సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఒ)కు చెందిన డిజి సహా పలు స్థాయి అధికారులను, సిబ్బందిని వారు సాధించిన విజయాలకు అభినందిస్తూ, ఏకకాలంలో 44 వంతెనలను అంకితం చేయడమన్నది ఒక రికార్డు అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. భారత ఈశాన్య, ఉత్తర, పశ్చిమ సరిహద్దులకు సమీపంలోని సున్నిత ప్రాంతాలను అనుసంధానం చేసే 44 శాశ్వత వంతెనలను సోమవారం జాతికి అంకితం చేస్తూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నూతన శకానికి తెరతీశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని నేచిఫు సొరంగమార్గ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ 44 వంతెనలు ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. సరిహద్దులలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో బిఆర్ ఒ పాత్రను కొనియాడుతూ, ఈ వంతెనలు సుదూరంగా ఉన్న పశ్చిమ, ఉత్తర, ఈశాన్య రంగాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరి, స్థానిక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందని ఆయన అన్నారు. రహదారులు, వంతెనలు ఏ దేశానికైనా జీవనాడి వంటివని, సుదూర ప్రాంతాల సామాజిక, ఆర్ధిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని రక్షణ మంత్రి తెలిపారు. సరిహద్దు ప్రాంతాలలో అభివృద్ధి కార్యకలాపాలను పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ అంకిత భావాన్ని నొక్కి చెప్తూ, అన్ని ప్రాజెక్టుల అభివృద్ధిని పర్యవేక్షిస్తూ, వాటిని సకాల నిర్వహణకు తగిన నిధులను సమకూరుస్తున్నామని మంత్రి వివరించారు. ఒకవైపు కోవిడ్-19 సంక్షోభం, మరోవైపు పాకిస్థాన్, చైనాల కారణంగా చెలరేగుతున్న సరిహద్దు వివాదాలు, ఉద్రిక్తతల వంటి సంక్లిష్ట కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమర్ధవంతమైన నాయకత్వంలో దేశం వాటిని ఎదుర్కొనేందుకు దృఢ సంకల్పంతో ఉండడమే కాకుండా , అభివృద్ధికి సంబంధించిన అన్ని రంగాలలోనూ చారిత్రిక మార్పులు తేవాలనే పట్టుదలతో ఉందని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. జాతికి అంకితం చేసే ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్, దేశ భద్రతాదళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్, సైన్యాధ్యక్షుడు జనరల్ ఎం.ఎం. నారావానే, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యూఢిల్లీలో నిర్వహించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, సిక్కి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు, జమ్ము కాశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్తో పాటుగా పార్లమెంటు సభ్యులు, పాలన/ సఐనిక అధికారులతో సహా ఆయా రాష్ర్టాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు దీనికి హాజరయ్యారు.
భారతదేశంలో కొత్తగా కోలుకున్నవారిలో 77% మంది పది రాష్ట్రాలలోనే ఉండగా అందులో మహారాష్ట్ర, కర్నాటక ఒకే రోజులో 10,000 మందికి పైగా కోలుకున్నారు. గత 24 గంటలలో కొత్త కోవిడ్ పాజిటివ్ నమోదైన కేసుల సంఖ్య 66,732 కాగా, వాటిలో దాదాపు 81% పది రాష్ట్రాలలోనే నమోదు కావటం గమనార్హం. 10,000 కి పైగా కేసులతో మహారాష్ట్ర అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మిగలగా దాదాపు 9,000 కేసులతో కర్నాటక, కేరళ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఇక 24 గంటలలో కోవిడ్ మరణాలు 816 నమోదయ్యాయి. వీటిలో 85% కేసులు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. నిన్నటి మరణాలలో 37% పైగా (309 మంది) నమోదు చేసుకున్న మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలతోపాటు, ప్రజలకు మెరుగైన వైద్యసేలు కూడా మెరుగ్గా అందడటంతో కోవిడ్ కేసులు తగ్గుదల నమోదు అవుతుందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది.
కరోనావైరస్ లాంటి విపత్కర సమయంలో వాల్తేరు రైల్వే డివిజన్ ఇనుపరద్దు అమ్మడం ద్వారా ఒకేరోజులో రూ.7.43 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చిందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకె త్రిపాటి తెలియజేశారు. వాల్తేరు డివిజన్ వ్యాప్తంగా పేరుకు పోయిన ఇనుప స్క్రాప్ ను వేరు చేసి ఈ-వేలం నిర్వహించగా ఇందులో మొత్తం స్క్రాప్ అమ్ముడుపోయి భారీ మొత్తంలో ఏడుకోట్ల 43 లక్షల రూపాయల ఆదాయం లభించిందన్నారు. ఈ క్రమంలో డివిజనల్ మెటీరీయల్స్ మేనేజర్ కెబితిరుపతయ్య కీలక పాత్ర పోషించారని చెప్పారు. వాల్తేరు డివిజనల్ రద్దును అమ్మాలనుకున్నపుడు ఆ మొత్తం వివరాలను ఆన్ లైన్ లోనే అందుబాటులో ఉంచుతుందనే విషయాన్ని అందరూ గమనించడం వలన ఒకేసారి రద్దును అమ్మకం చేయడానికి అవకాశం కుదిరిందన్నారు. ఈ ఘనత ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అత్యుత్తమ రికార్డుగా ఆయన అభివర్ణించారు.
హైదరాబదుతో సహా రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారు లను, ప్రజలను సీఎం కె. చంద్రశేఖర్ రావు కోరారు. రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసాయి. అదేవిధంగా సోమ, మంగళ వారాల్లో కూడా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని, అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని సీఎం కోరారు. భారీ వర్షాలు, వాటితోపాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సీఎం కోరారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ లకు సమాచారం అందించాలని, వాటిని జిల్లా అధికారులు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు...
అనంతపురం జిల్లాకి ఆయన కలెక్టర్ కానీ.. అక్టోబరు 11 ప్రపంచ బాలికల దినోత్సవం రోజును పురస్కరించుకొని కొత్తగా ఆయన మరో కలెక్టర్ ను తయారు చేశారు.. దగ్గరుండి కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించడానికి ఆయన మార్గదర్శి అయ్యారు.. ఆ చారిత్రక అవకాశం జిల్లాలోని ఇంర్మీడియట్ చదువుతున్న ఎం.శ్రావణిని వరించింది. ఆ అమ్మాయి ఒక్కరోజు కలెక్టర్ గా పనిచేయడానికి ఆ జిల్లా కలెక్టర్ కర్త, కర్మ, క్రియ, అయ్యారు. ఆ అమ్మాయి తన జీవితంలో ఓ ఉన్నత లక్ష్యాన్ని ఎన్నోకోవడానికి కలెక్టర్ గంధం చంద్రుడు చేసిన వినూత్న కార్యక్రమం పలువు విద్యార్ధులను కలెక్టరు, జిల్లా అధికారులు, పంచాయతీ కార్యదర్శిలను చేసింది. ఒక ఐఏఎస్ అధికారి ఆలోచన సరళి ఎంత స్పూర్తిదాయంకంగా వుంటుందో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుని చూస్తే అర్ధమయ్యే దేశానికే వివరించి చూపారాయన.. ఐఏఎస్ ల గౌరవాన్ని అమాంతం పెంచే విధంగా విద్యార్ధుల్లో ఉన్నత లక్ష్యాలకు బాటలు వేసుకునేలా చేసిన కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇక కలెక్టర్ గా బాధ్యలతు చేపట్టిన శ్రావణి ఆనందానికి అవధులు లేవు. కలెక్టర్ సార్ తన జీవితంలో మరుపురాని అవకాశం కల్పించారని, తాను మంచి చదువులు చదివి ఖచ్చితంగా కలెక్టర్ అవుతానని చెప్పింది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున తనకు వచ్చిన అవకాశం జీవిత లక్ష్యానికి తొలిమెట్టుగా భావించి, తాను కూడా ఐఏఎస్ అయి ప్రజలకు నిశ్వార్ధ సేవలు చేస్తానని కలెక్టర్ కు వివరించింది శ్రావణి. కొత్తగా ఒక రోజు కలెక్టర్ గా చేసిన అమ్మాయికి, నిజంగా ఒక కలెక్టర్ అయివుండి కూడా విధులు స్వీకరించే టపుడు అధికారులు ఏ విధమైన గౌరవ మర్యాదలు చేస్తారో ఒక్కటి కూడా పొల్లుపోకుండా ఆ అమ్మాయిని కూడా అదేవిధంగా కలెక్టర్ గంధం చంద్రుడు కలెక్టరేట్ వద్ద రిసీవ్ చేసుకొని, ఆమెను కలెక్టర్ చాంబర్ వరకూ తీసుకొని వచ్చి, కలెక్టర్ చైర్ లో కూర్చోబెట్టి, ఆమెను ఒక్కరోజు కలెక్టర్ ను చేయడంతోపాటు, ఆమె మనుసులో ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయో వాటిని వివిధ శాఖల అధికారులును ఆదేశించాలా చేశాయి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత బాలికకు రూ.25 వేలు పరిహారం అందించే ఫైల్ పై సంతకం చేసిన ఒక రోజు కలెక్టర్ శ్రావణి సంతకం చేయడం విశేషం. రాత్రి 8 గంటల తర్వాత ఉదయం 8 గంటలకు ముందు మహిళా ఉద్యోగులను అధికారిక పనుల గురించి ఫోన్ లు చేసి ఆటంకం కలిగించకూడదని ఉత్తర్వులు జారీ చేసిన ఫైల్ పై కూడా సంతకం చేశారు ఒక్కరోజు కలెక్టర్.. ఆ తరువాత కలెక్టర్ హోదాలో ఆ విద్యార్ధిని మీడియాతో కూడా మాట్లారు. ఆ విషయాన్ని అన్ని మీడియాలు ప్రముఖంగా చూపించాయి. అందులో ముఖ్యంగా అందరికంటే ముందుగా ఈరోజు న్యూస్ సర్వీస్ కిచెందిన అధికారి ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్ ప్రపంచానికి తెలియజేసింది. నిజంగా కలెక్టర్ అయిన ఆయన కూడా ఒక సాధారణ ఉద్యోగిలా పక్కన నిలుచొని మరీ ఈ కార్యక్రమాలు చేపట్టడం గంధం చంద్రుడి యొక్క స్పూర్తిదాయకమైన ఆలోచనకు ప్రతీ ఒక్కరూ సలామ్ చేశారు..! దటీజ్ గంధం చంద్రుడు ఐఏఎస్, అనంతపురం జిల్లా కలెక్టర్..!
భారతీయులు విదేశాల్లో ఉన్న సమయంలో అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతి (ఐడీపీ) గడువు ముగిస్తే, ఐడీపీ పునరుద్ధరణకు వీలు కల్పించడానికి, కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989కు సవరణ కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. దీనిపై ఈనెల 7వ తేదీన ముసాయిదా ప్రకటన జీఎస్‌ఆర్ 624(ఇ)ని కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. భారతీయ పౌరులు విదేశీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా విదేశాల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతి గడువు తీరిపోతే, దానిని పునరుద్ధరించుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు విదేశాల్లో లేవని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాంటి వారికి ఊరటనిస్తూ ప్రస్తుత సవరణ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ సవరణ అమల్లోకి వస్తే, విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల పోర్టళ్ల ద్వారా భారతీయ పౌరులు ఐడీపీ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ఆర్‌టీవోల పరిశీలన కోసం ఆ దరఖాస్తు 'వాహన్'కు చేరుతుంది. మన దేశంలో దరఖాస్తు చేసే సమయంలో వైద్య ధృవీకరణ పత్రం, చెల్లుబాటయ్యే వీసా ఉండాలన్న నిబంధనలను కూడా ప్రస్తుత ప్రతిపాదన ద్వారా తొలగించనున్నారు. చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పౌరుడు వైద్య ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదు. 'వీసా ఆన్ అరైవల్' ఇచ్చే దేశాలకు భారతీయులు వెళ్లే సమయంలో, మన దేశంలో సమర్పించడానికి వారి వద్ద వీసా అందుబాటులో ఉండదు. కాబట్టి, చెల్లుబాటయ్యే వీసా ఉండాలన్న నిబంధన తొలగించనున్నారు. సలహాలు, సూచనలు పంపాల్సిన చిరునామా: జాయింట్ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ హైవేస్, ట్రాన్స్‌పోర్ట్ భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూదిల్లీ-110001. ఈమెయిల్: jspb-morth@gov.in. ప్రకటన విడుదల తేదీ నుంచి 30 రోజుల్లోపు సలహాలు, సూచనలు పంపాలి.