అన్ లాక్ 5.0 నిబంధనలు అనుసరించి స్విమ్మింగ్ ఫూల్స్ ను తెరవడానికి మార్గం సుగమం అయ్యింది. అయితే కొన్ని నిబంధనలను అనుసరించి మాత్రమే వీటిని తెలరవాల్సి వుంటుందని కేంద్రం సూచిస్తుంది. క్రీడాకారులకు శిక్షణనిచ్చే ఈతకొలనులను ఈనెల 15వ తేదీ నుంచి తెరవడానికి అనుమతినిస్తూ గతనెల 30వ తేదీన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే వీటి కోసం కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల ఉన్న వాటికి అనుగుణంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ) జారీ చేయాల్సి ఉంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, ఆరోగ్యం&కుటుంబ సంక్షేమ శాఖను సంప్రదించిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ.. ఎస్‌ఓపీని రూపొందించింది. ఆ నియమ నిబంధనలన్నీ కేంద్రప్రభుత్వం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ (https://yas.nic.in/)లో ఎస్‌ఓపీని లో పొందుపరిచింది. ఈతకొలనులు తెరవాలనుకునేవారు వీటి ఆదారంగా నిబంధనలు అమలు చేయాల్సి వుంటుందని కేంద్రం పేర్కొంది...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశం అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ భేటీ జరగనుందని సమాచారం అందుతుంది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపీకి ప్ర్యతేక హోదా విషయంలో కూడా ప్రధానికి సీఎం వైఎస్ జగన్ వివరించినట్టు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రానికి ఆర్ధిక లోటుపై తదితర అంశాలపై ప్రధాని మోదీకి సీఎంవివరించారు. రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో కేంద్రం వైఎస్సార్సీపీ ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించడానికే సీఎం వైఎస్ జగన్, ప్రధాని మోదీ మధ్య ప్రస్తానవ వచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతున్నా ఈ విషయాన్ని అధికారికంగా ద్రువీకరించలేదు. ఈ పర్యటన మొత్తమంతా అభివ్రుద్ధి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించే ప్రాజెక్టుల విషయమై మాత్రమే సాగిందని అధికా వర్గాలు వెల్లడించాయి..
దేశవ్యాప్తంగా 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో వరి ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని కేంద్రం ప్రకటించింది. ఈనెల 3వ తేదీ నాటికి మొత్తం 5,73,339 మె.ట. సేకరణ పూర్తయిందన్న కేంద్రం... 41,084 మంది రైతుల నుంచి ఈ ధాన్యం సేకరించి, కనీస మద్దతు ధరగా రూ.1,082.464 కోట్లు చెల్లించామని పేర్కొంది.. 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో, ఈ నెల 1వ తేదీ నుంచి గింజ పత్తి (కపస్) సేకరణ కూడా ప్రారంభమైందిని పేర్కొంది. ఈనెల 3వ తేదీ వరకు, 29 మంది రైతుల నుంచి 147 బేళ్ల పత్తిని 'కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' సేకరించింది. కనీస మద్దతు ధరగా రూ.40.8 లక్షలు చెల్లించినట్టు పేర్కొంది. అన్ని ప్రాంతాల నుంచి కాటన్ ను పూర్తిస్థాయిలో సేకరిస్తామని సిసిఓ వివరించింది. లాక్ డౌన్ 5.0 నిబంధనలు అనుసరించే ఈ సేకరణలు చేపడుతున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ పేర్కొంది...
'సూపర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పెడో' (స్మార్ట్) ప్రయోగం విజయవంతం కావడం దేశానికే గర్వకారణమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సోమవారం ఒడిశాలోని వీలర్ ద్వీపం నుంచి ఉదయం 11.45 గం.కు ప్రయోగం జరిగింది. క్షిపణి పరిధి, ఎగిరిన ఎత్తు, ముందు భాగం విడుదల, టోర్పెడో విడుదల, వేగ నియంత్రణ వ్యవస్థ సహా ప్రయోగంలోని అన్ని దశలు అంచనాలకు తగ్గట్లుగా సమర్థంగా పని చేశాయి. దీంతో ఇంత చక్కగా లక్ష్యాలు చేధించిన స్మార్ట్ పైనా, డిఆర్డీఓ అధికారులను మంత్రి ప్రశంసించారు. డీఆర్‌డీఎల్, ఆర్‌సీఐ హైదరాబాద్, ఏడీఆర్‌డీఈ ఆగ్రా, ఎన్‌ఎస్‌టీఎల్ విశాఖపట్నం కలసి, స్మార్ట్‌కు అవసరమైన సాంకేతికతలను అభివృద్ధి చేశాయి. స్మార్ట్ క్షిపణి సాయంతో విడుదలయ్యే తేలికపాటి జలాంతర్గామి విధ్వంసక టోర్పెడో వ్యవస్థ. టోర్పెడో పరిధికి మించివున్న జలాంతర్గామి విధ్వంసక యుద్ధ కార్యకలాపాల్లో వినియోగిస్తారు. జలాంతర్గామి విధ్వంసక యుద్ధ కార్యకలాపాల్లో మన దేశ సత్తాను ఈ ప్రయోగం చాటింది. తీరం వెంబడి ఉన్న పర్యవేక్షక కేంద్రాలు (రాడార్లు, ఎలెక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు), తక్కువ పరిధి ఓడలు, టెలిమెట్రీ కేంద్రాలు ప్రయోగంలోని అన్ని దశలను పర్యవేక్షించాయని డీఆర్డీఓ చైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి పేర్కొన్నారు. జలాంతర్గామి విధ్వంసక యుద్ధ కార్యకలాపాల తీరును మార్చే సాంకేతికతగా స్మార్ట్‌ను అభివర్ణించారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యుజిసి) ఈరోజు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 123 కాలేజీలకు ఇచ్చిన ‘యూనివర్సిటీ’ హోదాను రద్దు చేస్తు న్నట్లు ప్రకటించింది. ఇకపై ఆ కాలేజీలు తమ పేరు చివర ‘యూనివర్సిటీ’ అని వ్రాసుకోకూడదని ఆదేశించింది. కనుక అవన్నీ మళ్ళీ కొత్తపేరు కోసం కేంద్రమానవ వనరుల శాఖకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలలో డీమ్డ్ యూనివర్సిటీ హోదా కలిగిన నాలుగు కాలేజీలు దూరవిద్య ద్వారా జారీ చేసిన బిటెక్ (ఇంజనీరింగ్) డిగ్రీలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూజిసి నిర్ణయంతో ‘యూనివర్సిటీ’ హోదా కోల్పోయిన వాటిలో విశాఖపట్నంలో గీతం కాలేజీ (గాంధీ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ అండ్’ మేనేజ్ మెంట్), తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, అనంతపురంలోని శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, గుంటూరులోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కె.ఎల్. యూనివర్సిటీ), విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ (విట్) ఉన్నాయి. తీగలాగితే దొంక కదిలినట్లు, డీమ్డ్ యూనివర్సిటీ హోదాతో రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాలలో నాలుగు కాలేజీలు కరస్పండ్ కోర్సుల ద్వారా ఇంజనీరింగ్ డిగ్రీలు జారీ చేయడంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటితో సహా దేశంలో అన్ని డీమ్డ్ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో డీమ్డ్ యూనివర్సిటీ హోదాలో రకరకాల కోర్సులను ప్రవేశపెడుతూ, అవి జారీ చేస్తున్న సర్టిఫికేట్లకు అనేక సంస్థలు గుర్తించకపోవడంతో వాటిలో లక్షలు ఖర్చు చేసి చదవుకొని ఆ కోర్సులు పాసైన విద్యార్ధులు, వారి తల్లితండ్రులు లబోదిబోమంటున్నారు. ఈ ‘డీమ్డ్ యూనివర్సిటీ భాగోతాలు’ సుప్రీం కోర్టు దృష్టికి రావడంతో వాటిపై కటినచర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో యుజిసి ఈ నిర్ణయం తీసుకుంది. యుజిసి తీసుకున్న నిర్ణయం దేశం పెను సంచలనం స్రుష్టిస్తోంది.