1 ENS Live Breaking News

శృంగారంతో పొట్ట బెల్లీఫ్యాట్ మటుమాయం..

మన శరీరంలో పొట్ట చుట్టూ పేరుకుపోతున్న బెల్లీ ఫ్యాట్(కొవ్వు)ను కరిగించుకోవాలంటే ప్రతినిత్యం జిమ్ లలో గంటల తరబడి వర్కవుట్లు చేయడటం, పచ్చి కూరగాయల రసం తాగటం, ఏవేవో వెయిట్ లాస్ ప్రాడెక్టులు వాడే కంటే..నిత్యం సహధర్మచారిణితో శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చునని చెబుతున్నారు నిపుణులు. ఆ విధంగా చేయడం ద్వారా ఎన్నో శారీరక రుగ్మతలు కూడా నయం చేసుకోవచ్చునని సూచిస్తున్నారు. భార్య, భర్తలు నిత్యం శృంగారంలో పాల్గొంటే పురుషుల్లో అయితే శృంగారం వలన మహిళల్లో 216 కిలో కేలరీలు తగ్గితే... మగవారిలో 276 కిలో కేలరీలు తగ్గుతారని తాజా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. రోజుకి ఈ స్థాయిలో కిలో కేలరీల్లో బరువు తగ్గడం ద్వారా శరీరంలోని అదనంగా పేరుకుపోయిన బెల్లీ ఫ్యాట్ మొత్తం కరిగించేసుకోవచ్చునని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఇది రోజూ సాధ్యపడుతుందా అని ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. నిపుణులు చెప్పినట్టుగా నిత్యం భాగస్వామితో శృంగారం చేయడం ద్వారా జరిగే ప్రయోజనాలను తెలుసుకోవడం ద్వారా మంచి స్వాంతన కూడా  పొంవచ్చుననేది ఇపుడు ట్రెండింగ్ లోవున్న విషయం..

నిత్యం శృంగారం చేస్తే చక్కటి నిద్ర..
భార్యభర్త జీవనంలో ప్రక్రుతి ప్రసాదించిన వరం శృంగారం.. అలాంటి ప్రక్రుతి ప్రసాదాన్ని నిత్యం ఆశ్వాదించడం ద్వారా శారీక అలసటతో చక్కటి నిద్రను కూడా సొంతం చేసుకోవచ్చునని అంటున్నారు వైద్య నిపుణులు. జిమ్ లకు వెళ్లి చేసే వర్కువట్ల కంటే శ్రుంగారం ద్వారా కలిగే అలసటతో నిద్ర చాలా త్వరగా పట్టడంతోపాటు, గాఢంగా కూడా ఉంటుందని ఇప్పటికే చాలా అధ్యయనాలు రుజువు చేశాయి. శృంగారం వలన శరీరంలో కామనాడులు ఉత్తేజితమై, మెదడకు మంచి సంకేతాలు పంపడం ద్వారా రక్త ప్రసరణ చక్కగా జరిగి నిద్రకు త్వరగా ఉపక్రమిస్తారని చెబుతున్నారు. అయితే చాలా మందిలో శృంగార క్రీడను ఆశ్వాదించలేని, దానిలో మాదుర్యం పొందలేని వారు ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని కూడా ఇదే అద్యయనాలు ప్రకటిస్తున్నాయి. శృంగార క్రీడలో నిత్యం పాల్గొనడం ద్వారా అంటే మండలం పాటు క్రమం తప్పకుండా పాల్గొనడ ద్వారా ఆ క్రడీలో సమయాన్ని కూడా పెంచుకునే అవకాశాలు వాటంతట అవే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దానికోసం ఎలాంటి మందులు, మాత్రలు వేసుకు అవసరం లేకుండానే శృంగారంలోని మాధుర్యాన్ని ఆశ్వాదించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఎన్ని అలసటలున్నా నిత్యం రాత్రి సమయంలో శృంగారం చేసుకోవడం ద్వారా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడంతోపాటు చక్కటి నిద్రను పొందవచ్చునని.. ఆ నిద్రలో చాలా రుగ్మతలు వైదొలగిపోతాయని చెబుతున్నారు.

నెలకు 3 నుంచి 5 కేజీలు ఫ్యాట్ బర్న్..
శృంగార క్రీడల ద్వారా ఆరోగ్యంగా 3 నుంచి 5 కేజీల వరకూ శరీరంలోని బెల్లీఫ్యాట్ ను కరించుకోవచ్చునని చెబుతున్నారు ఫిట్ ట్రైనర్లు కూడా. బరువు ఎక్కువగా ఉండి శృంగారక్రీడలో పూర్తిస్థాయిలో పాల్గొన లేనివారు ముందుగా ఉదయం సమయంలో కాస్త ఎక్సర్ సైజులు చేయడం ద్వారా రాత్రి సమయంలో చేసే సెక్సర్ సైజ్ లతో మరింత ఫిట్ నెట్ సొంతం చేసుకోవచ్చుననేది నేటి ఫిట్ నెస్ మంత్రాగా వైరల్ అవుతోంది. వాస్తవానికి మనస్పూర్తిగా శృంగారంలో ఎంజాయ్ చేసేవారిలో ఆరోగ్యకరంగా బరువుతు తగ్గుతున్నారనేది సాంకేతికంగా రుజువైంది. దీనిలో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ జంటా ఇపుడు శరీరంలోని అదనపు కొవ్వుని కరిగించుకోవడానికి శృంగార మంత్రను అలవాటు చేసుకుంటున్నారు. నిత్యం శృంగారంలో పాల్గొనడం ద్వారా రోజంతా చాలా చక్కగా ఉత్సాహంగా కూడా ఉండొచ్చుననేది సర్వత్రా వినిపిస్తున్నమాట. ఒక్కముక్కలో చెప్పాలంటో కోవిడ్ పుణ్యమాని చాలా మంది వర్క్ ఫ్రం హోం డ్యూటీల్లో పాల్గొనే చాలా మంది ఉద్యోగులు అటు ఆఫీసు ఉద్యోగం, ఇటు ఫ్యామిలీ శృంగార ప్లానింగ్ కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారనే విషయం నెట్టింట నేడు తెగ వైరల్ అవుతుంది. 

శృంగారంతో చక్కటి అందం ఆనందం..
శృంగారం వలన ఒక్క బరువు తగ్గడమే కాదు. సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చునని చెబుతున్నారు నిపుణులు. నిత్యం శృంగారంలో పాల్గొనడం ద్వారా మహిళల్లోనూ, పురుషుల్లోనూ అందం రెట్టింపు అవుతుందనే విషయంలో కూడా చాలా అధ్యయనాలు మంచి ఫలితాలను ఇచ్చాయట. శృంగారం చేసి అలసిన శరీరానికి నిద్రబాగా పట్టి, ఆ నిద్రలో రక్తప్రసరణ కూడా చక్కగా జరిగి దాని యొక్క ప్రభావం మొహంలో కనిపిస్తుందని ఇటీవల కాలిఫోర్నియాలో 100 జంటలపై జరిపిన అధ్యయనంలో తేలిందనే విషయంలో నేడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. శ్రుంగారం వలన త్వరగా పిల్లలు పుట్టడమే కాకుండా శరీరంలోని నాడీ మండలం చక్కగా పనిచేస్తుంది. తద్వారా మొహానికి కూడా రక్త ప్రసరణ జరిగి మొహం కూడా చక్కటి నిగారింపుగా మారుతుంది. అంటే శృంగారం వలన మనసుకి ఆనందంతోపాటు, బెల్లీ ఫ్యాట్ బర్న్ అవడంతోపాటు చక్కటి అందాన్ని కూడా సొంతం చేసుకోవచ్చునన్న మాట. ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ అయి భార్య, భర్తలు ఎప్పుడు అవకాశం దొరికితే అపుడు శృంగారంలో మాధుర్యాన్ని చవిచూడటంతోపాటు చక్కటి రూపాన్ని కూడా సొంతం చేసుకుంటున్నారు. ప్రాచీన ఆయుర్వేద వైద్యవిధానమే ఈ శ్రుంగార మంత్ర అనే విషయం కూడా నేడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం రోజూ ఎంజాయ్ చేయండి..ఆరోగ్యకరంగా బరువును తగ్గించుకోండి. అందంగా.. ఆనందంగా జీవించడానికి పునాధులు వేసుకోండి..!

Visakhapatnam

2022-08-18 01:43:55

ఆ పాలు తాగితే రోజుకో మంచం విరగ్గొడతారు

నువ్వెంత ఎంతటి రసికుడవో తెలిసెరా ఈ పాట వింటే చాలు ఎలాంటి వారికైనా చిలిపి కోరికలు మదిలో తొలిచేస్తుంటాయి.. కానీ ఆ పాటకు, అందులోని మాధుర్యాన్ని కొందరు మాత్రమే ఆశ్వాదిస్తారు. చాలా మంది ఆ.. విషయంలో న్యాయం చేయలేక చతికెల బడిపోతున్నారు. దైనందిన జీవితంలో చాలా మంది శారీక, మానసిక సుఖానికి దూరమ వుతున్నారు. క్షణిక సుఖం కోసం వయాగ్రాలాంటి ఇంగ్లీషు మందులను వినియోగిస్తూ.. కొత్త జబ్బులు తెచ్చుకుంటున్నారు తప్పితే.. శరీరంలో సెక్స్ పవర్ ను పెంచే ఆయుర్వేద వైద్యవిధానాలను, వాటియొక్క ఆవశ్యకతను మరిచిపోతున్నారు. వయాగ్రాను తలదన్నే మందులు మన చుట్టూనే ఉన్నాయనే విషయం మీలో ఎంతమందికి తెలుసు..? అలా తెలిసిన వారు ఎవరైనా దానిని వినియోగించి ఫలితాలు పొందుతున్నారా అంటే లేదనే చెప్పాలి. ఒక్కసారి  ఈ ఆయుర్వేద పద్దతిలో చెప్పిన విధంగా ఆచరిస్తే మీరు రోజుకో మంచం విరగ్గొట్టడం ఖాయం. ఏంటి నమ్మకం లేదా..అలా అనుకుంటే మీకు స్వతహాగా వచ్చే పవర్ బ్యాంక్ లాంటి పవర్ ను మీరు దూరం చేసుకున్నట్టే. అలాంటి దివ్యమైన ఇండియన్ వయాగ్రా కోసమే ఈ ఆర్టికల్..

మునగపువ్వు.. ఆవుపాలు కింగ్ ఆఫ్ వయాగ్రా
వయాగ్రాను మించిన సెక్స్ సామర్ధ్యాన్ని పెంచే శక్తి మునగ పువ్వులో వుంటుంది. అసలు మునగ పువ్వే కాదు..ఆకులు, బెరడు, మునక్కాయాలు అంతా ఆ చెట్టు మొత్తం ఒక ఔషద గని. ఇక మనకు కావాల్సిన సెక్స్ పొటన్షియల్ పెంచే విషయానకి వచ్చేద్దాం. చాలా మంది పురుషులు సెక్స్ విషయంలో తమ జీవిత భాగస్వామితో పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అలాంటి సమస్యనుంచి మునగపువ్వుని వినియోగించి ఎంతో కాలంగా తీరని సమస్యగా వున్న ఆ.. ఇబ్బంది నుంచి బయటపడొచ్చు. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే 45 రోజుల పాటు ఆవు పాలతో మునగ పువ్వుని మరిగించి రాత్రి పడుకునే ముందు సేవించాలి. ఆ పాలలో పంచదారకి బదులు తేనెగానీ, కండచక్కెర.. అంటే పటిక బెల్లం గానీ వినియోగించాలి. మునగపువ్వుకి శరీరంలో వేడిని రాజేసే అపారమైన  శక్తి వుంటుంది. దానిని కలిపిన ఆవుపాలు తీసుకోవడం ద్వారా మీ శరీరంలో శక్తి పుంజుకొని..ఎప్పుడూ చేసే రతి క్రీడ కంటే కాస్త సమయం అధికంగా చేస్తారు. అది కూడా అలుపు సొలుపూ లేకుండా. ఏంటి మునగ పువ్వుకి అంత శక్తి వుందా అని మాత్రం అనుకోవద్దు. మునగపువ్వు పూసే క్రమంలో మనకు తెలియకుడానే నేలపాలైపోతుంది. అలా మునగ పువ్వు కింద పడిపోకుండా చెట్టు చెట్టూ ఒక వాలలాంటి దానిని కడితే చెట్టు నుంచి రాలేపువ్వు కింద పడకుండా ఆ వలలో పడుతుంది. దానిని జాగ్రత్తగా ఫ్రిజ్ లో పెట్టుకొని..ప్రతీ రోజూ రాత్రి పడుకునే ముందు..మీకు అవకాశం వుంటే టిఫెన్ చేసిన తరువాత ఉదయం కూడా తాగితే మీలోకి కోర్కెలు గుర్రాలై పరుగెడతాయి. మీ శరీరంలోని కామనాడులు ఉత్తేజానికి గురై..నాడీమండలంలో చలనం ఉవ్వెత్తున ఎగసి పడుతుంది. ఆ స్పీడులో మీరు చేసే శారీరక యుద్దంతో మంచాలు మాత్రం విరగడం ఖాయం.

45 రోజులు దాటితే మిమ్మల్ని ఆపడం చాలా కష్టం
మునగపువ్వుతో మరిగించిన..ఆవుపాలను ఆపకుండా 45 రోజుల పాటు తీసుకుంటే మిమ్మల్ని ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదు. గతంలో మీతో రతి క్రీడలో విసుగు చెందిన మీ భాగస్వామి సైతం మీ దంపుడుకో నమస్కారం అనాల్సిందే. అదే సమయంలో స్టోరీ మొదట్లో రాసినట్టుగా నువ్వెంతటి రసికుడవో తెలిసెరా అంటూ అటు నుంచి పాట వస్తుందంటే అతిశయోక్తి కాదు. అలా వస్తూ వస్తూనే ప్రతీ రోజూ జరిగే రతి క్రీడకు మీకు అత్యంత సొగసైన స్వాగతం లభిస్తుందంటే నమ్మండి. ఈ ఆయుర్వేద వైద్య విధానం వలన మీరు చాలా చక్కగా రతిక్రీడలో విజయం సాధించడంమే కాకుండా ఆ విజయంలో మీ జీవిత భాగస్వామిని కూడా భాగం చేస్తారు. తద్వారా దాంపత్య జీవితంలో శారీరక సుఖం కోల్పోతున్న సహదర్మాచారిణికి న్యాయం చేయడానికి వీలుపడుతుంది. అంతే తప్పా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే వయాగ్రా లాంటి ఇంగ్లీషు మందులు వాడి కొత్త కొత్త రోగాలను కొని తెచ్చుకోవద్దనేది ఆయుర్వేద నిపుణులు చెప్పే మాట.

ప్రతీరోజూ సుఖ నిద్రకు సోపానం..
అనునిత్యం ఆవుపాలతో మునగపువ్వు కలిపి తీసుకోవడం అలవాటు చేసుకున్నవారికి సెక్స్ సామర్ధ్యం పెరిగి ఎప్పుడూ పాల్గొనే క్రీడలో అత్యధిక సమయం ఆటాడం ద్వారా శరీరం పూర్తిగా అలసిపోతుంది. వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు. అలా మీకు ప్రతీరోజూ కావాల్సిన సుఖంతోపాటు..అంతకంటే ముఖ్యమైన నిద్ర సమస్య కూడా తీరిపోతుంది. అంతేనా జిమ్ కి వెళ్లి చేసే ఎక్సర్ సైజ్ కంటే..ఇంట్లో కష్టపడి చేసే సెక్సర్ సైజ్ వలన ఎన్నో ఉపయోగాలను కూడా పొందవచ్చు. ఒంటిలో నొప్పులు మాయం చేసుకోవడం దగ్గర నుంచి మెదడుని ఎల్లప్పుడూ చురుకుగా ఉంచడంలో మునగపువ్వు పాలు కీలక పాత్ర వహిస్తాయి. అంతేకాదు పిల్లలు పుట్టే సమస్యలు ఉన్న వారికి కూడా ఈ పాలు ఒక వరమనే చెప్పాలి. స్పెర్మ్ కౌంట్ బాగా పెరిగి గర్బంలో బలమైన పిండం తయారవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. పూర్వం రోజుల్లో పెళ్లైన జంటలకు మొదటి మూడు రోజులు ఈ మునగపువ్వు మరగబెట్టిన ఆవుపాలనే ఇచ్చావారట. అందుకే ఇప్పటికీ పల్లెల్లో కొందరు గడసరి అత్తలు అళ్లుల్లను మునక్కాడలా నిటారుగా ఎలా ఉన్నాడో చూడండి అంటూ ఆటపట్టిస్తుంటారు. ఏదైనా ఆయుర్వేదం ద్వారా వచ్చే ఆరోగ్యం ఇంగ్లీషు మందులు ద్వారా ఎప్పుడూ రాదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి.. ఇంకెందుకు ఆలస్యం మీకూ మంచం విరగ్గొట్టాలని ఉందా..అయితే రెడీ అవ్వండి మరి మునగపువ్వు ఆవు పాలు తాగడానికి..!

Visakhapatnam

2022-08-06 11:45:11

బాన పొట్టని కరిగించి బరువు తగ్గించే మంత్రం

ఎంతటి బాన పొట్టనైనా ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాచుర్యం పొందిన ఆయుర్వేద వైద్య విధానం, ఇంట్లో దొరికే దినుసలతోనే ఇట్టే కరిగించుకోవచ్చు. ఏంటి నమ్మకం లేదా..ఓహో మీరు నెలకి పది నుంచి 20వేలు పెట్టి కొన్న ప్రోడక్ట్స్ వాడితే తప్పా మీకు నమ్మకం రాదన్నమాట. అలా అనుకుంటే మీరు ఆ ఖరీదైన ఉత్పత్తులు వాడినపుడు మాత్రమే బరువు తగ్గుతారు. మానేస్తే యధావిధిగా పెరిగిపోతారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిందే. అదే ఆయుర్వేద జీవన విధానంలో వాడే మూలికలు వినియోగించడం ద్వారా ఆరోగ్యంగా మీ బరువును తగ్గించుకోవడంతోపాటు.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన శరీర బరువుని మన అదుపులోనే ఉంచుకోవచ్చు. అందులోనూ ఈ వెయిట్ లాస్ ఫార్ములా వినియోగించడానికి అన్ని వస్తువులు మన ఇంట్లో దొరికేవే అంటే మీకూ ఆశ్చర్యం కలుగుతుంది. అలా ఇంట్లోనే దొరికే ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా మీ శరీర బరువుని, అపారంగా పెరిగిపోయిన బాన పొట్టను ఇట్టే తగ్గించుకోండి. ఆ ఆయుర్వేద ఉత్పత్తులు ఏంటి..వాడే విధానం తెలుసుకోండి. ఆరోగ్య కరంగా మీ శరీర బరువుని తగ్గించుకోండి. ఆ సమాచారాన్ని ఈఎన్ఎస్ లైవ్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వేధిస్తున్న సమస్య అధిక బరువు. అమ్మాయిలు, అబ్బాయిలే కాదు పెద్దవారిని సైతం ఈ అధిక బరువు చాలా ఇబ్బందులు, అనారోగ్యాల పాలు చేస్తోంది. దీనితో బరువు మొత్తం తగ్గిపోయి స్లిమ్, ట్రిమ్ గా ఉండటానికి ప్రతీ ఒక్కరూ నానా రకాల ఉత్పత్తులు వినియోగించాల్సి వస్తుంది. ఆ ఉత్పత్తులు అత్యంత ఖరీదైనవి కావడంతో వాటిని అన్ని వర్గాల ప్రజలు వినియోగించే పరిస్థితి కనిపించడం లేదు.  చాలా మంది అధిక బరువు, బాన పొట్ట, పొట్టచుట్టూ కొవ్వు పేరుకు పోతున్నాయి. దానికి ఇంట్లోనే ఎక్కువ సేపు ఉండటం, శరీరానికి వ్యాయం లేకపోవడం, కార్యాలయాలల్లోనూ కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం వలన వచ్చిన పొట్ట తరగడం లేదు సరికదా.. దాని బరువు రోజు రోజుకూ పెరిగిపోతూ వస్తున్నది. దీనితో చాలా మంది అధిక బరువుతో ఎక్కడాలేని కొత్తరోగాలన్నీ కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

బరువు తగ్గేందుకు వినియోగించే ఔషదాలు
మన శరీరంలో అత్యం ఎక్కువగా పేరుకు పోయిన కొవ్వు వలన భారీ స్తూలకాయంతో పెరుగుతున్న బరువుని మన ఇంట్లోనే దొరికే ఆయుర్వేద ఉత్పత్తులతో చాలా చక్కగా తగ్గించుకోవచ్చు. దానికి కావాల్సిన ముఖ్యమైన ఆరింటికోసం ఇపుడు తెలుసుకుందాం. మొదటిది సొంటి ఇది కొవ్వుని కరిగించడంతో రారాజుగా పనిచేస్తుంది. రెండవది మిరియాలు..దీనికి కూడా పొట్టలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపే గుణం వుంది. మూడవది సైంధవ లవణం..ఇది కొవ్వుని చమట రూపంలో బయటకు పంపే ప్రక్రియను చాలా చక్కగా చేస్తుంది. నాల్గవది జీలకర్ర.. దీనిని మనం ఎక్కువ కూరల్లో వినియోగిస్తుంటాం. దీనికి కూడా బరువుని తగ్గించే గుణాలు అపారంగా ఉంటాయి. ఇక ఐదవది పిప్పళ్లు..పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని ముక్కలు ముక్కలుగా కోసేయడంలో దీనికి ఇదే సాటి. ఆఖరిగా ఆవు పాలతో చేసిన మజ్జిగ. ఈ మజ్జిగలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి. వీటన్నింటిని సమబాగాలు తీసుకొని బాగా మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఆపై ఒక పావు చెంచా పొడిని ప్రతీ రోజూ దంతదావణం పూర్తయిన తరువాత ఏమీ తినకుండా పరగడుపున ఒక గ్లాసు, సాయంత్రం భోజనానికి ముందు మరో గ్లాసు మజ్జిగలో వేసుకొని త్రాగాలి. ఆ తరువాత కనీసం రెండు గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. ఆ పొడి కలిపిన మజ్జిగ తాగిన తరువాత వాకింగ్ గానీ, వ్యాయామం కానీ చేయడం ద్వారా ఫలితం చాలా త్వరగా వస్తుందని మాత్రం మరిచిపోవద్దు. ఆ ఫలితాన్ని మీరు పొడి వాడిన తొలిరోజు బరువు తూకం వేసుకొని చూసుకోవచ్చు. ఆ తరువాత సరిగ్గా 15 రోజులకు మరోసారి తూకం వేసుకుంటే తేడా మీరే గమనించవచ్చు.

ఈ పొడి తీసుకునే సమయంలో తినకూడని పదార్ధాలివే..
త్వరగా బరువు తగ్గాలనుకునే వారు ఈ పొడి తీసుకునే రోజుల్లో అస్సలు తీపి, పంచాదారతో చేసిన పదార్ధాలకు దూరంగా ఉండాలి.. దూరంగా ఉండటం ఏంటీ మానేయాలి అదైతే ఖచ్చితంగా జరగాలి. అంతేకాకుండా మటన్, నూడిల్స్, బర్గర్, పీజ్జా లాంటి జంక్ ఫుడ్  కి చాలా దూరంగా ఉండాలి. మళ్లీ మటన్ బోన్స్ సూప్ త్రాగవచ్చు ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది. చికెన్, ఫిష్ సమ్రుద్దిగా తినవచ్చు. వీటిలో మంచి ప్రొటీన్ ఉండటం వలన మర శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ సమస్య రాకుండా వుంటుంది. ప్రొటీన్ సమస్య రాకుండా చేస్తుంది. రాత్రి సమయంలో అవకాశం వున్న వారు జొన్న రొట్టెలను తీసుకుంటే ఆకలి మందగిస్తుంది. అంతేకాకుండా వీలైనంత వరకూ మజ్జిగను పలుచగా చేసుకొని త్రాడానికి ప్రయత్నించాలి. ఉదయం లేచిన వెంటనే లీటరు గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. సమయం దొరికినపుడల్లా వేడినీరు తీసుకోవడం, ఉదయం, సాయత్రం స్నానం చేసే సమయంలో వేడినీటితో స్నానం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పైన పేర్కొన్నట్టుగా చెప్పవన్నీ పాటిస్తే మీకు ఫలితం 15 రోజులకే ప్రారంభం అవుతుంది. సరిగ్గా మూడు నెలల్లో మీరు అనుకున్న బరువు తగ్గిపోవడానికి పూర్తిస్థాయిలో ఆస్కారం వుంటుంది. పురాతన కాలం నుంచి వస్తున్న ఆయుర్వేద వైద్య విధానాలు మానవుని శరీరంలో క్రమం తప్పకండా 41 రోజులు అంటే మండల పాటు వినియోగిస్తే ఫలితాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వేల రూపాయలు ఖర్చు చేసి..అనారోగ్యాలు తెచ్చే వెయిట్ లాస్ ప్రొడక్ట్స్  కంటే ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ పద్దతిని పాటించి చాలా చక్కగా బరువు తగ్గవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వేలకు వేలు ఖర్చు చేసే కంటే అతి తక్కువ ఖర్చుతో శాస్త్రీయ పద్దతితో మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వుని బయటకు పంపి ఆరోగ్యంగా ఉండండి.. చక్కగా బరువు తగ్గండి.. ఆరోగ్యమస్తు..!

Visakhapatnam

2022-08-01 06:51:46

సరసంగా ఉంటే నెలకు 7కేజీలు బరువు తగ్గిపోతారు.. అదెలాగో తెలిస్తే షాక్ అవుతారు..

మీకు సరసం వచ్చా.. ఆపై నవ్వడం..నవ్వించడం వచ్చా.. అయితే మీరు ఎలాంటి మందులు వాడకుండా..జిమ్ లకు వెళ్లి వర్కవుట్లు చేయకుండానే ఆరోగ్యంగా నెలకు ఏడు కేజీలు బరువు తగ్గిపోవచ్చు. ఏంటి ఇదేదో  వెయిట్ లాస్ ప్రోడక్ట్ కోసం చేస్తున్న ప్రచారం అనుకుంటున్నారా.. అనుకున్నా..అలాంటివి నమ్మినా మరో మూడు కేజీలు బరువు పెరిగిపోతారు తప్పితే..మీలో ఎలాంటి బరువు తగ్గే ప్రయోజనాలు కనిపించవు. కానీ ఈ స్టోరీ పూర్తిగా చదివిన తరువాత మీరు బరువు కొలుచుకొని మేము చెప్పిన ప్రక్రియ మొదలు పెట్టండి.. ఎందుకు బరువు తగ్గరో చూద్దాం. ఒక్క బరువు మాత్రమే కాదు. అంతకు మించిన ప్రయోజనాలు ఒక్క సరసంగా.. అదీ మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడపడం ద్వారా సరదాగా ఉండటం వలన జరుగుతుందా అని మీరే ముక్కున వేలేసుకుంటారు. పైగా మీకు వచ్చిన రిజల్ట్ మరో పది మందికి చెప్పి భూమిపై బరువు పెరిగిన వారి భారాన్ని  తగ్గించిన వారవుతారు. అంతేనా..నికార్శైన సరసుడవు నువ్వే అనే ఎంతో విలువైన బిరుదుని కూడా సొంతం చేసుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా బరువు తగ్గే హెల్తీ వెయిట్ లాస్ విత్ ఎంజాయ్ ది సెక్స్  ప్లానింగ్ సరసంతో ఎలా మొదలు పెట్టాలో చూద్దాం..

రోజుకి 45 నిమిషాలపాటు సెక్స్ చేయండి..
పురాణాలు..ఆయుర్వేదం..నేటి ఆధునిక పరిశోధనలు జీవిత భాగస్వామితో 45 నిమిషాల(అది రెండు సార్లు కావొచ్చు మూడు సార్లు కావచ్చు) పాటు సరసంగా..నవ్విస్తూ..కవ్విస్తూ.. సెక్స్ చేయడం ద్వారా రోజుకి 360 కేలరీలు బరువు తగ్గవచ్చునని చెబుతున్నాయి. శరీరంలోని కొవ్వు చమట రూపంలో కరిగిపోతుంది. నిజంగా ఇది నిజం. కావాలంటే మీరు తొలిరోజు ఉదయం ఎంత బరువు ఉన్నారో తూకం వేసుకొని 45 నిమిషాలు ఆగకుండా సరసమాడి ఆపై బరువు కొలుచుకోండి ఖచ్చితంగా మేము సూచించిన బరువు తగ్గిపోతారు. అయితే ఇలా ఎక్కువ సేపు సెక్స్ చేయాలంటే శరీరంలోని నరాలు బలంగా..ద్రుడంగా ఉండాలి. దానికోసం రోజు ఐదు బాదం పిక్కలు రాత్రి నానబెట్టి ఉదయం తినాలి. ఆ బాదం పిక్కల సత్తువ రాత్రి జీవిత భాగస్వామితో సెక్స్ చేసే సమయానికి నరాలను ఉత్తేజ పరుస్తుంది. శరీరంలోని బరువు తగ్గడానికి ఎంతో సహాయ పడుతుంది. తద్వారా అనుకున్న సమయం కంటే మరో పదినిమిషాలు ఎక్కువగా సరసమాడటానికి వీలుపడుతుంది. రాత్రి సమయంలో పడుకునే ముందు పాలుత్రాగాలి. వాటి వలన ఎముకల బలం తగ్గకుండా ఉంటుంది. తద్వారా శరీరం పట్టుకోల్పోకుండా ఉంటానికి ఆస్కారం వుంటుంది. రాత్రి సమయంలో సరమాడటానికి చక్కటి మార్గం చూపిస్తుంది. పడుకునే సమయంలోనూ.. రాత్రి పూట ఆస్కారం లేనివారు తెల్లవారుజామునైనా పూర్తిస్థాయిలో సరసమాడే కోటాను ఖచ్చితంగా భర్తీచేయాల్సి వుంటుంది.

ఖచ్చితంగా ప్రతీరోజూ 8గంటలు నిద్రపోవాలి..
శాస్త్రీయ పద్దతిలో ఆరోగ్యంగా బరువుతగ్గాలనుకునేవారు ఎప్పుడు సమయం దొరికితే అపుడు సరసమాడటానికే సమయాన్ని కేటాయించాలి..రోజులో మీకు వీలుపడినపుడు సరసమాడటం వలన శరీరంలో అసలట మొదలై మీరు ఆహారం తిని నిద్రకు ఉపక్రమించగానే మీకు తన్నుకొని వస్తూ పట్టేస్తుంది. ఎవరైతే రోజు ఖచ్చితంగా 8గంటల పాటు నిద్రపోతారో వారి శరీరంలో బరువు పెరిగే అవకాశం ఉండదు. పైగా సరసమాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ సెక్స్ చేయడం వలన నాడీ వ్యవస్థ  ఉత్తేజితం అవుతుంది. శరీరానికి మెదడుకి రక్త ప్రసరణ చురుగ్గా జరిగి రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఆ ఉత్సాహం ప్రతీరోజూ సరైన సమయానికి సరసమాడటానికి మన మెదడుకి ప్రత్యేకంగా సంకేతాలను పంపిస్తుంది. దానితో ప్రతినిత్యం అనుకున్న సమాయానికి సరమడాటానికి మీరు సిద్దపడిపోతారు. ఆ రతి క్రీడ ముగిసిన తరువాత ఎంత ఆగాలన్నా నిద్ర ఆగదు. తిరిగి తెల్లవారు జాము వరకూ తెలివి రానంతగా నిద్రపడుతుంది. మీకు అవకాశం వుంటే తెల్లవారుజామున మరోసారి సరసమాడితే మరీ ప్రయోజనం వుంటుంది..ఆరోజు చేయాలనుకున్న పనులన్నీ అలసట లేకుండా చక చకా చేసేస్తారు ఆ ఉత్సాహంతో..

ప్రేమ, అభిమానం, ఆప్యాయలు వ్రుద్ధి చెందుతాయ్..
ఎవరైతే ఆరోగ్యంగా బరువు తగ్గాలని భావిస్తారో వారు ముందు నవ్వడం..నవ్వించడం..ప్రేమగా.. ఆప్యాయతగా ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి. తద్వారా జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి కాకుండా మరెవరూ మన ఆలోచనలోకి రారు. అలా ఎపుడైతే జీవితంలో ప్రేమ బంధం గట్టిపడుతుందో భార్య, పిల్లలు, కుటుంబం అనే ఆప్యాయతలు వ్రుద్ది చెందుతాయి. ప్రేమ నుంచే కోరికలు, ఆనందాలు, సరికొత్త ఆలోచనలు జీవిత భాగస్వామికి కూడా పుట్టుకొస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు భార్యపై ప్రేమను పెంచుకోవడం ద్వారా ఆమెకు అన్ని పనుల్లో సహాయం కూడా చేస్తారు. ఇలా చేయడం వలన కూడా మరో పది కేలరీలు శరీరంలో కొవ్వు కరగడానికి ఆస్కారం వుంటుంది. బంధాలు కూడా బలపడతాయ్.. దానితో మీలో కేలరీలు ఏ విధంగా తగ్గించాలనే ఆలోచన మీ జీవిత భాగస్వామిలో మొదలై దానికి అనుగుణంగానే ఆహార నియమాలు పాటించడానికి సహాయ పడతారు. మీ శరీరంలో కొవ్వు పెరగకుండా..మీ మెదడు మొద్దుబారిపోకుండా జాగ్రత్త పడతారు. ఆ విధంగా సమతుల్య ఆహారాన్ని అందిస్తారు. ఆవిధంగా కూడా ఆరోగ్యంగానే అనుకున్న మొత్తంలో బరువు తగ్గడానికి వీలుపడుతుంది.

బంగిమలతో కండరాలు బలపడతాయి.. సమతుల్య ఆహారంతో శక్తి..
సరసమాడే సమయంలో వివిధ రకాల బంగిమలతో ప్రయత్నం చేయడం ద్వారా శరీంలోని కండరాలు బలపడతాయి. అదే సమయంతో ఇటు మీకు..మీ జీవిత భాగస్వామికి శరీరంలో అనుకోకుండా మొదలైన ఒళ్లు నొప్పులు తెలియకుండానే తగ్గిపోతాయి. దాని వలన రక రకాల మందులు వేసుకునే పనుండదు. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వేడి నీరు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అవకాశం ఉన్నప్పుడల్లా వేడినీరు మాత్రమే తాగడానికి ప్రయత్నించాలి..వేడి నీరు కూడా శరీరంలోని చమటను మనకి తెలియకుండానే బయటకు పంపుతుంది. పీచు పదార్ధాలను అధికంగా తీసుకోవడం, పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గడానికి అవకాశం వుంటుంది. అదే సమయంలో తీపి పదార్ధాలను పూర్తిగా తగ్గించాలి..తీపికి అలవాటు పడితే పాలలోనూ, తినాలనుకునే పదార్ధాల్లోనూ తేనెను వినియోగించాలి.. రోజులో కనీసం రెండు నిమ్మకాల రసాన్ని శరీరంలోకి పంపాలి. అదీ కూడా ఉదయం తేనె వేడినీటితో కలిపి తీసుకోవడం ద్వారా కడుపులోని వ్యర్ధాలు, మలినాలు బయటకు పోతాయి. దీని వలన కూడా కాస్త బరువు తగ్గడానికి ఆస్కారం వుంటుంది. 

ఆఖరి మాటే అసలైన విలువైన చిట్కా..
పైన పేర్కొన్నవన్నీ మనకి తెలిసినవే కానీ మనలో చాలా మంది అవి పాటించరు. అలా పాటించకపోవడం ద్వారా కూడా బరువుతగ్గే పరిస్థితి ఉండదు. అనుకున్నది ఆచరణలో పెట్టడం ద్వారా శరీరంలో అనవసరంగా పేరుకు పోయిన కొవ్వును సరసమాడి తగ్గించుకోవచ్చు. అలా తగ్గించుకోవాలంటే ఈరోజు నుంచే ఈ ఫార్ములాను పాటించండి. మీకు అనునిత్యం సరసమాడటానికి సమయం లేకపోతే వారంలో నాలుగు రోజులైనా పాటించండి. ఈ విధంగా పాటించి చాలా మంది ఆరోగ్యంగా బరువు తగ్గారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే ఈ రోజు నుంచే సరసమాడటం మొదలు పెట్టండి.. సరసమాడమన్నామని..ఎక్కడపడితే అక్కడ సరసమాడితే బరువుతు తగ్గడం మాట దేవుడెరుగు..హెచ్ఐవీ ఎయిడ్స్ లాంటి సుఖ వ్యాధులు వచ్చినా వస్తాయి. అందుకని మనం చేయాలనుకునే సరసరం మన ఇంట్లో నాలుగు గోడల మధ్యే ఆనందంగా..సంతోషంగా జరగాలి..ఈ విధంగా జరిగితే మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మీ పిల్లలు, మీరు మీజీవిత భాగస్వామితో ఆడి ఆడి అలసిపోయిన సరసం తద్వారా తగ్గిన బరువు ఖచ్చితంగా కనిపిస్తాయి.. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫార్ములా ఒక్కసారి ట్రైచేయండి..ఆరోగ్యంగా బరువు తగ్గండి..ప్రేమలు, అభిమానాలు..సుఖనిద్ర, మెదడులో చురుకుదనం మీ సొంతం చేసుకోండి..ఆల్ బెస్ట్..!

Visakhapatnam

2022-07-29 05:48:13

విజయనగరం జిల్లాకు 250 సిలిండర్లు..

విజయనగరం  జిల్లాలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 250 డి. టైప్ సిలిండర్లు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. ఏ.పి. వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థ వద్ద వీటిని భద్రపరచి జిల్లాలోని అవసరమైన ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తామని తెలిపారు. థర్డ్ వేవ్ ని ద్రుష్టిలో పెట్టుకొని అన్ని ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ సిలెండర్లను సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఆక్సిజన్ కొరత లేకుండా, సిలెండర్లు లేవనే మాట రాకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.

Vizianagaram

2021-07-10 14:56:55

Visakhapatnam

2021-07-01 02:11:00

నేలఉసిరి మొక్క ఉపయోగాలివే..

మన నిత్యజీవితంలో ఎదరుయ్యే రుగ్మతలు, రోగాలు, చర్మవ్యాధులకు నేల ఉసిరి(భూ ఆమ్ల) దివ్యఔషదంగా పనిచేస్తుంది. దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుంటే ఖచ్చితంగా పెరటితోటలో దీనిని పెంచుకుంటారంటే అతిశయోక్తి కాదేయో..కామెర్లు ఇంగ్లీష్ లో జాండీస్ అని పల్లెటూర్లలో పసిరికలు అని అంటారు. నేల ఉసిరి లో హెపటైటిస్ బి అనే వైరస్లను నిర్మూలించే శక్తి అధికంగా ఉంటుంది. ఈ మొక్కను వేర్లతో సహా తీసుకొని వచ్చి రోట్లో వేసి మెత్తగా నూరి వచ్చిన రసాన్ని పెరుగులో కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే కామెర్లు మనకు వెంటనే తగ్గుతాయి. అటు చర్మ వ్యాధులైన  గజ్జి తామర ఎక్కువగా బాధపడేవారు ఈ మొక్కను తీసుకొనివచ్చి మెత్తగా దంచుకొని ఒక ముద్దలా చేసుకుని ఉప్పుతో కలిపి గజ్జి తామర ఉన్న ప్రదేశంలో ఉంచినట్లయితే వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఎముకలు విరిగినప్పుడు ఈ మొక్కను వేర్లతో సహా తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి రోట్లో వేసి మెత్తగా నూరి విరిగిన దేశంలో ఉంచి కట్టుకట్టినట్లయితే అక్కడ నొప్పి వాపు తగ్గి విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఎంతగానో దోహదపడుతుంది.

మరీ ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నేల ఉసిరి మొక్కలో కాల్షియం ఆక్సలేట్ ను కరిగించే శక్తి ఉండటం వలన మూత్రపిండాలలోని రాళ్లు ఇది కలిగిస్తుంది. 2004లో జరిగిన పరిశోధనలలో శాస్త్రవేత్తలు ఈ విషయం వెల్లడించారు. నేల ఉసిరి మొక్కను ఒక కషాయంలా చేసుకొని తాగడం వల్ల మూత్రపిండాలలోని రాళ్లు కరుగుతాయి.  పైగా మూత్ర సంబంధిత సమస్యల నివారణకు ఈ మొక్కచక్కగా పనిచేస్తుంది. ఈ మొక్కలోని వేర్లతో సహా తీసుకువచ్చి దీనిని మెత్తగా నూరి, వెలక్కాయ లోపల గల గింజల పొడిని ఒక భాగము, జీలకర్ర పొడి ఒక భాగము ఈ మూడింటిని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడడం వలన ఉపశమనం లభిస్తుంది.


పాము కాటు విరుగుడు కు ఈ మొక్కను  మెత్తగా నూరి పాము కరిచిన ప్రదేశంలో ఉంచితే విషయము లోపలికి ఇవ్వకుండా చేస్తుంది తర్వాత వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. చాలా మందికి వెక్కిళ్ళు ఎక్కువగా రావడం ఆకలి లేకపోవడం సమస్యతో బాధపడే వారు నేల ఉసిరి ఆకు ఉదయము సాయంత్రము నమలడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.  పైగా వైరస్ వలన వచ్చే జ్వరాలు, అనేక వైరస్ల వల్ల వచ్చే జ్వరాలు అని తగ్గించడానికి ఈ మొక్క ఆకులను బాగా నూరి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉదయము సాయంత్రము తీసుకోవాలి.  వీటితో పాటు మరెన్నో రోగాలకు నేల ఉసిరి చాలా చక్కగా పనిచేస్తుంది..

Visakhapatnam

2021-06-29 01:53:45

కరోనాలో మిరియాలు చేసే మేలు అమోఘం..

సుగంధ ద్రవ్యాలలో రారాజు మిరియం.. అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ స్పిచెస్ చెబుతారు.. ఆహారాల్లో రుచిని పెంచడానికి మిరియాలను వాడతారు. దీంతో ఆహారానికి మంచి రుచి వాసన వస్తుంది. అంతే కాదు మిరియాలను ముఖ్యంగా ఔషధంగా ఎక్కువగా వాడతారు. కరోనా వైరస్ ఉద్రుతంగా ఉన్న సమయంలో మిరియాల వాడకాన్ని ప్రతినిత్యం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జలుబుకు, దగ్గుకు, గొంతు గర గరకు, ముక్కు దిబ్బడకు, అజీర్తికి ఇలా అనేక వ్యాధులకు మిరియాలు ఎంతగానో పనిచేస్తాయని చెబుతున్నారు. మిరియాలను నూర్చే టప్పుడు వెలువడే పొట్టును ఒక సంచిలో వేసి దాన్ని ఒక దిండుగా వాడతారు. దాని వలన తలనొప్పి వంటి దీర్ఘ వ్యాధులు దూరం అవుతాయి. పోషకాల విషయానికొస్తే చిట్టి మిరియాలలో పీచు పదార్థం, ఐరన్, మాంగనీసు, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్ళలో దొరుకు తాయి.  ఆయుర్వేదంలో కృష్ణమరీచంగా పిలిచే మిరియాలు అద్భుతమైన వంటింటి ఔషధంగా చెబుతారు. కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌గా పరిగణించే మిరియాల్లో ఘాటైన పిపరైన్‌, చావిసైన్‌ గుణాలు శరీరంలో పేరుకున్న కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి. ఒక్క జలుబు, దగ్గు మాత్రమే కాదు.. మరెన్నో విధాల మేలుచేస్తాయి మిరియాలు. జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు తోడ్పడతాయి. లాలాజలం ఊరేలా చేస్తాయి. ఉదరంలో పేరుకున్న వాయువును వెలుపలికి నెట్టివేసే శక్తి మిరియాల సొంతం. శరీరంలో రక్తప్రసరణా వేగవంతం అవుతుంది. కొవ్వు పేరుకోకుండా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.. వీటి వాడకం వల్ల శరీరంలో స్వేద ప్రక్రియ పెరుగుతుంది. మూత్రవిసర్జన సాఫీగా సాగుతుంది. కండర నొప్పులు దూరం... జలుబు, దగ్గు, ఆయాసంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే... గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడిచేసి.. చిటికెడు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని.. గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి.. తేనెతో రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకోవాలి. అలాగే.. అజీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు.. మెత్తగా దంచిన మిరియాల పొడిని తగినంత పాతబెల్లంతో కలిపి చిన్న ఉండల్లా చేసి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే.. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఉదరంలో వాయువులు ఏర్పడినపున్పడు... కప్పు మజ్జిగలో పావుచెంచా మిరియాల పొడిని కలిపి తీసుకుంటే.. ఫలితం ఉంటుంది. కండరాలు, నరాలు.. నొప్పిగా అనిపించినప్పుడు.. చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకోవాలి. దప్పిక తీర్చే.... కఫం అధికంగా ఉన్నవారు.. అధికబరువుతో బాధపడుతున్నవారు.. భోజనానికి గంటముందు అరగ్రాము మిరియాలపొడిని తేనెతో తీసుకుని.. వేడినీళ్లు తాగితే.. గుణం ఉంటుంది. కొందరు అధిక దప్పికతో బాధపడుతుంటారు. ఇలాంటివారు.. కాస్త మిరియాల పొడిని నీటితో స్వీకరిస్తే.. మంచిది. తరచూ జలుబు, తుమ్ములు వేధిస్తుంటే.. పసుపు, మిరియాలపొడిని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగాలి. చిగుళ్ల వాపు, నోటినుంచి నెత్తురు కారడం.. వంటి సమస్యలు బాధిస్తుంటే.. చిటికెడు రాళ్లఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి.. గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే ఉపశమనం ఉంటుంది. కీళ్లవాతంతో బాధపడే వారికి.. మిరియాలను నువ్వుల నూనెలో వేయించి.. పొడిచేసి నొప్పి ప్రాంతంలో కట్టు కడితే.. నొప్పి, వాపు తగ్గుతుంది. చర్మవ్యాధులు, గాయాలు :మిరియాల పొడిని, నెయ్యితో కలిపి రాసుకుంటే ఎగ్జిమా, స్కేబిస్, ఇతర అలర్జీ సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. మిరియాల పొడిని, పసుపుతో కలిపి మూడు, నాలుగు రోజుల పాటు ముఖానికి రాసుకుంటే మొటిమలు ఇట్టే తగ్గిపోతాయి. గాయలు తగిలినపుడు మిరియాల పొడి పెడితే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రక్తస్రావం ఆగిపోతుంది. కడుపులో మంట ఉన్నవారు.. వేళకు ఆహారం సక్రమంగా తీసుకోనివారు.. అధిక శరీర వేడి ఉన్నవారు.. మిరియాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీటిలోని ఘాటైన ద్రవ్యాలు మరీ వేడిని పెంచి.. సమస్య తీవ్రమయ్యే ఆస్కారముంటుంది. అందుకే ఈ సూచన. వైద్యుల సలహా ప్రకారం వాడితే.. ఏ ఇబ్బందీ ఉండదు. చిన్నపిల్లలకు పావుచెంచా.. పెద్దవాళ్లు అరచెంచా చొప్పున తీసుకోవచ్చు. మిరియాల పొడి...లాభాలు మరికొన్ని చిట్కాలు : మనం వాడే ప్రతి వంటకాలలో మిరియాలు, మిరియాలపొడి తప్పనిసరిగా ఉంటుంది. అవి మనకు, మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నోలాభాలను కలిగిస్తుందని చెబుతున్నారు వైద్యులు.


వంద గ్రాముల మిరియాలలో
పిండిపదార్థాలు: 49 గ్రా,
మాంసకృత్తులు: 10.5 గ్రా,
కొవ్వు: 6.8గ్రా,
ఖనియాలు: 4.4గ్రా,
పీచు: 14.9 గ్రా,
క్యాల్షియం: 460 మిల్లీగ్రా,
ఇనుము: 12.4మిల్లీగ్రా,
ఫాస్పరస్‌: 198 మిల్లీగ్రా,
కెరొటీన్లు: 1080 మిల్లీగ్రా,
మెగ్నీషియం: 171 మిల్లీగ్రా,
శక్తి: 304 కెలోరీలు

Visakhapatnam

2021-05-16 02:50:20

కరోనాలో మీ ఆరోగ్య నేస్తం బొప్పాయి..

కరోనా వైరస్ విజ్రుంభిస్తున్న సమయంలో మాత్రల రూపంలో వచ్చే ఆరోగ్యం బొప్పాయి పండు తీసుకోవడం ద్వారా కలుగుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటే అతిశయోక్తి కాదు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు లభిస్తాయని సూచిస్తున్నారు. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరం వుంటుంది. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే. ఆ జబ్బులను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలని వైద్యులు సూచిస్తుంటారు. కరోనా సమయంలో పడిపోయే ప్లేలెట్లను పెంచడానికి బొప్పాయి ఎంతగానో ఉపయోగ పడుతుంది. అదేవిధంగా బొప్పాయి ఆకు రసం కూడా అదే స్థాయిలో పనిచేస్తుంది. ఆకు రసాన్ని తాగలేని వారు నేరుగా బొప్పాయిని తీసుకోవచ్చు. ఉదరంలోని పేగులు శుభ్రమైతే శరీరం లోకి వైరస్ నిల్వ ఉండే పరిస్థితి వుండదు. దీంతో శరీరం ఉల్లాసంగా తయారై తనపని తాను చేసుకుంటూ పోతుంటుంది. మందుల ద్వారా విటమిన్లు కోసం ఆరాటపడేకంటే సహజసిద్ధంగా దొరికే బొప్పాయిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి, అందానికి అందం రెండూనూ...ఏమంటారు.

Visakhapatnam

2021-05-15 04:20:17

కరోనాలో మిక్సిడ్ వెజ్ కర్రీతోనే ఉపయోగం..

కరోనా సమయంలో బలవర్ధక ఆహారం తీసుకోవాలనుకునే వారికి మిక్సిడ్ వెజ్ కర్రీ ఎంతో ఉపయోగంగా వుంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు అన్ని రకాల కూరగాయలను కూర చేసుకోవడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఐరన్, కాల్సిషియం మోతాదులు బాగా శరీరంలోకి చేరుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చిబటానీ, పన్నీరు, క్యాప్సికమ్, పుట్టగొడుగులు, ఆకుకూరలు, కాలీఫ్లవర్, బంగాళదుంప, బేబీకార్న్, టామాటా, కొత్తిమీర, మెంతికూర, కేరెట్, బీట్ రూట్, ముల్లంగి, క్యాబేజీలను కలుపుకొని ఈ మిక్స్ డ్ వెజ్ కర్నీ తయారు చేసుకోవడం ద్వారా పోషక విలువలు అధికంగా చేరుతాయని చెబుతున్నారు. కరోనా సమయంలో బలవర్ధక ఆహారం తీసుకోవాలనుకునేవారు ఈ రకంగా చేసుకోవడం ద్వారా శరీరానికి మంచి ఆహారం అందించిన వారవుతారని చెబుతున్నారు. కూరలన్నీ నువ్వుల నూనెతోగానీ, బటర్ తో చేసుకోవడం ద్వారా రుచికి రుచితోపాటు, ఆరోగ్యం కూడా సొంతమవుతుందంటున్నారు. వీటితోపాటు దానిమ్మ, ద్రాక్ష, పైనాపిల్, బొప్పాయి, స్ట్రాబెర్రీ జ్యూస్ ల ద్వారా సి విటమిన్ బాగా శరీరంలోకి చేరుతుందన్నారు. జామకాయ, మామిడి  పళ్లను, కేరెట్, బీట్ రూట్ లను నేరుగా తీసుకోవడం ద్వారా మంచి ఉపయోగం ఉంటుంది ఇవి తీసుకోవడంతో పాటు మజ్జిగ, తరచూ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

హెల్త్ డెస్క్

2021-05-11 03:28:05

హిందూపురంలో ఆక్సిజన్ ప్లాంటు..

అనంతపురం జిల్లా  హిందూపురం సమీపంలో తూముకుంట వద్ద వేదిక్ ఇస్పాత్ సంస్థ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ లో లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభిం చేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉత్పత్తి ప్రారంభించిన ప్లాంటులో రోజుకు 7 నుంచి 10 కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందన్నారు. వేదిక్ ఇస్పాత్ ఉత్పత్తి చేస్తున్న లిక్విడ్ ఆక్సిజన్ ను బీ-టైప్, డీ-టైప్ సిలిండర్ల ద్వారా అనంతపురం సర్వజనాస్పత్రి, కదిరి, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఈ ప్లాంటు నుండి రోజుకు 1000 బీ-టైప్, డీ-టైప్ సిలిండ ర్లు ఉత్పత్తి అవుతున్నాయన్నారు.

జిల్లాలోనే మరో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ లో  ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభం కావడంపై కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మధ్యే శింగనమలలో 8 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంటు ద్వారా లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు.  ఆక్సిజన్ సరఫరా కోసం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతిపై పూర్తిగా ఆధారపడకుండా కరోనా నేపథ్యంలో జిల్లాలోనే ఆక్సిజన్ ఉత్పత్తి చేసి  ఆక్సిజన్ కొరత లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టామని కలెక్టర్ వివరించారు.

హిందూపురం

2021-05-03 15:07:08

ఆర్డీ ఆఫీసు గొడవ వీడియో బయటకొచ్చింది..?

నాభూ...తో నా భవిష్యత్ అన్న కామెడీ కింగ్ బ్రహ్మానందం డైలాగు మీకు గుర్తుందా మీకు..పోన్లేండీ గుర్తులేకపోతే గురువారం వైద్య ఆరోగ్యశాఖ ఆర్డీ కార్యాలయంలో ఓ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ కి బి.సెక్షన్ సూపరింటెండెంట్ కు తారా స్థాయిలో గొడవ, అరపులు, కేకలు, బూతు పురాణం..మొత్తం విన్నవారు చెబుతారు..చెప్పడమేంటి ఆ గొడవ జరిగిన తరువాత అదే విషయం డిప్యూటీ డైరెక్టర్ వరకూ వెళ్లినా...గొడవ జరిగింది ఏం చేయగలం..నేనేమో డిప్యూటేషన్ అధికారిని అన్నట్టు..ఏమీ జరగనట్టు ఇరువురి మధ్య జరిగిన గొడవనూ జస్ట్ సినిమా చూసినట్టు చూసివెళ్లారు డిప్యూటీ డైరెక్టర్..సిహెచ్ శ్రీనివాసకుమార్. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో ఈ గొడవ విషయమై విచారణ జరిగినా ఇరువురునీ ఏమీ అనకుండా..ఆ విషయం మీడియా అడిగినా సమాధానం చెప్పకుండా చాలా తెలివిగా వ్యవహరించారు. దీంతో గొడవ పడినవారు, గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకోవడానిక వచ్చిన వారూ మొత్తం మిలాఖత్ అయిపోయారని తేట తెల్లమైంది..ఇందులో కొత్తమేముంది అనుకుంటున్నారా..ఇక్కడేవుంది అసలు ట్విస్టు.. ఆ గొడవ జరిగిన తంతు మొత్తాన్ని ఇదే కార్యాలయంలో ఒక వర్గం వారు వీడియో తీసి దానిని మీడియాకి అందించారని సమాచారం అందుతుంది. ఈవిషయంపై విచారణ చేసినా, డిడి వీరిరువురినీ ఏమీ అనరని ముందుగానే గమనించి ఆ గొడవకు సాక్ష్యాన్ని మీడియాకి లీక్ చేశారనే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఒక ప్రభుత్వ కార్యాలయంలో గొడవ జరిగితే సూపరింటెండెంట్ స్థాయి అధికారి చక్కదిద్దాలి. అలాంటి ఆయనే మరో సీనియర్ అసిస్టెంటుతో బాహా బాహికి దిగి, ఆపై బూతు పురాణం మొత్తం వల్లెవేసి, తీరా డిడి వచ్చిన తరువాత ఏమీ తెలియనట్టు ఆ అధికారి ముందు వ్యవహరించిన  నాటకీయ పరిణామాణాలు  ఆర్డీ కార్యాలయంలో బాగా పండాయి. అప్పటి వరకూ వీడియోని బయటపెట్టని వారు తీరా ఆర్డీ వారిని ఏమీ అనకపోవడం, కనీసం మందలించకపోవడంతో ఆ గొడవ వీడియో బయట పడిందనే ప్రచారం అందరికీ ఉత్కంఠకు గురిచేస్తుంది. అసలు గొడవ పడిన విషయాన్ని సదరు డిడి ఎందుకు ద్రువీకరించలేదు.. ఎందుకు వారిని మందలించలేదు..దీనిపై ఎందుకు వివరణ కోరలేదు..చేసిన విచారణ ఎందరుకు రాష్ట్ర అధికారులకు పంపలేదనే కారణాలన్నీ బయటకొచ్చాయి. దీనితో ఆ గొడవ వీడియో కాస్తా డిహెచ్ వరకూ వెళితే ఇటు కార్యాలయ అధికారుల, అటు ఆర్డీ, మొత్తం రాష్ట్ర అధికారుల దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కావాలనే ఈ విషయాన్ని ఒక వర్గం రాష్ట్రవ్యాప్తం చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది.. కానీ ఆర్టీ కార్యాలయంలో అసలు ఏమీ జరగలేదనే విషయాన్ని మీడియాకు వివరిచడంలో అందరు సిబ్బంది బాగా నటించగలిగారు. అందరూ వెజ్ తినేవారైతే..గంపలో దమ్ బిర్యానీ ఎవరు తిన్నారబ్బా అన్నట్టు..అసలు జరిగిన గొడవను తీసిన ఆ తెరవెను వ్యక్తి ఈ విషయాన్ని ఏ స్థాయిలో అధికారులకు తెలియజేస్తాడనేది ఆశక్తిరంగా మారింది.. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి మరి..!

విశాఖపట్నం

2021-03-19 21:54:09

ప్రభుత్వాసుపత్రి కాన్పులపై ప్రజల్లో చైతన్యం తేవాలి..

ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు అయిన వారికి ఆరోగ్య ఆసరా పథకం ద్వారా రూ.4వేల రూపాయలు అందజేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తెలిపారు. ప్రభుత్వం అందించే ఈ పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు.  శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జేసి కీర్తి చేకూరి ఆరోగ్యశ్రీ జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని ఆరోగ్యశ్రీ ఇతర వైద్య అధికారులతో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులపై జేసి సమీక్షించారు. సందర్భంగా జేసి మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ సంబంధించి పేషెంట్ ల వద్ద నుంచి తీసుకున్న సొమ్మునకు పది రెట్లు పెనాల్టీ వసూలు చేయాలని ఆరోగ్య శ్రీ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందిన ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయని వారిపై కఠిన చర్యలు తప్పవని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులలో  నార్మల్ డెలివరీ అయిన వారికి ఆరోగ్య ఆసరా పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసుపత్రికి వెళ్లే టప్పుడు ప్రజలు తమ వెంట తప్పనిసరిగా వారికి ఇవ్వబడిన ఆరోగ్యశ్రీ గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని జెసి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి (ఇన్చార్జి)డా. ప్రసన్న కుమార్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.పి రాధాకృష్ణ, రంపచోడవరం కోఆర్డినేటర్ డా పి.ప్రియాంక, జిల్లా మేనేజర్ కే నవీన్ పాల్గొన్నారు.

Kakinada

2021-03-19 16:35:02

అర్బన్ హెల్త్ సెంటర్లకు చురుగ్గా ఏర్పాట్లు..

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధితో పాటు జిల్లాలో రెండు చోట్ల అర్భన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పతివాడ సత్యసూర్యనారాయణ తెలియజేశారు. శుక్రవారం విశాఖలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం 72 హెల్త్ సెంటర్లు జివిఎంసీ పరిధిలోనూ, యలమంచిలిలో రెండు, నర్సీపట్నంలో మూడు సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే ఈ కేంద్రాలకకు సంబంధించిన వసతి సౌకర్యం దాదాపు పూర్తయిందన్నారు. ఇంకా 24 కేంద్రాల ఏర్పాటుకి స్థలాలు సేకరిస్తున్నామని, అవికూడా రెండు మూడురోజుల్లో పూర్తవుతాయన్నారు. కాగా ఈ కేంద్రాల్లో శాస్వత ప్రాతిపదికన వైద్యుల నియామకం చేపట్టి నట్టు చెప్పారు. ఖాళీగా ఉన్న 11 డాక్టర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని, దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కు నివేదించామన్నారు. ఒక్కో హెల్త్ సెంటర్ లో ఒక వైద్యుడు, ఒక స్టాఫ్ నర్సు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పనిచేస్తారని వివరించారు. ఈ కేంద్రాల వలన జిల్లా ఆసుపత్రులపై భారం తగ్గడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి నిరుపేదలకు స్వాంతన చేకూరుతుందన్నారు. ఈ కేంద్రాల ఏర్పాటు పూర్తయిన తరువాత ఆయా వార్డుల పరిధిలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వం వైద్యసేవలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు ఎంతో వేగంగా జరుగుతుందని డీఎంహెచ్ఓ మీడియాకి వివరించారు.

Visakhapatnam

2021-03-19 15:40:30