1 ENS Live Breaking News

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఆదివారం అర్ధరాత్రి వరకూ  81,170 మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ. 4.23 కోట్లు వచ్చింది. 27,236 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 10 కంపార్ట్ మెంట్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శ నాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-27 04:01:34

అల్లూరి అనుచరులు కుటుంబాల కోసం ఒక్క అడుగు

విప్లవజ్యోతి, అగ్గిపిడుగు అల్లూరి సితారామరాజు ప్రధాన అనుచరుడు గాం గంటం దొర కుటుంబాలని సహాయం అందించేందుకు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ముందుడుగు వేసింది.  తన వంతు భాద్యతగా ఆ కుటుంబానికి వైద్య పరీక్షలు నిర్వహించి, పౌష్టికాహారాన్ని అందిం చింది. అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, నడింపాలెం గ్రామం శివారులో ఉన్న గంటం దొర మునిమనవడు కుటుంబాన్ని పరామర్శిం చింది. వారి యొక్క యోగ క్షేమాలను తెలుసుకుంది. ఈ సందర్భంగా అల్లూరి చరిత్ర పరిశోధకులు, ఈఎన్ఎస్ చీఫ్ రిపోర్టర్ పి.బాలభాను( ఈఎన్ఎస్ బాలు) మాట్లాడుతూ, అల్లూరి చరిత్ర పరిశోధనలో భాగంగా, అల్లూరి అనుచరుల కుటుంబాల ఏ విధంగా ఉన్నాయో ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్ల నున్నట్టు చెప్పారు. క్రిష్ణదేవిపేట వేదికగా జరిగిన మన్యం పితూరి సమయంలో  అల్లూరి వెంట నడిచిన ప్రతీ అనుచరుడి కుటుంబాన్ని భాహ్య ప్రపంచానికి పరిచియం చేసేందుకు అల్లూరి సంచరించిన ప్రదేశాల్లో పరిశోధన చేపట్టినట్టు చెప్పారు.

Visakhapatnam

2023-02-26 11:54:00

మార్చిలో తిరుమలలో విశేష ఉత్సవాలు ఇవే

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చినెల నిర్వహించే ఉత్సవాలను అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మార్చి 3న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం,  మార్చి 3 నుంచి 7వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు,  మార్చి 7న కుమారధార తీర్థ ముక్కోటి,  మార్చి 18న శ్రీ అన్నమాచార్య వర్ధంతి,  మార్చి 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం,  మార్చి 30న శ్రీరామనవమి ఆస్థానం, మార్చి 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Tirupati

2023-02-26 09:09:02

మార్చి 7వ వరకు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 3 నుండి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.  తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 3న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచం ద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 4న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో మూడుసార్లు విహరిస్తారు. ఇక మూడవరోజు మార్చి 5న శ్రీభూ సమేతంగా మలయప్పస్వా మివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 6న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 7వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో  ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. తోమాలసేవ, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు. మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Tirumala

2023-02-26 09:02:20

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని  శనివారం అర్ధరాత్రి వరకూ 76,736 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 3.63 కోట్లు వచ్చింది. 34,132 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 22 కంపార్ట్ మెంట్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-26 02:01:22

మాది వైఎస్సార్ పార్టీనా.. ఇంకాఏదైనానా..? క్లారిటీ కావాలి

కేంద్ర ఎన్నికల సంఘానికి అమలాపురం ఎంపీ రఘురామ క్రిష్ణరాజు ఈరోజు లేఖ రాసి తనక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరారు. ఆయన లేఖలో పేర్కొన్న విధంగా  అసలు మాది వైఎస్సార్ పార్టీనా లేక.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనా..? క్లారిటీ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అంతేకాకుండా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపడం లేదని, అలా ఎన్నికలు జరపని పార్టీలకు గుర్తింపు రద్దుచేయాలని.. గతంలో జరిగినది జీవితకాలం అధ్యక్షుడి ఎన్నికే అయితే పీపుల్స్ రెప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పార్టీని కూడా రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు. అదీ కుదరకపోతే పార్టీలో ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.  అంతేకాకుండా తనను  పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే.. మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి    పోటీ చేస్తానని కూడా ఉటంకించారు. ప్రస్తుతం రఘురామ క్రిష్ణంరాజు లేఖ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..!

New Delhi

2023-02-25 16:32:55

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని  గురువారం అర్ధరాత్రి వరకూ 57,737 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 3.28 కోట్లు వచ్చింది. 24,090 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 22 కంపార్ట్ మెంట్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-24 02:50:58

ఫిబ్రవరి24న రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల

శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి నెలకు సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 2 గంటల నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.  అదేవిధంగా, మార్చి నెలకు సంబంధించిన  కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవాటికెట్ల కోటాను, సంబంధిత దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి తదనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది.

Tirumala

2023-02-23 12:24:57

తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 62,101 మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.3.37 కోట్లు వచ్చింది. 25,896 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 4 కంపార్ట్ మెంట్ లలో భక్తు లు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శ నా లు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యా లు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-23 03:51:50

బారామతి కృషి విజ్ఞాన కేంద్రంలో టిటిడి అధ్యయనం

దేశీయ గోజాతుల అభివృద్ధి, డెయిరీల నిర్వహణపై మహారాష్ట్రలో క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తున్న టీటీడీ అధికారుల బృందం బుధవా రం బారామతిలోని ప్రఖ్యాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించింది.  ఇందులో భాగంగా బారామతిలోని ప్రఖ్యాత కృషి విజ్ఞాన కేంద్రం లో క్షేత్ర స్థాయి అధ్యయనం చేసింది. జన్యు ప్రక్రియ ద్వారా దేశీయ గోజాతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా ఈ బృందం పరిశీలించింది.  దేశీయ గో జాతుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యాజమాన్య పద్ధతులు, స్వచ్ఛమైన పాల దిగుబడికి అనుసరి స్తున్న విధానాలను తెలుసుకుంది. ఇందుకు అవసరమయ్యే మౌళిక వసతులను టీటీడీ అధికారులు బృందం పరిశీలించింది.  టీటీడీ గోశాలలో రోజుకు 4 వేల లీటర్ల స్వచ్ఛమైన దేశ వాళీ ఆవు పాలను దిగుబడి చేసుకోవడానికి  అనుసరించవలసిన విధానాలపై అక్కడి అధికారులు, శాస్త్రవేత్తలతో చర్చించారు. 

బారామతి కృషి విజ్ఞాన కేంద్రంలో పశువైద్యం, హార్టీకల్చర్, అగ్రికల్చర్, ఫ్లోరీకల్చర్ పై రైతులకు నూతన మెళకువలు, సాంకేతికను జోడించి సంప్రదాయ వ్యవసాయం చేయడంపై నిపుణులు శిక్షణ ఇస్తూఉంటారు. టీటీడీ గోఆధారిత ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తూ, వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారుల బృందం అక్కడి శిక్షణా తరగతుల తీరును పరిశీలించింది. రైతులను సంప్రదాయ వ్యవసాయం వైపు ప్రోత్సహించడానికి అక్కడి అధికారులు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనేక అంశాలపై అధికారులతో చర్చించారు. జేఈవో సదా భార్గవి  వెంట చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్  వెంకట నాయుడు ఉన్నారు.

Baramati

2023-02-22 13:31:58

శ్రీవాణి ఆఫ్‌లైన్‌ దర్శన టికెట్ల జారీ పునఃప్రారంభం

తిరుమలలోని గోకులం  కార్యాలయంలో బుధవారం నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది.  ఫిబ్రవరి నెల లో ఇప్పటికే 750 టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కావున తిరుమలలో ఫిబ్రవరి 28వ తేదీ వరకు రోజుకు 150 శ్రీవా ణి టికెట్లను జారీ చేయనున్నారు. మార్చి నుండి, 1000 శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాల యంలో,  100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయి.  టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆఫ్ లైన్ లో టికెట్లు పొందాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మీడియాకి విడుదల చేసిన ప్రకటన ద్వారా భక్తులకు సూచించారు.

Tirumala

2023-02-22 13:26:07

తిరుమల శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 53,755 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.7 కోట్లు వచ్చింది. 18,267 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 1 కంపార్ట్ మెంట్ లో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 14 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirupati

2023-02-22 01:55:46

భారత్ లోనూ త్వరలో భూకంపం వచ్చే అవకాశం

టర్కీ, సిరియా తరహాలోనే భారత్ లో త్వరలోనే భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని ఎన్ జీఆర్ఐ(ngri)చీఫ్ సైంటిస్ట్ డా.పూర్ణ చంద్రరావు హెచ్చరించారు. ఈరోజు ఆయన ఒక జాతీయ వార్త సంస్థలో మాట్లాడారు. ‘భూపొరల్లో ఉండే ప్లేట్లు నిరంతరం కదులుతాయి. భారత భూభాగం కింద ఉన్న ఓ ప్లేట్ ఏడాదికి 5 సెం.మీ వేగంతో కదులుతోంది. దీంతో హిమాలయాలపై ఒత్తిడి పెరిగి హిమాచల్ ప్రదేశ్, యూకేలో భారీ విపత్తు సంభవించొచ్చు.’ అని పేర్కొన్నారు. అయితే ముందస్తు చర్యలతో ముప్పు తప్పించుకోవచ్చనని హెచ్చరించారు. కాగా ఇటీవలే టర్కీ, సిరియాలో కూ భూకంప హెచ్చరికలు వచ్చాయి. అయితే హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో లెక్కకు మించిన ప్రజలు భూకంపంతో మ్రుత్యువాత పడగా, వేలల్లో భవంతులు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ నేపథ్యంలో  ఎన్జీఆర్ఐ శాస్త్రవేత చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

New Delhi

2023-02-21 16:40:03

టిటిడిలో దేశీయ గోజాతులను అభివృద్ధి చేసేదిశగా

 శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి రోజువారి అవసరమయ్యే పాలు,పెరుగు, నెయ్యి సొంతంగా తయారు చేసుకోవడానికి కార్యాచరణకు దిగిన టీటీడీ దేశంలోని అత్యుత్తమ దేశీయ గోశాలలు, డెయిరీల పనితీరును పరిశీలిస్తోంది. ఇందులోభాగంగా జేఈవో సదా భార్గవి నేతృత్వంలో బృందం మంగళవారం సాయంత్రం పూణె కు సమీపంలోని మంచార్ లో పర్యటించింది. ఆ గ్రామంలో ఉన్న పరాగ్ డెయిరీ కి చెందిన భాగ్యలక్ష్మి డెయిరీ ఫామ్ ను పరిశీలించారు. ఈ డెయిరీ లోని  గో జాతుల ద్వారా అత్యధిక పాల ఉత్పత్తికి అనుసరిస్తున్న విధానాలను వీరు క్షేత్ర స్థాయిలో తెలుసుకున్నారు. ఆ డెయిరీ  యాజమాన్యం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ మంది సిబ్బందితో  మంచి ఫలితాలు సాధిస్తున్న తీరును అధికారుల బృందం అధ్యయనం చేసింది. యంత్రాల సాయంతో  గోవులకు కష్టం లేకుండా ఒకే సారి 50 గోవుల నుంచి సులువుగా పాలు పితికే విధానాన్ని పరిశీలించి అక్కడి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  డెయిరీ నిర్వహణ, సాంకేతిక వ్యవస్థ, ఖర్చు తదితర వివరాలన్నింటితో తమకు ఒక నివేదిక అందించాలని జేఈవో సదా భార్గవి భాగ్యలక్ష్మి డెయిరీ యాజమాన్యాన్ని కోరారు. వీలైనంత త్వరగా నివేదిక అందించడానికి వారు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ వెంకటనాయుడు పాల్గొన్నారు.

Pune

2023-02-21 12:02:47

ఫిబ్రవరి 22న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి మార్చి, ఏప్రిల్, మే నెలల కోటాను ఫిబ్రవరి 22న సాయంత్రం 4  గంట‌ల‌కు టిటిడి ఆన్‌లై న్‌లో విడుదల చేయ‌నుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి.  అదేవిధంగా, మార్చి, ఏప్రిల్, మే నెలల కు సంబంధించిన మిగతా ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ జనవరి 22న ఉదయం 10 గంట‌ల‌ నుండి ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.  భ‌క్తులు ఈ విష‌యాల‌ను గుర్తించి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది. కాగా టిక్కెట్ల విడుదలకు సంబంధించి టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

Tirumala

2023-02-21 10:11:10