కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బి.శ్రీరాములు టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కు రూ.1.20 కోట్ల విలువైన డి.ఎస్.ఎన్.జి వాహనాన్ని శుక్రవారం విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి తరఫున ప్రతినిధి మంజునాథ్ వాహనం తాళాలను టిటిడి అదనపు ఈవో మరియు ఎస్వీబీసీ ఎండి ఎ.వి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎ.వి.ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆలయం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాల్లో జరిగే సేవలు, ఇతర ధార్మిక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఆధునిక టెక్నాలజీతో కూడిన ఈ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా దాతకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈఓ సురేష్ కుమార్, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
భారత దేశంలో ఇపుడు ప్రతీ పనికి అవసరమయ్యేది ముందుగా ఆధార్ కార్డు మాత్రమే.. ప్రతి ఒక్కరూ దగ్గర తప్పకుండా ఉండాల్సిన గుర్తింపు కార్డ్ కూడా ఇదే. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే వృద్దుల వరకు ప్రతి చిన్న విషయంలో దీని యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం దీనిని జాగ్రత్తగా భద్రపర్చుకోవాల్సిన సమయం ఆశన్నమైంది. కానీ కొన్నిసార్లు మన అజాగ్రత్త వల్ల లేక మరే ఇతర కారణాల వల్ల మనం ఈ ఆధార్ కార్డు పోగొట్టుకుంటే బాధపడాల్సిన అవసరం ఇకపై లేదని చెబుతోంది కేంద్రప్రభుత్వ సంస్థ ఉడాయ్. ఎందుకంటే మనకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-యూఐడీఏఐ వెబ్సైట్లో ఈ-ఆధార్ రూపంలోనో, ఆధార్ లెటర్, ఆధార్ పీవీసీ కార్డు రూపంలోనో పొందవచ్చు. దీనిని పొందటానికి చాలా రకాల పద్దతులున్నాయి. కానీ అన్నింటికంటే తేలికైన పద్దతి మీ ముఖాన్ని స్కాన్ చేసి ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం. ఇది ఇపుడు చాలా పాపులర్ అయ్యింది. దీనికోసం ఏం చేయాలో ఇపుడు చూద్దాం.. ముందుగా ఆధార్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవడం కోసం మనం ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. తరువాత హోమ్ పేజీలో "గెట్ ఆధార్ కార్డు' సెక్షన్లో డౌన్‌డౌన్ పైన క్లిక్ చేయాలి. వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే మొదట మీ ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'గెట్ ఓటీపీ' పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత పేస్ ఆథెంటికేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆథెంటికేషన్ ప్రాసెస్‌లో మీ ఫేస్‌ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. "యూఐడీఏఐ" మీ ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఒకే పైన క్లిక్ చేయండి. మీ ఫోటో వెరిఫై అయిన తర్వాత ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. దీని కోసం మనం ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. చాలా సులువుగా ఎక్కడైనా దీనిని మనం డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కొన్ని అధీక్రుత కేంద్రాల్లో పీవీసి కార్డులు కూడా పొందే అవకాశం కూడా వుంది. సో ఎపుడైనా ఆధార్ కార్డు పోయిందనే బెంగ వదిలేసి ఒక్క పదినిమిషాలు నెట్ ముందు కూర్చుంటే మీ ఆధార్ కార్డు మీ దగ్గర వుంటుంది. ప్రతీఒక్కరూ ఆధార్ కార్డు ఫోటో, పీడీఎఫ్, ఫార్మాట్ మొబైల్ ఫోనులో ఉంచుకోవడం ద్వారా ఎపుడైనా అవసరం అనుకుంటే తక్షణమే దానిని ప్రింట్ తీసుకొని ఇవ్వడానికి ఎంతో వీలుగా వుంటుంది..
స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహా నగరానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్-2020లో విశాఖ స్మార్ట్ సిటి ప్రపంచ నగరాలతో పోటీ మరీ ఆ గుర్తింపు సాధించుకుంది. ఆర్కే బీచ్ లో దివ్యాంగుల పిల్లలు ఆడుకోవడం కోసం ఏర్పాటు చేసిన పార్కు వినూత్నంగా ఉండటంతో లివింగ్ అండ్ ఇన్‌క్లూజన్ అవార్డు కేటిగిరిలో మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ సక్సస్‌పుల్ ప్రాజెక్టుగా దీనిని గుర్తించారు. విశాఖ బీచ్‌రోడ్డులోని రూ.3.50 కోట్లతో ఈ పార్కును ఏర్పాటు చేశారు. పార్కులో క్లైంబింగ్నెట్, పిల్లలు ఆడుకునే ఎక్వప్మెంట్, పిష్డాక్, మ్యూజికల్ పోల్స్, ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణతో తీర్చిదిద్దే ల్యాండ్ స్కేప్‌లు ఎంతో చక్కగా వుంటాయి. ప్రస్తుతం ఈ పార్కు ఆర్కే బీచ్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా కూడా అతి తక్కువ కాలంలో నిలిచింది. దేశంలో రూపొందించిన తొలి ఎబిలిటి పార్కు ఇదే కావడం కూడా మరో విశేషం. ఆశక్తికర విషయం ఏమంటే ఈ పార్కు ఏర్పాటును చూసి యూకే, అమెరికన్ల అంబాసిడర్లు కూడా ప్రశంసల జల్లు కురిపించారు. ఈ అవార్డు లభించడపై గ్రేటర్ కమిషనర్ డా.స్రిజన మాట్లాడుతూ.. ఇదే స్పూర్తితో వచ్చే ఏడాది తొలి స్థానం సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రస్తుతం విశాఖ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఎన్నో అభివ్రుద్ధి పనులు చేపడుతున్నామని అవన్నీ పూర్తయితే విశాఖ మహానగరం మరింత సుందరంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఆ చీకటి ఘట్టం కృష్ణా జిల్లా దివిసీమ ఉప్పెన కు 43 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 నవంబర్ 19 అర్ధరాత్రి సముద్రుడు ఉగ్రరూపం దాల్చి గ్రామాలపై విరుచుకుపడ్డ కాళ రాత్రి. ఆ నాటి సముద్ర ఉగ్ర రూపానికి గ్రామ గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. నవంబర్ 18 సాయంత్రం వాతావరణంలో మార్పులు సంభవించి ఆకాశం మేఘావృతంమై చిరు వర్షపు జల్లులు కురిశాయి. ఇది వర్షమే కదా అని దివి ప్రజలు భావించారు అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మార్పు చెంది ఆయా ప్రాంతాలు చీకట్లు కమ్మాయి. దీంతో సముద్ర తీర ప్రాంతాలలోని గ్రామాలలోని ప్రజలు ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. ఇంతలోనే పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులు సంభవించడంతో పాటు భారీ వర్షం కురియ సాగింది. సముద్రుడు మరింత ఉగ్రరూపం దాల్చి అలలు తాడి చెట్టు ఎత్తున ఎగసిపడి గ్రామాలపై విరుచుకుపడ్డాయి. అలల నీటి ప్రళయంలో గ్రామ గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. సుమారు రెండు గంటల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది. రాత్రి 7 గంటలకే అర్ధరాత్రిని తలపించిన ఆరాత్రి సముద్రం లోపల పెద్ద పేలుడు శబ్దం.పెద్దవారు బడబాగ్ని పగిలిందన్నారు. ఇళ్లలోని ప్రజలు భయంతో దేవాలయాలలో, ప్రార్థనా మందిరాలలో, కమ్యూనిటీ భవనాలలో తలదాచుకున్నారు. మరికొంతమంది ఇంటి పై కప్పు ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయగా మరికొందరు చెట్లు, చెట్ల కొమ్మలు ఎక్కి వేలాడారు.అంతలోనే ఒక్కసారిగా సముద్రపు అలలు విరుచుకుపడడంతో ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వందలాది మంది మృత్యువాత పడ్డారు. కొందరు చెట్ల కొమ్మలకు పట్టి ప్రాణాలు విడిచి వేలాడ గా, ఎటు చూసినా శవాల గుట్టలే కనిపించాయి. పశువులు నీటి ప్రళయంలో కొట్టుకుపోయి మృత్యువాత పడడంతో పశువుల కలేబరాలే కనిపించాయి.19 ఉదయం దివిసీమ మృత్య సీమగా మారి ఆయా ప్రాంతాలు శవాలు, పశువుల కాళీబరాలతో కనిపించడంతో మృతుల బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలే వినిపించాయి. భర్తలను కోల్పోయిన వారు కొందరైతే, మరికొందరు భార్యలను కోల్పోయి, పిల్లలను సైతం కోల్పోయిన వారు కొందరు దీనితో దివిసీమ రూపురేఖలు మారిపోవడంతో పాటు గ్రామ గ్రామాలు చెదిరిపోయాయి. ఆనాటి శాసనసభ్యులు, మంత్రి మండలి వెంకట కృష్ణారావు దివి ప్రజలకు అండగా నిలవడంతో పాటు చెదిరిపోయిన దివిసీమకు పూర్వ వైభవం తీసుకురావడానికి విశేష కృషి చేశారు. ఉప్పెనలో చనిపోయిన మృతుల శవాలను స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు దహన సంస్కారాలు నిర్వహించారు. అప్పటి పోలీస్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఎన్ వి నారాయణ రావు ఐపీఎస్ పోలీసు బలగాలను దింపి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా నాగాయలంక మండలం సొర్ల గొంది గ్రామాన్ని దత్తత తీసుకొని భవనాలు నిర్మించడం తోపాటు అందుకు చిహ్నంగా స్థూపాన్ని కూడా నిర్మించారు. ఆ స్తూపం నేటికీ దివిసీమ ఉప్పెన కు చిహ్నం గా ఉంది. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ, సేవా మూర్తి మదర్ తెరిసా దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు దివిసీమను సందర్శించి వారి సహకారాన్ని అందించారు. సినీనటులు అక్కినేని నాగేశ్వరరావు,ఎన్ టి రామారావు,కాంతారావు లతోపాటు పలువురు దివిసీమ ఉప్పెన బాధితుల సహాయనిధికోసం ప్రతి ఊరు తిరిగి విరాళాలు సేకరించారు. తీవ్రంగా ఆస్తి, పంట నష్టం జరగడంతో పాటు దివిసీమ ఉప్పెన ఉప్పెన వందలాది గ్రామాలను తుడిచిపెట్టుకుపోవడం తో తీవ్ర ఆస్తి నష్టం తో పాటు, పంటనష్టాన్ని కలిగించింది. నాగాయలంక, కోడూరు మండలాలతో పాటు దివిసీమలో సుమారు 20 వేల ఎకరాలకు పైబడి పంట నష్టం జరిగింది. వీటితో పాటు ఆస్తి నష్టం కూడా కోట్లలో జరిగింది. ఆస్తి, పంట నష్టం తో పాటు రహదారులు పూర్తిగా చెదిరిపోయాయి. గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు అంతర్గత రహదారులు పూర్తిగా ధ్వంసం అవడంతో గ్రామాలకు వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది.
తెలుగు రాష్ట్రాల్లో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి పండుగలను ఘనంగా నిర్వహించారు. ఉదయ 8 గంటల నుంచే భక్తులు పుట్టలో పాలు పోయడం ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో అందరూ అత్యధిక జనాభా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా వేర్వేరు ప్రాంతాల్లో పాలుపోయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా భక్తులంతా ఒకేసారి పుట్టలో పాలుపోయడానికి భయకు రావడంతో అంతా జాగ్రత్తలు పాటించాల్సి వచ్చింది. పుట్ట పూజ అనంతరం అంతా శైవ క్షేత్రాలకు వెళ్లి శివయ్య దర్శనం కూడా చేసుకోవడాని బారులు తీరారు. మరోవైపు పాముల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, పాములు కనిపిస్తే పట్టుకోవడానికి విశాఖలో స్నేక్ సేవర్ సొసైటీ పది మందితో రెస్క్యూ టీమ్ ను నిర్వాహకులు స్నేక్ కిరణ్ ఏర్పాటు చేశారు. పెద్ద పుట్టలు, అధికంగా జనాభా వచ్చేచోట వారిని ఏర్పాటు చేశారు. భక్తులకి ఎలాంటి పాములు కనిపించినా, మరే ఇతర సమస్యలు వచ్చినా తమకు తెలియజేయాలని గత రెండు రోజుల నుంచి ప్రచారం చేయడం కూడా విశేషం.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి పళనిస్వామికి టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం శ్రీ వకుళామాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీ పళనిస్వామికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఈఓ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్ మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఒక ప్రైవేటు యూనివర్శిటీ ఏర్పాటు కావాలంటే అండర్ సెక్షన్ 3 యూజిసి యాక్టు 1956 ప్రకారం (గతంలో 100 ఎకరాలు భూమి, ఇపుడైతే 50 ఎకరాల భూమిలో అనుమతిస్తున్నారు అదీ పది కాలేజీలు, ఆచార్యుల క్వార్టర్స్, విద్యార్ధుల హాస్టల్స్, క్రీడామైదానం, ల్యాబులు, పరిశోధన ప్రదేశాలు, జువాలజీ గార్డెన్) ఉండాలి. అదీ సదరు భూమిలో ఎలాంటి ఆక్రమణలు, లిటికెంటులు ఉండటానికి వీల్లేదు. అలాంటి క్లీన్ చిట్ వున్నభూమి ఉందని, ప్రభుత్వ యూనివర్శిటీలతో పాటు ప్రైవేటు యూనిర్శిటీల అవసరం ఉందని సదరు విద్యాసంస్థను యూనివర్శిటీ మార్పుచేయడానికి తొలుత మంత్రి మండలిలో ఆమోదం తెలిపిన తరువాత ఏపి లెజిస్లేచర్(శాసన సభ)లో బిల్లు పాస్ చేయడానికి ప్రవేశపెడతారు, పాసైన బిల్లుతోపాటు, ప్రైవేటు యూనివర్శిటీ ఏర్పాటు చేయబోయే సంస్థ యొక్క ఫైలుపై అన్నీ సక్రమంగా ఉన్నాయని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సంతకం చేస్తారు. వాటిని యూజిసికి అనుమతి కోసం పంపుతుతారు. నేరుగా ప్రభుత్వం ఆమోందించిన ఫైలును పరిశీలించిన యూజీసి ప్రతిపాదిత విద్యాసంస్థలను ప్రైవేటు డీమ్డ్ యూనివర్శిటీలుగా మార్చుకునేందుకు అనుమతి ఇస్తుంది. సరిగ్గా ఇపుడు అదే విధానాన్ని అవలంభించి భూ దురాక్రమిత ప్రైవేటు గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ విషయంలో కూడా ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపి, గీతం రద్దు బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. అంటే ముల్లుని ముల్లుతోనే తీయాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖలోని రుషికొండ ప్రాంతంలో సుమారు 40.50 ఎకరాల ప్రభుత్వ భూమిని దురాక్రమించిన గీతం తన విద్యాసంస్థలను ప్రైవేటు డీమ్డ్ యూనివర్శిటీగా(13.08.2007)న మార్చుకుంది విద్యాసంస్థల యాజమాన్యం. అటు యూజిసికి, ఇటు ఎన్ఎంసీకి, ఏఐసిటిఈకి, నేక్ కి ప్రభుత్వ భూమిని ఆక్రమించి మరీ, తమ భూములుగా చూపించి అన్ని రకాల అనుమతులు పొందిన గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీపై అదే లెజిస్లేచర్ లో రద్దు బిల్లు పెట్టడం ద్వారా యూనివర్శిటీ గుర్తింపును రద్దు చేయడానికి అవకాశం వున్నందున ఆ విధానాన్ని పాటించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే అక్రమాస్తులతో గుర్తింపులు తెచ్చుకొని అటు కేంద్రంప్రభుత్వ సంస్థలను, ఇటు విద్యార్ధుల భవిష్యత్తుతో వ్యాపారం సాగించిందనే సాంకేతిక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి గీతం అవినీతిని విధాన సభ ముందు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. అంటే ఈరకంగా.. గీతం విద్యాసంస్థలతోపాటు ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు పెట్టే సమయానాకి ఏ ప్రభుత్వం లెజిస్లేచర్ లో బిల్లు పెట్టింది, ఎలాంటి మినిట్స్ తో బిల్లు పెట్టింది, బిల్లు పెట్టే సమయానికి గీతం విద్యాసంస్థలును యూనివర్శిటీగా మార్చుకోవడానికి ఎన్ని ఎకరాల సొంత భూమిని అనుమతులకోసం చూపించారు, చూపిస్తే ఆ భూమి ఏ సర్వేనెంబర్లలో చూపించారు, ప్రస్తుతం గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ ఎన్ని ఎకరాల భూమిలో విస్తరించి వుంది, తదితర వివరాలన్నీ తీసుకొని, ఆపై ఇటీవల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి వివరాలతో ఒక ప్రత్యేక ఫైలుతో ప్రైవేటు బిల్లు తయారు చేసి, దానిని లెజిస్లేచర్ లో రద్దు బిల్లును ఆమోదించి, ఆపై అదే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా కూడా యూజిసికి ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అంటే ఏదైతే లేని భూమిని ఉన్నట్టుగా చూపి అనుమతులు పొందిందో...అవే భూములు గీతంవి కావని, దురాక్రమించినవని ప్రభుత్వం అసెంబ్లీలో కూడా రుజువు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. తమవికాని చూపించినపుడు యూజిసి యూనివర్శిటీగా అనుతించినపుడు, చూపించిన భూముల్లో అగ్రభాగం ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్టు రుజువైన సమయంలో యూజిసి గీతం కి ఇచ్చిన గుర్తింపుని రద్దు చేయాల్సి వుంది. ఒక్కసారి ఏపీ లెజిస్లేచర్ లో ప్రైవేటు యూనిర్శిటీల రద్దు బిల్లు పాసైతే మళ్లీ గీతం అనుకూలిత ప్రభుత్వం వచ్చేవరకూ గీతంకు యూజిసి అనుమతులు గాలిలో ఉండాల్సిందేనని విద్యావేత్తలు చెబుతున్నారు. అదీ అప్పటికి సదరు యూనివర్శిటీకి సొంత భూములుంటే...ఇపుడు ఆ పరిస్థితి లేదు. ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మిగిలిన ఆక్రమిత భూముల్లో పక్కానిర్మాణాలు చేసింది వాటిని స్వాధీనం చేసుకునే సమయంలో గీతం కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంది. గీతం యూజిసిని కూడా విద్యార్ధుల భవిష్యత్తు డ్రామాతో మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుందనే సమాచారంతో ప్రభుత్వం యూనివర్శిటీల ఏర్పాటు బిల్లు ద్వారానే రద్దు బిల్లు కూడా పెట్టి గీతంకి చరమగీతం పాడటానికి పక్కాగా ఆధారాలు సేకరిస్తుందని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే యూజిసి గీతంని వెనుకేసుకు వచ్చినా...ఇటు లెజిస్లేచర్, అటు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ద్వారా ఆ బిల్లు రద్దు అయితే గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీకి యూజితోపాటు, ఏఐసిటిఇ, ఎన్ఎంసీ, నాక్ గుర్తింపులన్నీ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఏంజరుగుతుందనేది భూ దురాక్రమిత గీతం తెరపై చూడాల్సిందే..!