాల ద్వారా అందించడానికి వీలుపడుతుంది. లేదంటే కరోనా వైరస్ జనాల్ని మరోసారి భయపెట్టడం ఖాయంగానే కనిపిస్తుంది..

Tadepalle

2021-02-20 09:40:29

జివిఎంసీ అధికారులకు కరోనా వేక్సిన్..

జివిఎంసి కమిషనర్ డా.స్రిజన ఆదేశాల మేరకు మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది మరియు పారిశుధ్య కార్మీకులకు రెండవ దశలో వేక్సిన్ వేస్తున్నారు. శుక్రవారం ఈమేరకు నగరంలో గల 32 పట్టణ ఆరోగ్య కేంద్రాలులో ఈ వేక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైనది. ఇందులో భాగంగా ప్రాజెక్టు డైరెక్టర్ (యు.సి.డి.) వై, శ్రీనివాసరావు, పర్యవేక్షక ఇంజినీరు గణేష్ బాబు, స్టేటస్టికల్ ఆఫీసర్ రమణ మూర్తి తదితరులు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వద్ద కోవిడ్ వేక్సిన్  వేసుకున్నారు. వేక్సిన్ వేయించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ వేక్సిన్ ఏర్పాట్లు బాగున్నాయని , మిగిలిన జివిఎంసి అధికారులు, సిబ్బంది, కార్మికులు వేక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కోవిషీల్డ్, కోవేగ్జిన్ టీకాలు సురక్షితమైనవి అన్నారు. జివిఎంసి ప్రధాన కార్యాలయ సిబ్బంది, జోనల్ స్థాయి సిబ్బంది, హెచ్.ఓ.డి.లు, జోనల్ కమిషనర్ల సహాయంతో కోవిడ్ వేక్సిన్ కొరకు తమ పేర్లును నమోదు చేసుకొని వేక్సిన్ వేయించోకోవాలని జివిఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి  కార్పోరేషన్ అధికార్లును, సిబ్బందిని, కార్మికులను కోరారు.    

Visakhapatnam

2021-02-05 20:45:50

2021-02-04 09:41:05

సెక్స్ తో సహజసిద్ద అందం..ఆరోగ్యం..

మానవ జీవితంలో శృంగారం అనేది మానసిక సంతృప్తితో పాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందనే విషయం అనేక అధ్యయనాల్లో తేలింది. తాజాగా సెక్స్ చేయడం ద్వారా అందం కూడా పెరుగుతోందని, మొహంలో మంచి కాంతి వస్తుందని కొందరు మహిళలు గమనించిన విషయం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అంటే అతిశయోక్తి కాదు. దానికి కారణం కూడా లేకపోలేదు. సెక్స్ చేయడం ద్వారా సుఖవంతమైన నిద్ర పట్టి తెల్లవారే సరికి మొహంలో కాంతి పెరుగుతుందని మహిళలు, సెక్స్ చేయడం వలన రోజంతా ఉత్సాహంగా వుంటుందని పురుషులు ఫీలవుతున్నారట. ఫిజికల్‌గా, మెంటల్ గా ఫిట్‌గా ఉండేలా చేస్తోందనీ, వ్యాధి నిరోధక శక్తిని సైతం పెంచుతుందని పలు రకాల వ్యాధులు రాకుండా అడ్డుకోగలదని వైద్యులే సూచిస్తాను. అంతెందుకు క్రీడాకారులు సైతం ఆటకు వెళ్లడానికి గంట ముందు సెక్స్ లో పాల్గొనడం ద్వారా ప్రక్రుతి సిద్ధంగా వచ్చే ఉత్సాహాన్ని పెంపొందించుకుంటారని కూడా చెబుతారు. ఎవరైతే ఆరోగ్యకరమైన శృంగారాన్ని కొనసాగిస్తారో వారి ఆరోగ్యం చాలా బాగుంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే సెక్స్‌కు, ఆరోగ్యానికి విడదీయరాని అనుబంధం ఉంటుందనే చెప్పాలి. అయితే చాలా మందిలో సెక్స్ విషయంలో అనేక అపోహలు, అనుమానాలు వున్నాయి. సెక్స్ అంటే వారికి ఒకరోజు, లేదంటే 15 రోజులకు ఒకరోజు చేయాలని బ్రమపడతారు. అలా కాకుండా ప్రతినిత్యం సెక్స్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మనచేతులతోనే చక్కగా ఉంచుకోవచ్చునని నిత్యం సెక్స్ పాల్గొనే వారిని చూస్తే తెలుస్తుంది. తాజా పరిశోధనల్లో వయస్సు ప్రకారం ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలో చెప్తున్నారు పరిశోధకులు. కిన్సే ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సెక్స్, రీ ప్రొడక్షన్ అండ్ జెండర్ సంస్థకు చెందిన నిపుణులు ఈ అధ్యయనం చేయడం, దానికి సంబంధించిన కొన్ని విషయాలను భహిర్గతం చేయడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. మానవ జీవితంలో శృంగారానికి, వయసుకు మధ్య ఉండే సంబంధం, ఆరోగ్యంపై సెక్స్‌ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై వారు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ద్వారా ఏయే వయసుగల వారు ఎన్నిసార్లు సెక్స్‌ చేస్తే ఆరోగ్యంగా ఉంటారో గుర్తించారు. వాటి ఫలితాలను చెప్పడం ద్వారా ఇపుడు చాలా మంది సెక్స్ విషయంలో స్పీడ్ గా వుంటున్నారు. మిలీనియల్స్ (2000 సంవత్సరం తరువాత పుట్టినవారు) ఏజ్ గ్రూప్‌లో ఉన్నవారు, యుక్తవయస్సులోకి ప్రవేశించిన వ్యక్తులు ఎక్కువసార్లు సెక్స్ చేస్తున్నారని వారి అధ్యయనంలో తేలిందట. 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు సంవత్సరానికి 112 సార్లు.. అంటే సగటున వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొంటున్నారని వారి పరిశోధనల్లో తేలింది. అంతేకాదు సెక్స్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్‌ చెప్పడం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. సెక్స్‌కు దూరంగా ఉండేవారితో పోలిస్తే.. వారానికి కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనే విద్యార్థుల్లో ఎక్కువ స్థాయిలో యాంటీబాడీస్ ఉన్నట్టు పెన్సిల్వేనియాలోని విల్కేస్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. రక్తపోటును తగ్గించడం, ఒత్తిడి, ఆందోళనను నివారించడం, ఆరోగ్యకరమైన నిద్రకు సహాయపడటం వంటి అనేక ఉపయోగాలు శృంగారం వల్ల కలుగుతున్నాయని అధ్యయనంలో పాల్గొన్నవారు చెబుతున్నారట. ఇకపోతే ఏవయస్సు వారు వారానికి ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొంటే కూడా మంచిదో ఈ అధ్యయనం ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసింది. 30 నుంచి 39 సంవత్సరాల వయసు ఉండేవారు సంవత్సరానికి కనీసం 86 సార్లు సెక్స్ చేయాలట. 40 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సు ఉండేవారు సంవత్సరానికి కనీసం 69 సార్లు సెక్స్ చేయాలట. వయస్సు పెరుగుతున్నా కొద్దీ శృంగారంపై ఆసక్తి తగ్గే అవకాశం ఉందికాబట్టి... సెక్స్ చేసే సామర్ధ్యం కూడా తగ్గుతుందని ఈ అధ్యయనంలో తేలిందట. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేస్తూ పొట్ట పెరగకుండా చేసుకున్న వారిలో సెక్స్ ను ఎంజాయ్ చేయడంతోపాటు, ఆరోగ్యంగా ఉండి మందుకంటే మంచి ఫలితంతో ఒంటి నొప్పులు కూడా తగ్గాయనే విషయం కూడా కొంతమంది యువత చెబుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కుటుంబ బాధ్యతలు, బిజీ వర్క్‌ షెడ్యూల్ వంటివి కూడా శృంగారంపై ఆసక్తి తగ్గేందుకు కారణాలని పరిశోధకులు చెబుతున్నా. వేల రూపాయల ఖర్చు చేసి సెక్స్ సామర్థ్యం పెంచుకునేకంటే బరువును తగ్గించుకొని, కొన్ని నియమాలు, ఆరోగ్య సూత్రాలు తెలుసుకోవడం ద్వారా సెక్స్ లో ఆనందంతోపాటు, ఆరోగ్యం, అందం పెంపొందించుకోవచ్చునని ప్రతీ ఒక్కరూ గమనించాలి. 

Visakhapatnam

2021-01-17 21:32:22