భారీగా కేన్సిలైన ఆ మొబైల్ నెంబర్లు..
Ens Balu
2
Mumbai
2020-11-23 10:21:55
హైస్పీడ్ ఫ్రీ ఇంటర్నెట్, ఫ్రీ కాల్స్ అని మొదలు పెట్టిన ప్రైవేటు మొబైల్ నెట్వర్కులు గత మూడు నెలలుగా భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి.. భారతదేశ వ్యాప్తంగా ఒక్క నవంబరు నెలలోనే సుమారు 23 లక్షల మొబైల్ నెంబర్లు కేన్సిల్ అయ్యాయట. ఏంటి ఒక్కసారిగా ఇన్ని నెంబర్లా అనుకుంటున్నారా నిజమేనండి. గతంలో ఒక్కసారి రీచార్జ్ చేస్తే మొబైల్ నెంబరు ఏడాది పొడువునా కనీసం ఇన్ కమింగ్ అయినా వచ్చేది. ప్రస్తుతం ప్రైవేటు మొబైల్ ఆపరేటర్లు నిబంధనలు మార్చడంతో మూడు నెలల కాలంలో దేశవ్యాప్తంగా 45 లక్షల నెంబర్లు క్యాన్సిల్ అవగా ఒక్క నవంబరు నెలలోనే 23 లక్షలు నెంబర్లు కేన్సిల్ అయ్యాయని ఇటీవల జరిగిన ఒక సర్వేలో తేలింది. అయితే రద్దైన నెంబర్లు అధికంగా ఆఫర్లు, ఇంటర్నెట్ కోసం తీసుకున్నవి సగానికి పైగా ఉండటంతో మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ఇపుడు ద్రుష్టి సారించి వినియోగదారులను ఆకట్టుకోవడానికి మళ్లీ కొత్త ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. గతంలో రెండు మూడు మొబైల్ నెంబర్లు వినియోగించే వారంతా ఏడాదికి కనీస రీచార్చి రూ.2600, నెలకు కనీసం రూ. 149 రీచార్జి చేయాల్సి రావడంతో ఒకటి లేదా రెండు నెంబర్లతో సరిపెట్టుకుంటున్నారు. కొందరైతే ఏకంగా ఫ్రీ ఆఫర్లతో ఎగబడి కొన్న జియో, ఎయిర్ టెల్, బిఎస్ఎన్ ఎల్, ఐడియా నెంబర్లును వదిలించుకుంటున్నారు. అదే విధంగా మిగిలిన నెట్వర్కులలో నెంబర్లు కూడా వినియోగదారులు వదులుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఫ్రీ అని మొదలెడితే ఫ్రీ అయిపోయిన తరువాత వినియగదారులు కూడా అదే స్థాయిలో వాటిని వదిలేస్తారని రుజువు కావడంతో మళ్లీ పోయిన వినియోగ దారులను తెచ్చుకునే పనిలో పడ్డాయి మొబైల్ నెట్వర్క్ కంపెనీలు..