1 ENS Live Breaking News

తిరుమల శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శనివారం అర్ధరాత్రి వరకూ 75,452 మంది దర్శించుకున్నారు. హుండీ కాను కల ద్వారా రూ.4.05 కోట్లు వచ్చింది. 39,262 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శనాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 36 గంటల సమయం పడుతున్నది.  అన్ని కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-03-19 02:44:11

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శుక్రవారం అర్ధరాత్రి వరకూ 62,938 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.24 కోట్లు వచ్చింది. 30,751 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శనాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24  గంటల సమయం పడుతున్నది.  18కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-03-18 05:52:26

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం అర్ధరాత్రి వరకూ 59,776 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.72 కోట్లు వచ్చింది. 24,349 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24  గంటల సమయం పడుతున్నది.  19కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తు లు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-03-17 05:00:20

ఏప్రిల్ 6న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరంలో వెలసివున్న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఏప్రిల్ 6న జరుగనుంది.  పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తిప్రదాలు కలిగించేవి 7 తీర్థాలు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినా శనం మరియు పాండవ తీర్థాలు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం.

ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టిటిడి అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

Tirumala

2023-03-16 11:36:27

తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బుధవారం అర్ధరాత్రి వరకూ 63,535 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.96 కోట్లు వచ్చింది. 24,349 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 8  గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగు తున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-03-16 01:44:32

లాకప్​రూముల్లో సీసీ కెమెరాలు పెట్టండి..సుప్రీం

పోలీస్​ స్టేషన్లలోని ఇంటరాగేషన్, లాకప్​ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ వంటి విచారణ సంస్థల ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ కెమెరాలు పెట్టాలని పేర్కొంది. కస్టడీలో నిందితులపై హింసను అరికట్టేందుకు సీసీ కెమెరాలతో పాటు ఆడియో రికార్డింగ్​ కూడా చేయాలని సూచించింది. దేశంలోని అన్ని పోలీస్​ స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్​ప్లేసులతో పాటు లాకప్​ రూములు, కారిడార్, స్టేషన్​ రిసెప్షన్​ ఏరియా, సబ్​ ఇన్​స్పెక్టర్, ఇన్​స్పెక్టర్​ రూమ్​లు, వాష్​ రూమ్​ బయట సీసీ  కెమెరాలను అమర్చాలంది. ఈ ఏర్పాట్లకు అవసరమైన నిధులు కేటాయించాలని, నిర్ణీత సమయంలోపల సీసీటీవీ కెమెరాలను అమర్చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. 

ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి యాక్షన్​ ప్లాన్​ను ఆరు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ఈ కెమెరాల్లో రికార్డైన పుటేజ్​ను, ఆడియో రికార్డింగ్​ను 18 నెలల పాటు జాగ్రత్త చేయాలని, అవసరమైతే కోర్టులకు ఎవిడెన్స్​గా అందజేయాలని పేర్కొంది. పోలీస్​ స్టేషన్లలో విచారణ సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఇండిపెండెంట్​ ప్యానెల్​తో తరచూ సీసీటీవీ ఫుటేజ్​ చెకింగ్​ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రతీ జిల్లాలో హ్యూమన్​ రైట్స్​ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆర్డర్​ వేసింది. పంజాబ్​లో జరిగిన కస్టోడియల్​ డెత్​కు సంబంధించిన కేసు విచారణలో సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇంటరాగేషన్​ ఏరియాలలో కెమెరాల ఏర్పాటుకు 2018లోనే ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటి వరకూ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏర్పాట్ల సంబంధించిన వివరాలను వచ్చే నెల 27న పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.

New Delhi

2023-03-14 09:13:50

ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ 1875 ఓట్ల రిజిస్ట్రేషన్

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ద్వారా 1875 గ్రాడ్యుయేట్లతో ఓట్లను ఉచితంగా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించింది. పట్టభద్రుల ఓటింగ్ శాతం పెరగాలనే సామాజికసేవా దృక్పదంతో ఈసేవను చేపట్టింది. రెండు కంప్యూటర్లు, ఒక ఇంటర్నెట్ డివైజ్, ఇద్దరు ఆపరేటర్లను విని యోగించి ఈఉచిత సేవచేసింది. ఓట్లు వెతుక్కోవడానికి ఇబ్బంది పడిన వారందరికీ 9490280270, 9390280270 నెంబర్ల ద్వారా ఓటును వెబ్ సైట్ లో వెతికి, వారికి పోలింగ్ స్టేషన్లు, బూత్ నెంబర్ల వివరాలను తెలియజేసింది. ఎన్నికల సంఘం వెబ్ సైట్ అడ్రస్ ను కూడా విశేషంగా ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net ద్వారా ప్రచారం చేసింది. ఈ విధానం ద్వారా సుమారు 4100 మందికి వారి యొక్క ఓట్లను ఎన్నికల సంఘం వెబ్ సైట్ ద్వారా వెతికి స్క్రీన్ షాట్ల రూపంలో పంపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు తెలియజేయడంలో ప్రత్యేక భూమిక వహించి తనవంతు సేవను పట్టభద్రులకు విశేషంగా అందించింది.

vizag

2023-03-12 06:56:57

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకూ 59,392 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 4.14 కోట్లు వచ్చింది. 20,714 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శనాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 12  గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-03-01 01:54:03

తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 71,387 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 5.71 కోట్లు వచ్చింది. 24,701 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 18  గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసా గుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్న ట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-28 02:40:17

ఏపీ ప్రభుత్వ పిటీషన్ మార్చి 28కి వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. త్వరగా వాదనలు ముగించాలని జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఆ పిటిషన్లపై మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దీనిపై గతవారం విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ రాజ్యాంగ ధర్మాసనం బుధ, గురువారాల్లో మిస్‌లేనియస్ పిటిషన్లపై విచారణను నిలుపుదల చేసిన నేపథ్యంలో అప్పుడు వాయిదా పడింది. మళ్లీ తాజాగా వాయిదా పడింది. మరోప్రక్క వైజాగ్ లో రాజధాని కార్యకలాపాలు మార్చి నుంచి చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. విషయం కోర్టులోనే ఉన్నప్పుడే వారంలో రెండు రోజులు వైజాగ్ నుంచి పరిపాలన సాగించే విధంగా ఏర్పాట్లు జరగుతున్నట్టు తెలిసింది.

New Delhi

2023-02-27 09:53:19

మూడు భాషల్లో బిఆర్ఎస్ పేపర్, టివీ ఛానల్స్

బిఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా పార్టీ కార్యక్రమాలు, చేపట్టబోయే విసర్తణకు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించేందుకు మూడు భాషల్లో దినపత్రికలు ప్రారంభించాలని చూస్తుందట. తెలుగు రాష్ట్రాష్ట్రాల్లో నమస్తే తెలంగాణతోపాటు, నమస్తే ఆంధ్రప్రదేశ్, ఇక ఇంగ్లీషు, జాతీయ భాష హిందిలో కూడా పత్రికలు తీసుకురావడంతోపాటు మూడు భాషల్లో ఛానళ్లు కూడా ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. దేశస్థాయిలో రాజకీయాలు చేయాలంటే ప్రాంతీయ భాషల మీడియా ఢిల్లీలో పనిచేయదు. దీనితో దేశంలోని అత్యధికంగా మాట్లాడే భాష హిందీ, ఇంగ్లీషులో టివి ఛానళ్లు, తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు పత్రికలు కావాల్సి వుంది. దేశవ్యాప్తంగా పత్రికలు, ఛానళ్లు మూత పడుతున్నవేళ బీఆర్ఎస్ భారీగా మీడియాని విస్తరించడం ఇపుడు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది..!

Telangana

2023-02-27 09:44:07

మెడికో ప్రీతి మ్రుతిపై స్పందించిన మావోయిస్టులు

హైదరాబాద్ లో ర్యాగింగ్ బూతానికి బలైపోయిన మెడికో ప్రీతి మ్రుతిపై తెలంగాణలోని మావోయిస్టులు స్పందించారు. దీనితో ఈ విషయం రాష్ట్రంలోనే సంచలనం అయ్యింది. ఇప్పటి వరకూ ర్యాగింగ్ ను ఏ విద్యాసంస్థలోనూ నియంత్రించలేదు. దానిని అడ్డుకోనూకూడా లేదు. అయితే ఇన్నాళ్లూ నోరుమెదపని మావోయిస్టులు మెడికో ప్రీతి మ్రుతిపై స్పందించడాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సీనియస్ గానే తీసు కుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా డివిజన్ కార్యదర్శి వెంకట్ పేరిట విడుదలైన లేఖలో ర్యాగింగ్ వలనే ప్రీతి ఆత్మహత్య చేసుకుంద ని..అయి నా దానిని అధికారులు, ప్రభుత్వం కప్పిపుచ్చుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం మావోయిస్టులు నుంచి వచ్చిన స్పందనలేఖపై పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ర్యాగింగ్ కు పాల్పడ్డ వ్యక్తి,పై నిఘా ఏర్పాటు చేసినట్టు సమాచారం అందుతోంది. కాగా మ్రుతిచెందిన మెడికో ప్రాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10లక్షలు వెలకట్టడాన్ని మెడికోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Warangal

2023-02-27 07:12:44